|
||
| Previous | ||
| సంఖ్యాకాండము 31 అధ్యాయము | ||
31 మరియు యెహోవా-మిద్యానీయులు ఇశ్రాయేలీ యులకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి. | 2 తరు వాత నీవు నీ స్వజనుల యొద్దకు చేర్చబడుదువని మోషేకు సెలవియ్యగా | 3 మోషే ప్రజలతో-విూలో కొందరు యుద్ధసన్నద్ధులై మిద్యానీయుల విూదికి పోయి మిద్యానీయులకు యెహోవా విధించిన ప్రతిదండన చేయునట్లు | 4 ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోను ప్రతి గోత్ర ములో నుండి వేయేసిమందిని ఆ యుద్ధమునకు పంపవలెననెను. | 5 అట్లు గోత్రమొక్కింటికి వేయిమంది చొప్పున, ఇశ్రాయేలీయుల సేనలలో నుండి పన్నెండువేల యుద్ధ వీరులు ఏర్పరచబడగా | 6 మోషే వారిని, అనగా ప్రతి గోత్రము నుండి వేయేసిమందిని, యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపెను. అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బూరలను యుద్ధమునకు పంపెను. | 7 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధము చేసి మగవారినందరిని చంపిరి. | 8 చంపబడిన యితరులుగాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను అయిదుగురు రాజులైన ఎవీని, రేకెమును, సూరును, హూరును, రేబను చంపిరి. బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. | 9 అప్పుడు ఇశ్రాయేలీయులు మిద్యాను స్త్రీలను వారి చిన్న పిల్లలను చెరపట్టుకొని, వారి సమస్త పశువులను వారి గొఱ్ఱె మేకలన్నిటిని వారికి కలిగినది యావత్తును దోచుకొనిరి. | 10 మరియు వారి నివాస పట్టణములన్నిటిని వారి కోటలన్నిటిని అగ్నిచేత కాల్చివేసిరి. | 11 వారు మనుష్యులనేమి పశువులనేమి సమస్తమైన కొల్లసొమ్మును మిద్యానీయుల ఆస్తిని యావత్తును తీసికొనిరి. | 12 తరువాత వారు మోయాబు మైదానములలో యెరికో యొద్దనున్న యొర్దాను దగ్గర దిగియున్న దండులో మోషే యొద్దకును యాజకుడైన ఎలి యాజరు నొద్దకును ఇశ్రాయేలీయుల సమాజము నొద్దకును చెరపట్టబడిన వారిని అపహరణములను ఆ కొల్ల సొమ్మును తీసికొని రాగా | 13 మోషేయు యాజకుడైన ఎలియాజరును సమాజ ప్రధానులందరును వారిని ఎదుర్కొనుటకు పాళెములో నుండి వెలుపలికి వెళ్లిరి. | 14 అప్పుడు మోషే యుద్ధసేనలో నుండి వచ్చిన సహస్రాధిపతులును శతాధిపతులునగు సేనానాయకుల విూద కోపపడెను. | 15 మోషే వారితో-విూరు ఆడువారినందరిని బ్రదుకనిచ్చితిరా? | 16 ఇదిగో బిలాము మాటనుబట్టి పెయోరు విషయములో ఇశ్రాయేలీయులచేత యెహోవా విూద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజములో తెగులు పుట్టియుండెను గదా. | 17 కాబట్టి విూరు పిల్లలలో ప్రతి మగవానిని పురుష సంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి; | 18 పురుష సంయోగము ఎరుగని ప్రతి ఆడుపిల్లను విూ నిమిత్తము బ్రతుకనీయుడి. | 19 విూరు ఏడు దినములు పాళెము వెలుపల ఉండవలెను; విూలో నరుని చంపిన ప్రతివాడును చంపబడిన నరుని ముట్టిన ప్రతివాడును, విూరును విూరు చెరపట్టిన వారును మూడవ దినమున ఏడువ దినమున మిమ్మును విూరే పవిత్రపరచుకొనవలెను. | 20 విూరు బట్టలన్నిటిని చర్మ వస్తువులన్నిటిని మేక వెండ్రుకల వస్తువులన్నిటిని కొయ్య వస్తువులన్నిటిని పవిత్రపరచవలెననెను. | 21 అప్పుడు యాజకుడగు ఎలియాజరు యుద్ధమునకు పోయిన సైనికులతో-యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధి యేదనగా | 22 విూరు బంగారును వెండిని ఇత్తడిని ఇనుమును తగరమును సీసమును | 23 అనగా అగ్నిచేత చెడని సమస్త వస్తువులను మాత్రము అగ్నిలో వేసి తీయవలెను; అప్పుడు అవి పవిత్రమగును. అయితే పాపపరిహార జలముచేతను వాటిని పవిత్రపరచవలెను. అగ్నిచేత చెడునట్టి ప్రతి వస్తువును నీళ్లలో వేసి తీయవలెను. | 24 ఏడవ దినమున విూరు విూ బట్టలు ఉదుకుకొని పవిత్రులైన తరువాత పాళెములోనికి రావచ్చుననెను. 