BLM
 

 
Previous
  సంఖ్యాకాండము 26 అధ్యాయము  

26 ఆ తెగులు పోయిన తర్వాత యెహోవా మోషేకును యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుకును ఈలాగు సెలవిచ్చెను. | 2 -విూరు ఇశ్రాయేలీయుల సర్వసమాజములోను ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి ఇశ్రాయేలీయులలో సేనగా బయలువెళ్లు వారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములనుబట్టి వ్రాయించుడి. | 3-4 కాబట్టి-యిరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయముగలవారిని లెక్కింపుడని యెహోవా మోషేకును ఐగుప్తుదేశము నుండి వచ్చిన ఇశ్రాయేలీయులకును ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయులు మోయాబు మైదానములలో యెరికో యొద్దనున్న యొర్దాను దగ్గరనుండగా జనసంఖ్యను చేయుడని వారితో చెప్పిరి. | 5 ఇశ్రాయేలు తొలిచూలు రూబేను. రూబేను పుత్రులలో హనోకీయులు హనోకు వంశస్థులు; | 6 పల్లువీయులు పల్లు వంశస్థులు; హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు; కర్మీయులు కర్మీ వంశస్థులు; | 7 వీరు రూబేనీయుల వంశస్థులు, వారిలో లెక్కింపబడినవారు నలుబది మూడువేల ఐదువందల ముప్పదిమంది. | 8 పల్లు కుమారుడు ఏలీయాబు. ఏలీయాబు కుమారులు నెమూయేలు దాతాను అబీరాము. | 9 కోరహు తన సమూహములో పేరుపొందినవాడు; అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజములో మోషే అహరోనులకు విరోధముగా వాదించిన దాతాను అబీరాములు వీరు. | 10 ఆ సమూహపు వారు మృతిబొందినప్పుడు అగ్ని రెండువందల ఏబదిమందిని భక్షించినందునను, భూమి తన నోరు తెరచి వారిని కోరహును మ్రింగి వేసినందునను, వారు దృష్టాంతములైరి. | 11 అయితే కోరహు కుమారులు చావలేదు. | 12 షిమ్యోను పుత్రుల వంశములలో నెమూయేలీయులు నెమూయేలు వంశస్థులు; యావిూనీ యులు యావిూను వంశస్థులు; యాకీనీయులు యాకీను వంశస్థులు; | 13 జెరహీయులు జెరహు వంశస్థులు; షావూలీయులు షావూలు వంశస్థులు. | 14 ఇవి షిమ్యోనీయుల వంశములు. వారు ఇరువది రెండువేల రెండువందల మంది. | 15 గాదు పుత్రుల వంశములలో సెపోనీయులు సెపోను వంశస్థులు; హగ్గీయులు హగ్గీ వంశస్థులు; షూనీయులు షూనీ వంశస్థులు; | 16 ఓజనీయులు ఓజని వంశస్థులు; ఏరీయులు ఏరీ వంశస్థులు; | 17 ఆరోదీయులు ఆరోదు వంశస్థులు; అరేలీయులు అరేలీ వంశస్థులు. | 18 వీరు గాదీయుల వంశస్థులు; వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు నలుబది నాలుగువేల ఐదువందలమంది. | 19 యూదా కుమారులు ఏరు ఓనాను; ఏరును ఓనానును కనాను దేశములో మృతి బొందిరి. | 20 యూదా వారి వంశములలో షేలాహీయులు షేలా వంశస్థులు; పెరెసీయులు పెరెసు వంశస్థులు జెరహీయులు జెరహు వంశస్థులు; | 21 పెరెసీయులలో హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు హామూలీయులు హామూలు వంశస్థులు. | 22 వీరు యూదీయుల వంశస్థులు; వ్రాయబడినవారి సంఖ్య చొప్పున వీరు డెబ్బదియారువేల ఐదువందలమంది. | 23 ఇశ్శాఖారు పుత్రుల వంశస్థులలో తోలాహీయులు తోలా వంశస్థులు; పువ్వీయులు పువ్వా వంశస్థులు; యాషూబీయులు యాషూబు వంశస్థులు; షిమ్రోనీయులు షిమ్రోను వంశస్థులు; వీరు ఇశ్శాఖారీయుల వంశస్థులు. | 24 వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు అరువది నాలుగువేల ఐదువందలమంది. | 25-26 జెబూలూను పుత్రుల వంశస్థులలో సెరెదీయులు సెరెదు వంశస్థులు; ఏలోనీయులు ఏలోను వంశస్థులు యహలేలీయులు యహలేలు వంశస్థులు; | 27 వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు అరువదివేల ఐదువందలమంది. | 28 యోసేపు పుత్రుల వంశస్థులు అతని కుమారులు మనష్షే ఎఫ్రాయిము. | 29-32 మనష్షే కుమారులలో మాకీరీయులు మాకీరు వంశస్థులు; మాకీరు గిలాదును కనెను; గిలాదీయులు గిలాదు వంశస్థులు; వీరు గిలాదు పుత్రులు. ఈజరీయులు ఈజరు వంశస్థులు; హెలకీయులు హెలకు వంశస్థులు; అశ్రీయేలీయులు అశ్రీయేలు వంశస్థులు; షెకెవిూయులు షెకెము వంశస్థులు; షెవిూదాయీయులు షెవిూదా వంశస్థులు; హెపెరీయులు హెపెరు వంశస్థులు. | 33 హెపెరు కుమారుడైన సెలోపెహాదుకు కుమార్తెలేగాని కుమారులు పుట్టలేదు. సెలోపెహాదు కుమార్తెల పేరులు మహలా నోయా హొగ్లా మిల్కా తిర్సా. | 34 వీరు మనష్షీయుల వంశస్థులు; వ్రాయబడినవారి సంఖ్య చొప్పున వీరు