BLM
 

 
Previous
  సంఖ్యాకాండము 28 అధ్యాయము  

28 యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను | 2 -నీవు ఇశ్రాయేలీయులకు ఈలాగు ఆజ్ఞాపించుము- నాకు సువాసన కలుగుటకై విూరు హోమరూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నాయొద్దకు తెచ్చుటకు జాగ్రత్తపడవలెను. | 3 మరియు నీవు వారికీలాగు ఆజ్ఞాపించుము-విూరు యెహోవాకు నిత్యమైన దహనబలి రూపముగా ప్రతిదినము నిర్దోషమైన యేడాదివగు రెండు మగ గొఱ్ఱెపిల్లలను అర్పింపవలెను. | 4 వాటిలో ఒక గొఱ్ఱెపిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు రెండవ దానిని అర్పింపవలెను. | 5 దంచి తీసిన మూడు పళ్లలోనిది పావు నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో పదియవవంతు నైవేద్యము చేయవలెను. | 6 అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా సీనాయి కొండవిూద నియమింపబడిన నిత్యమైన దహనబలి. | 7 ఆ మొదటి గొఱ్ఱెపిల్లతో అర్పింపవలసిన పానార్పణము ముప్పావు; పరిశుద్ధస్థలములో మద్యమును యెహోవాకు పానార్పణముగా పోయింపవలెను. | 8 ఉదయ నైవేద్యమును దాని పానార్పణమును అర్పించినట్లు యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా ఆ రెండవ గొఱ్ఱెపిల్లను సాయంకాలమందు అర్పింపవలెను. | 9 విశ్రాంతి దినమున నిర్దోషమైన యేడాదివగు రెండు గొఱ్ఱెపిల్లలను నైవేద్యరూపముగాను, దాని పానార్పణముగాను నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో రెండు పదియవవంతులను అర్పింపవలెను. | 10 నిత్యమైన దహనబలియు దాని పానార్పణమును గాక యిది ప్రతి విశ్రాంతిదినమున చేయవలసిన దహనబలి. | 11 నెలనెలకు మొదటి దినమున యెహోవాకు దహనబలి అర్పించవలెను. రెండు కోడెదూడలను ఒక పొట్టేలును నిర్దోషమైన యేడాదివగు ఏడు గొఱ్ఱెపిల్లలను వాటిలో ప్రతి కోడెదూడతోను, | 12 నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో మూడు పదియవవంతులను నైవేద్యముగాను ఒక్కొక్క పొట్టేలుతోను, నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో రెండు పదియవవంతులను నైవేద్యముగాను, ఒక్కొక్క గొఱ్ఱెపిల్లతో నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో నొక పదియవవంతును నైవేద్యముగాను చేయవలెను. | 13 అది యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలి. | 14 వాటి పానార్పణములు ఒక్కొక్క కోడెతో పడిన్నర ద్రాక్షారసమును పొట్టేలుతో పడియు గొఱ్ఱె పిల్లతో ముప్పావును ఉండవలెను. ఇది సంవత్సరములో మాస మాసమునకు జరుగవలసిన దహనబలి. | 15 నిత్యమైన దహనబలియు దాని పానార్పణమును గాక యొక మేకపిల్లను పాపపరిహారార్థబలిగా యెహోవాకు అర్పింప వలెను. | 16 మొదటి నెల పదునాలుగవ దినము యెహోవాకు పస్కాపండుగ. | 17 ఆ నెల పదునయిదవ దినము పండుగ జరుగును. ఏడు దినములు పొంగని భక్ష్యములనే తినవలెను. | 18 మొదటి దినమున పరిశుద్ధ సంఘము కూడవలెను. అందులో విూరు జీవనోపాధియైన పనులేమియు చేయకూడదు. | 19 అయితే యెహోవాకు దహనబలిగా విూరు రెండు కోడెదూడలను ఒక పొట్టేలును ఏడాదివగు ఏడు మగ గొఱ్ఱెపిల్లలను అర్పింపవలెను. అవి విూకు కలిగిన వాటిలో నిర్దోషమైనవై యుండవలెను. | 20 వాటి నైవేద్యము నూనెతో కలుపబడిన గోధుమల పిండి. | 21 ఒక్కొక్క కోడెతో తూములో మూడు పదియవ వంతులను, పొట్టే లుతో రెండు పదియవవంతులను, ఆ యేడు గొఱ్ఱెపిల్లలలో ఒక్కొక్క గొఱ్ఱెపిల్లతో ఒక్కొక్క పదియవవంతును | 22 విూకు ప్రాయశ్చిత్తము కలుగుటకై పాపపరిహారార్థబలిగా ఒక మేకను అర్పింపవలెను. | 23 ఉదయమున విూరు అర్పించు నిత్యమైన దహనబలి గాక వీటిని విూరు అర్పింపవలెను. | 24 అట్లే ఆ యేడు దినములలో ప్రతిదినము యెహోవాకు ఇంపైన సువాసనగల హోమద్రవ్యమును ఆహారముగా అర్పించవలెను. నిత్యమైన దహనబలియు దాని పానార్పణమును గాక దానిని అర్పించవలెను. | 25 ఏడవ దినమున పరిశుద్ధసంఘము కూడవలెను. ఆ దినమున విూరు జీవనోపాధియైన పనులేమియు చేయకూడదు. | 26 మరియు ప్రధమ ఫలములను అర్పించు దినమున, అనగా వారముల పండుగ దినమున విూరు యెహోవాకు క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చునప్పుడు విూరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నాడు విూరు జీవనోపాధియైన పనులేమియు చేయకూడదు. | 27 యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా విూరు రెండు కోడె దూడలను ఒక పొట్టేలును ఏడాదివైన యేడు మగగొఱ్ఱె పిల్లలను వాటికి నైవేద్యముగా ప్రతి కోడెదూడతోను | 28 నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో మూడు పదియవ వంతులను, ప్రతి పొట్టేలుతో రెండు పదియవవంతులను | 29 ఆ యేడు గొఱ్ఱెపిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియవవంతును | 30 విూ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై యొక మేకపిల్లను అర్పింపవలెను. | 31 నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమునుగాక వాటిని వాటి పానార్పణములను అర్పింపవలెను. అవి నిర్దోషములుగా నుండవలెను.

Previous