|
||
| Previous | ||
| సంఖ్యాకాండము 27 అధ్యాయము | ||
27 అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు హెసెరు కుమారుడును గిలాదు మనుమడును మాకీరు మునిమనుమడునై యుండెను. అతని కుమార్తెల పేళ్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి. | 2 వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద మోషే యెదుటను యాజకుడైన ఎలియాజరు యెదుటను ప్రధానుల యెదుటను సర్వసమాజము యెదుటను నిలిచి చెప్పినదేమనగా - మా తండ్రి అరణ్యములో మరణమాయెను. | 3 అతడు కోరహు సమూహములో, అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు గాని తన పాపమునుబట్టి మృతిబొందెను. | 4 అతనికి కుమారులు కలుగలేదు; అతనికి కుమారులు లేనంత మాత్రముచేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేల? మా తండ్రి సహోదరుతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయుమనిరి. | 5 అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా | 6 యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను - సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. | 7 నిశ్చయముగా వారి తండ్రి సహోదరుతో పాటు భూస్వాస్థ్యమును వారి అధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెందచేయవలెను. | 8 మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పవలెను- ఒకడు కుమారుడు లేక మృతిబొందిన యెడల విూరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెందచేయవలెను. | 9 వానికి కుమార్తె లేని యెడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యము ఇయ్యవలెను. | 10 వానికి అన్నదమ్ములు లేని యెడల వాని భూస్వాస్థ్యమును వాని తండ్రి అన్నదమ్ములకు ఇయ్యవలెను. | 11 వాని తండ్రికి అన్నదమ్ములు లేని యెడల వాని కుటుంబములో వానికి సవిూపమైన జ్ఞాతికి వాని స్వాస్థ్యము ఇయ్యవలెను; వాడు దాని స్వాధీనపరచుకొనును. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలీయులకు విధింపబడిన కట్టడ. 12 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను-నీవు ఈ అబారీము కొండయెక్కి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమును చూడుము. | 13 నీవు దాని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడుదువు. | 14 ఏలయనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్లయొద్ద వారి కన్నుల యెదుట నన్ను పరిశుద్ధపరచక నా విూద తిరుగబడిరి. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేషులోనున్న మెరీబా నీళ్లే. | 15 అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను - యెహోవా, సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరిలేని గొఱ్ఱెలవలె ఉండకుండునట్లు ఈ సమాజము విూద ఒకని నియమించుము. | 16 అతడు వారి యెదుట వచ్చుచు, పోవుచు నుండి | 17 వారికి నాయకుడుగా ఉండుటకు సమర్ధుడై యుండవలెను. | 18 అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను-నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతని తీసికొని అతని విూద నీ చెయ్యి యుంచి | 19 యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వసమాజము ఎదుటను అతని నిలువబెట్టి వారి కన్నుల యెదుట అతనికి ఆజ్ఞ యిమ్ము; | 20 ఇశ్రాయేలీయుల సర్వసమాజము అతని మాట వినునట్లు అతని విూద నీ ఘనతలో కొంత ఉంచుము. | 21 యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలెను. అతడును అతనితో కూడ ఇశ్రాయేలీయులందరును, అనగా సర్వసమాజము అతని మాట చొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను. | 22 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అతడు యెహోషువను తీసికొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వసమాజము ఎదుటను అతని నిలువబెట్టి | 23 అతని విూద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ యిచ్చెను. |
||
| Previous | ||