|
||
| Previous | ||
| సంఖ్యాకాండము 25 అధ్యాయము | ||
25 ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. | 2 ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. | 3 అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసికొనినందున వారివిూద యెహోవా కోపము రగులుకొనెను. | 4 అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను-నీవు ప్రజల అధిపతులనందరిని తోడుకొని, యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల విూద నుండి తొలగిపోవునని చెప్పెను. | 5 కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి విూలో ప్రతివాడును బయల్పెయోరుతో కలిసికొనిన తన తన వశములోని వారిని చంపవలెనని చెప్పెను. | 6 ఇదిగో మోషే కన్నుల యెదుటను, ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వసమాజము యొక్క కన్నుల యెదుటను, ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. | 7 యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు అది చూచి, | 8 సమాజము నుండి లేచి, యీటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్లి ఆ యిద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండ దూసిపోవునట్లు పొడిచెను; అప్పుడు ఇశ్రాయేలీయులలో నుండి తెగులు నిలిచిపోయెను. | 9 ఇరువది నాలుగు వేలమంది ఆ తెగులుచేత చనిపోయిరి. | 10 అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను-యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు, | 11 వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలీయుల విూదనుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు. | 12 కాబట్టి నీవు అతనితో ఇట్లనుము- అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. | 13 అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగియుండును; ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తిగలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. | 14 చంపబడిన వాని పేరు జివ్రిూ, అతడు షిమ్యోనీయులలో తన పితరుల కుటుంబమునకు ప్రధానియైన సాలూ కుమారుడు. | 15 చంపబడిన స్త్రీ పేరు కొజ్బీ, ఆమె సూరు కుమార్తె. అతడు మిద్యానీయులలో ఒక గోత్రమునకును తన పితరుల కుటుంబమునకును ప్రధానియై యుండెను. 16 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను -మిద్యానీయులు తమ తంత్రముల వలన విూకు బాధకులై యున్నారు; వారిని బాధపెట్టి హతము చేయుడి; | 17 వారు తంత్రములు చేసి పెయోరు సంతతిలోను, తెగులు దినమందు పెయోరు విషయములో చంపబడిన తమ సహో దరియు మిద్యానీయుల అధిపతి కుమార్తెయునైన కొజ్బీ సంగతిలోను, మిమ్మును మోసపుచ్చిరి. |
||
| Previous | ||