ఏబది రెండువేల ఏడు వందలమంది. | 35 ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి; షూతలహీయులు షూతలహు వంశస్థులు; బేకరీయులు బేకరు వంశస్థులు; తహనీయులు తహను వంశస్థులు, | 36 వీరు షూతలహు కుమారులు; ఏరానీయులు ఏరాను వంశస్థులు. | 37 వీరు ఎఫ్రాయివిూయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు ముప్పదిరెండువేల ఐదువందలమంది; వీరు యోసేపు పుత్రుల వంశస్థులు. | 38 బెన్యావిూను పుత్రుల వంశములలో బెలీయులు బెల వంశస్థులు; అష్బేలీయులు అష్బేలు వంశస్థులు; | 39 అహీరావిూయులు అహీరాము వంశస్థులు; | 40 షూపావిూయులు షూపాము వంశస్థులు; బెల కుమారులు ఆర్దు నయమాను; ఆర్దీయులు ఆర్దు వంశస్థులు; నయమానీయులు నయమాను వంశస్థులు. | 41 వీరు బెన్యావిూనీయుల వంశస్థులు; వారిలో వ్రాయబడిన లెక్క చొప్పున నలుబదియయిదువేల ఆరువందల మంది. | 42 దాను పుత్రుల వంశములలో షూషావిూయులు షూషాము వంశస్థులు; | 43 వీరు తమ వంశములలో దానీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు అరువది నాలుగువేల నాలుగువందల మంది. | 44 ఆషేరు పుత్రుల వంశములలో యివ్నిూయులు యిమ్నా వంశస్థులు, ఇష్వీయులు ఇష్వీ వంశస్థులు; బెరీయులు బెరీయా వంశస్థులు; | 45 బెరీయానీయులలో హెబెరీయులు హెబెరు వంశస్థులు; మల్కీయేలీయులు మల్కీయేలు వంశస్థులు; | 46 ఆషేరు కుమార్తె పేరు శెరహు. | 47 వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు ఆషేరీయుల వంశస్థులు; వీరు ఏబదిమూడు వేల నాలుగువందలమంది | 48 నఫ్తాలీ పుత్రుల వంశములలో యహసయేలీయులు యహసయేలు వంశస్థులు; గూనీయులు గూనీ వంశస్థులు; | 49 యేసెరీయులు యేసెరు వంశస్థులు; షిల్లేవిూయులు షిల్లేము వంశస్థులు. | 50 వీరు నఫ్తాలీయుల వంశస్థులు; వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు నలుబదియయిదువేల నాలుగువందలమంది | 51 ఇశ్రాయేలీ యులలో లెక్కింపబడిన వీరు ఆరులక్షల వెయ్యిన్ని ఏడు వందల ముప్పదిమంది. | 52 యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను-వీరి పేళ్ల లెక్క చొప్పున ఆ దేశమును వీరికి స్వాస్థ్యముగా పంచిపెట్టవలెను. | 53 ఎక్కువమందికి ఎక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను; | 54 తక్కువమందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను. దాని దాని జనసంఖ్యనుబట్టి ఆయా గోత్రములకు స్వాస్థ్యము ఇయ్యవలెను. | 55 చీట్లు వేసి ఆ భూమిని పంచిపెట్టవలెను. వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్య చొప్పున స్వాస్థ్యమును పొందవలెను. | 56 ఎక్కువ మందికేమి తక్కువమందికేమి చీట్లువేసి యెవరి స్వాస్థ్యమును వారికి పంచిపెట్టవలెను. | 57 వారి వారి వంశములలో లెక్కింపబడిన లేవీయులు వీరు. గెర్షోనీయులు గెర్షోను వంశస్థులు; కహాతీయులు కహాతు వంశస్థులు; మెరారీయులు మెరారి వంశస్థులు. | 58 లేవీయుల వంశములు ఏవనగా, లిబ్నీయుల వంశము హెబ్రోనీయుల వంశము మహలీయుల వంశము మూషీయుల వంశము కోరహీయుల వంశము. | 59 కహాతు అమ్రామును కనెను; అమ్రాము భార్య పేరు యోకెబెదు. ఆమె లేవీ కుమార్తె; ఐగుప్తులో ఆమె లేవీకి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిర్యామును కనెను. | 60 అహరోను వలన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు పుట్టిరి. | 61 నాదాబు అబీహులు యెహోవా సన్నిధికి అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయిరి. | 62 వారిలో నెల మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కింపబడిన వారందరు ఇరువది మూడువేలమంది. వారు ఇశ్రాయేలీయులలో లెక్కింపబడినవారు కారు గనుక ఇశ్రాయేలీయులలో వారికి స్వాస్థ్యమియ్యబడలేదు. | 63 యెరికో ప్రాంతములయందలి యొర్దానునొద్దనున్న మోయాబు మైదానములలో మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయుల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడినవారు వీరు. | 64 మోషే అహరోనులు సీనాయి అరణ్యములో ఇశ్రాయేలీయుల సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు. | 65 ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదురని యెహోవా వారిని గూర్చి సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి యుండలేదు.

Previous