|
||
| Previous | ||
| సంఖ్యాకాండము 30 అధ్యాయము | ||
30 మోషే ఇశ్రాయేలీయుల యొక్క గోత్రాధిపతులతో ఇట్లనెను | 2 -ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మ్రొక్కుకొనిన యెడల, లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన యెడల, అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. | 3-6 మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి యింట నుండగా యెహోవాకు మ్రొక్కుకొని బద్ధురాలైన యెడల, ఆమె తండ్రి ఆమె మ్రొక్కుబడిని ఆమె కలుగజేసికొనిన బాధ్యతను విని దానిగూర్చి ఊరకొనిన యెడల, ఆమె మ్రొక్కుబడులన్నియు నిలుచును. ఆమె తాను బద్ధురాలగుటకు పెట్టుకొనిన ఒట్టు నిలుచును. ఆమె తండ్రి వినిన దినమున ఆక్షేపణ చేసిన యెడల, ఆమె మ్రొక్కుబడులలో ఏదియు, ఆమె తన విూద పెట్టుకొనిన బాధ్యతలో ఏదియు నిలువక పోవును. ఆమె తండ్రి దానికి ఆక్షేపణ చేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును. | 7 ఆమెకు వివాహమైన తరువాత ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లయినను, నిరాలోచనగా ఆమె తన విూద పెట్టుకొనిన ఒట్టులైనను ఆమె విూద నుండుట ఆమె భర్త విని, దాని గూర్చి వినిన దినమున అతడు ఊరకుండుట తటస్థించిన యెడల, ఆమె మ్రొక్కుబళ్లును ఆమె తనవిూద పెట్టుకొనిన ఒట్టును నిలుచును. | 8 ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసిన యెడల, అతడు ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబడిని ఆమె నిరాలోచనగా తనవిూద పెట్టుకొనిన ఒట్టులను రద్దు చేసిన వాడగును; యెహోవా ఆమెను క్షమించును. | 9 విధవరాలుగాని విడనాడబడినదిగాని తన విూద పెట్టుకొనిన ప్రతి మ్రొక్కుబడి నిలుచును. | 10 ఆమె తన భర్తయింట ఉండి మ్రొక్కుకొనిన యెడలనేమి, ప్రమాణము చేసి తన విూద ఒట్టుపెట్టుకొనిన యెడలనేమి, | 11 తరువాత ఆమె భర్త విని దాని గూర్చి ఆక్షేపణ చేయక ఊరకుండిన యెడల, ఆమె మ్రొక్కుబడులన్నియు నిలుచును; ఆమె తన విూద పెట్టుకొనిన ప్రతి ఒట్టును నిలుచును. | 12 ఆమె భర్త వినిన దినమందే వాటిని బొత్తిగా రద్దు చేసిన యెడల, ఆమె మ్రొక్కుబళ్లను గూర్చియు, ఆమె విూది ఒట్టును గూర్చియు ఆమె పలికినదేదియు నిలువక పోవును; ఆమె భర్త వాటిని రద్దు చేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును. | 13 ప్రతి మ్రొక్కుబడిని, తన్ను తాను దుఃఖపరచుకొందునని ప్రమాణపూర్వకముగా తన విూద పెట్టుకొనిన ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచవచ్చును, రద్దు చేయవచ్చును. | 14 అయితే ఆమె భర్త నానాట దాని గూర్చి ఊరకొనుచు వచ్చిన యెడల, వాడు ఆమె విూదనున్న ఆమె మ్రొక్కుబడులన్నిటిని ఆమె ఒట్టులన్నటిని స్థిరపరచిన వాడగును. అతడు వినిన దినమున దానిగూర్చి ఊరకుండుట వలన వాటిని స్థిరపరచెను. | 15 అతడు వినిన తరువాత వాటిని బొత్తిగా రద్దుచేసిన యెడల, తానే ఆమె దోషశిక్షను భరించును. | 16 ఇవి భర్తను గూర్చియు, భార్యను గూర్చియు, తండ్రిని గూర్చియు, బాల్యమున తండ్రి యింటనున్న కుమార్తెను గూర్చియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన కట్టడలు. |
||
| Previous | ||