24 ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలిసికొనినప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్లక అరణ్యము వైపు తన ముఖమును త్రిప్పుకొనెను. | 2 బిలాము కన్నులెత్తి ఇశ్రా యేలీయులు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని విూదికి వచ్చెను | 3 గనుక అతడు ఉపమానరీతిగా ఇట్లనెను-
బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి
కన్నులు తెరచిన వానికి వచ్చిన దేవోక్తి.
4 దేవ వాక్కులను వినినవాని వార్త.
అతడు పరవశుడై కన్నులు తెరచినవాడై1
సర్వశక్తుని దర్శనము పొందెను.
5 యాకోబూ, నీ గుడారములు
ఇశ్రాయేలూ, నీ నివాస స్థలములు
ఎంతో రమ్యమైనవి.
6 వాగులవలె అవి వ్యాపించియున్నవి
నదీతీరమందలి తోటలవలెను యెహోవా నాటిన అగరు చెట్లవలెను
నీళ్లయొద్దనున్న దేవదారు వృక్షములవలెను అవి యున్నవి.
7 నీళ్లు అతని బొక్కెనల నుండి కారును
అతని సంతతి బహు జలముల యొద్ద నివసించును
అతని రాజు అగగు కంటె గొప్పవాడగును
అతని రాజ్యము అధికమైనదగును.
8 దేవుడు ఐగుప్తులో నుండి అతని రప్పించెను
గురుపోతు వేగమువంటి వేగము అతనికి కలదు
అతడు తన శత్రువులైన జనులను భక్షించును
వారి యెముకలను విరుచును
తన బాణములతో వారిని గుచ్చును.
9 సింహమువలెను ఆడు సింహమువలెను
అతడు క్రుంగి పండుకొనెను
అతనిని లేపు వాడెవడు?
నిన్ను దీవించువాడు దీవింపబడును
నిన్ను శపించువాడు శపింపబడును.
10 అప్పుడు బాలాకు కోపము బిలాము విూద మండెను గనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో-నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించితిని కాని నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి. కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్లుము. | 11 నేను నిన్ను మిక్కిలి ఘనపరచెదనని చెప్పితినిగాని యెహోవా నీవు ఘనత పొందకుండ ఆటంకపరచెననెను. | 12 అందుకు బిలాము బాలాకుతో-బాలాకు తన ఇంటెడు వెండి బంగారము లను నాకిచ్చినను నా యిష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను విూరలేను. | 13 యెహోవా యేమి సెలవిచ్చునో అదే పలికెదనని నీవు నా యొద్దకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా? | 14 చిత్తగించుము; నేను నా జనుల యొద్దకు వెళ్లుచున్నాను. అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనుకేమి చేయుదురో అది నీకు విశదపరచెదను రమ్మని చెప్పి | 15 ఉపమానరీతిగా ఇట్లనెను-
బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి
కన్నులు తెరచినవానికి1 వచ్చిన దేవోక్తి.
16 దేవవాక్కులను వినిన వాని వార్త
మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త.
అతడు పరవశుడై కన్నులు తెరచినవాడై
సర్వశక్తుని దర్శనము పొందెను.
17 ఆయనను చూచుచున్నాను గాని
ప్రస్తుతమున నున్నట్టు కాదు
ఆయనను చూచుచున్నాను గాని
సవిూపమున నున్నట్టు కాదు
నక్షత్రము యాకోబులో ఉదయించును
రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును
అది మోయాబు ప్రాంతములను కొట్టును
కలహ వీరులనందరిని నాశనము చేయును.
18 ఎదోమును శేయీరును ఇశ్రాయేలుకు శత్రువులు
వారు స్వాధీనపరచబడుదురు
ఇశ్రాయేలు పరాక్రమమొందును.
19 యాకోబు సంతానమున యేలిక పుట్టును
అతడు పట్టణములోని శేషమును నశింపజేయును.
20 మరియు అతడు అమాలేకీయుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనెను-
అమాలేకు అన్యజనములకు మొదలు
వాని అంతము నిత్యనాశనమే.
21 మరియు అతడు కేనీయులవైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనెను-
నీ నివాస స్థలము దుర్గమమైనది
నీ గూడు కొండవిూద కట్టబడియున్నది.
22 అష్షూరు నిన్ను చెరగా పట్టు వరకు
కయీను నశించునా?
23 మరియు అతడు ఉపమానరీతిగా-
అయ్యో దేవుడు ఇట్లు చేయునప్పుడు ఎవడు బ్రదు కును?
24 కిత్తీము తీరము నుండి ఓడలు వచ్చును.
అవి అష్షూరును ఏబెరును బాధించును.
కిత్తీయులు కూడ నిత్య నాశనము పొందుదురనెను. అంతట బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్లెను; బాలా కును తన త్రోవను వెళ్లెను. 1. కన్నులు మూసినవాడై. 1. కన్నులు మూసినవానికి. |