25 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. | 26 -నీవును యాజకుడైన ఎలియాజరును సమాజము యొక్క పితరుల కుటుంబములలో ప్రధానులును మనుష్యులలోనేమి, పశువులలోనేమి, చెరపట్టబడిన దోపుడుసొమ్ము మొత్తమును లెక్కించి రెండు భాగములుగా చేసి | 27 యుద్ధమునకు పూనుకొని సేనగా బయలుదేరిన వారికి సగమును సర్వసమాజమునకు సగమును పంచి పెట్టవలెను. | 28 మరియు సేనగా బయలుదేరిన యోధుల విూద యెహోవాకు పన్ను కట్టి, ఆ మనుష్యులలోను పశువులలోను గాడిదలలోను గొఱ్ఱెమేకలలోను ఐదువందలకు ఒకటి చొప్పున వారి సగములో నుండి తీసికొని | 29 యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా యాజకుడైన ఎలియాజరుకు ఇయ్యవలెను. | 30 మనుష్యులలోను పశువులలోను గాడిదలలోను గొఱ్ఱెమేకలలోను సమస్త విధముల జంతువులలోను ఏబదింటికి ఒకటి చొప్పున, ఇశ్రాయేలీయులు సగములో నుండి తీసికొని యెహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇయ్యవలెను. | 31 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడైన ఎలియాజరును చేసిరి. | 32 ఆ దోపుడు సొమ్ము, అనగా ఆ సైనికులు కొల్లబెట్టిన సొమ్ములో మిగిలినది | 33 ఆరులక్షల డెబ్బదియయిదు గొఱ్ఱెమేకలును, | 34 డెబ్బది రెండు వేల పశువులును, అరువది యొకవేయి గాడిదలును, | 35 ముప్పది రెండువేలమంది పురుష సంయోగమెరుగని స్త్రీలును, | 36 అందులో అరవంతు, అనగా సైన్యముగా పోయిన వారి వంతు, గొఱ్ఱెమేకల లెక్కయెంతనగా మూడు లక్షల ముప్పది యేడువేల ఐదువందలు. ఆ గొఱ్ఱెమేకలలో యెహోవాకు చెల్లవలసిన పన్ను ఆరువందల డెబ్బది యయిదు, | 37 ఆ పశువులు ముప్పదియారువేలు. | 38 వాటిలో యెహోవా పన్ను డెబ్బది రెండు | 39 ఆ గాడిదలు ముప్పది వేల ఐదువందలు, వాటిలో యెహోవా పన్ను అరువది యొకటి. | 40-42 మనుష్యులు పదునారు వేలమంది. వారిలో యెహోవా పన్ను ముప్పది ఇద్దరు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును, అనగా యెహోవాకు చెల్లవలసిన ప్రతిష్ఠార్పణమును యాజకుడైన ఎలియాజరున కిచ్చెను. సైనికుల యొద్ద మోషే తీసికొని ఇశ్రాయేలీయుల కిచ్చిన సగము నుండి లేవీయులకిచ్చెను. | 43 మూడు లక్షల ముప్పది యేడువేల ఐదువందల గొఱ్ఱెమేకలును | 44 ముప్పది ఆరువేల గోవులును ముప్పదివేల ఐదువందల గాడిదలును | 45 పదునారువేలమంది మనుష్యులును సమాజమునకు కలిగిన సగమైయుండగా, మోషే | 46 ఇశ్రాయేలీయులకు వచ్చిన ఆ సగము నుండి మనుష్యులలోను జంతువులలోను | 47 ఏబదింటికి ఒకటి చొప్పున తీసి, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా మందిరమును కాపాడు లేవీయుల కిచ్చెను. | 48 అప్పుడు సేనా సహస్రముల నియామకులు, అనగా సహస్రాధిపతులును శతాధిపతులును మోషే యొద్దకు వచ్చి | 49 -నీ సేవకులమైన మేము మా చేతిక్రిందనున్న యోధులను లెక్కించి మొత్తము చేసితిమి; మాలో ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు. | 50 కాబట్టి యెహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు మేము మాలో ప్రతి మనుష్యునికి దొరికిన బంగారు నగలను గొలుసులను కడియములను ఉంగరములను పోగులను పతకములను యెహోవాకు అర్పణముగా తెచ్చియున్నామని చెప్పగా | 51 మోషేయు యాజకుడైన ఎలియాజరు నగలుగా చేయబడిన ఆ బంగారును వారి యొద్ద తీసికొనిరి. | 52 సహస్రాధిపతులును శతాధిపతులును ప్రతిష్ఠార్పణముగా యెహోవాకు అర్పించిన బంగారమంతయు పదునారువేల ఏడువందల ఏబది తులములు. | 53 ఆ సైనికులలో ప్రతివాడును తన మట్టుకు తాను కొల్ల సొమ్ము తెచ్చుకొనియుండెను. | 54 అప్పుడు మోషేయు యాజకుడైన ఎలియాజరును సహస్రాధిపతుల యొద్ద నుండియు శతాధిపతుల యొద్ద నుండియు ఆ బంగారును తీసికొని యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్ధముగా ప్రత్యక్షపు గుడారమున ఉంచిరి. |
||
| Previous | ||