BLM
 

 
Previous
  సంఖ్యాకాండము 29 అధ్యాయము  

29 ఏడవ నెల మొదటి తేదిన విూరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. | 2-6 విూరు జీవనోపాధియైన పనులేమియు చేయకూడదు; అది విూకు శృంగధ్వని దినము. నిర్దోషమైన ఒక కోడెదూడను ఒక పొట్టేలును యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా అర్పింపవలెను. వాటి వాటి విధి ప్రకారముగా అమావాస్యకు అర్పించు దహనబలియు దాని నైవేద్యమును, నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములును గాక విూరు నిర్దోషమైన యేడాదివగు ఏడు మగ గొఱ్ఱెపిల్లలను యెహోవాకు, ఇంపైన సువాసనగల దహనబలిగా అర్పింపవలెను. వాటి నైవేద్యము నూనెతో కలుపబడిన గోధుమపిండి ప్రతి కోడెదూడతో తూములో మూడు పదియవవంతులను, పొట్టేలుకు రెండు పదియవవంతులను, ఏడు గొఱ్ఱె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియవవంతును విూ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. | 7 ఈ యేడవ నెల పదియవ దినమున విూరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మిమ్మును విూరు దుఃఖపరచుకొనవలెను; ఏ పనియు చేయకూడదు. | 8 ప్రాయశ్చిత్తము కలుగుటకై పాపపరిహారార్థబలియు నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును వాటి వాటి పానార్ప ణములునుగాక, విూరు ఒక కోడెదూడను ఒక పొట్టేలును ఏడాదివైన యేడు గొఱ్ఱెపిల్లలను యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా అర్పింపవలెను. అవి విూకున్న వాటిలో నిర్దోషమైనవై యుండవలెను. | 9 నూనెతో కలుపబడిన పిండిని నైవేద్యముగాను ప్రతి కోడెతో తూములో మూడు పదియవవంతులను ఒక పొట్టేలుతో రెండు పది యవవంతులను | 10 ఆ యేడు గొఱ్ఱెపిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియవవంతును | 11 పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. | 12 మరియు ఏడవ నెల పదునయిదవ దినమున విూరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు విూరు జీవనోపాధియైన పనులేమియు చేయక యేడు దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. | 13 నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక, యెహో వాకు ఇంపైన సువాసనగల దహనబలిగా పదమూడు కోడెదూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱె పిల్లలను అర్పింపవలెను. అవి నిర్దోషమైనవై యుండవలెను. | 14 నూనెతో కలుపబడిన గోధుమపిండిని నైవేద్యముగాను ఆ పదమూడు కోడెదూడలలో ప్రతి దూడతో తూములో మూడు పదియవవంతులను ఆ రెండు పొట్టేళ్లలో ప్రతి పొట్టేలుతో రెండు పదియవవంతులను | 15 ఆ పదునాలుగు గొఱ్ఱెపిల్లలో ప్రతి పిల్లతో ఒక్కొక్క పదియవవంతును పాపపరిహారార్థబలిగా | 16 ఒక మేకపిల్లను అర్పింపవలెను. | 17 రెండవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్య మును వాటి పానార్పణములును గాక విూరు నిర్దోషమైన పండ్రెండు కోడెదూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱె పిల్లలను విధి ప్రకారముగా, | 18 వాటి వాటి లెక్క చొప్పున, ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును | 19 పానార్ప ణములను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. | 20 మూడవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక నిర్దోషమైన పదకొండు కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱెపిల్లలను | 21 విధి ప్రకారముగా, వాటి వాటి లెక్క చొప్పున, ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లలతోను వాటి నైవేద్యమును పానార్పణములను | 22 పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.
23 నాలుగవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక నిర్దోషమైన పది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱెపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్క చొప్పున, | 24 ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లలతోను వాటి నైవేద్యమును పానార్పణములను | 25 పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. | 26 అయిదవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక నిర్దోషమైన తొమ్మిది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱెపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్క చొప్పున, | 27 ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లలతోను | 28 వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. | 29 ఆరవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్య మును పానార్పణమును గాక నిర్దోషమైన యెనిమిది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱెపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్క చొప్పున, | 30 ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును పానార్పణములను | 31 పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. | 32 ఏడవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన యేడు దూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱె పిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్క చొప్పున, | 33 ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును పానార్పణములను | 34 పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. | 35 ఎనిమిదవ దినము విూకు వ్రత దినముగా నుండును. అప్పుడు విూరు జీవనోపాధియైన పనులనేమియు చేయకూడదు. | 36 అందులో నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమునుగాక విూరు యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా నిర్దోషమైన యొక కోడెదూడను ఒక పొట్టేలును ఏడాదివైన యేడు గొఱ్ఱె పిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్క చొప్పున, | 37 ఆ కోడెదూడతోను పొట్టేలుతోను గొఱ్ఱెపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును పానార్పణములను | 38 పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. | 39 విూ మ్రొక్కుబళ్లను విూ స్వేచ్ఛార్పణములను విూ దహనబలులను విూ నైవేద్యములను విూ పానార్పణములను విూ సమాధానబలులను గాక వీటిని నియామక కాలములందు యెహోవాకు అర్పింపవలెను. | 40 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయులతో సమస్తమును తెలియజెప్పెను.

Previous