|
||
| Previous | ||
| ద్వితీయోపదేశకాండము 2 అధ్యాయము | ||
2 మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎఱ్ఱసముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమై పోయి బహు దినములు శేయీరు మన్నెము చుట్టు తిరిగితిమి. | 2 అంతట యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను -విూరు ఈ మన్నెము చుట్టు తిరిగిన కాలము చాలును; | 3 ఉత్తరదిక్కుకు తిరుగుడి. మరియు నీవు ప్రజలతో ఇట్లనుము | 4 -శేయీరులో కాపురమున్న ఏశావు సంతానమైన విూ సహోదరుల పొలిమేరను దాటి వెళ్లబోవుచున్నారు, వారు విూకు భయపడుదురు; విూరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి. | 5 వారితో కలహపడవద్దు; ఏలయనగా ఏశావుకు స్వాస్థ్యముగా శేయీరు మన్నెము నేనిచ్చియున్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను విూకియ్యను. | 6 విూరు రూకలిచ్చి వారి యొద్ద ఆహారము కొని తినవచ్చును. రూకలిచ్చి వారి యొద్ద నీళ్లు సంపాదించుకొని త్రాగవచ్చును. | 7 నీ చేతుల పనులన్నిటిలోను నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలువది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన యెరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడైయున్నాడు, నీకేమియు తక్కువ కాదు. | 8 అప్పుడు శేయీరులో నివసించు ఏశావు సంతానపు వారైన మన సహోదరులను విడిచి, ఏలతు ఎసోన్గెబెరు అరాబా మార్గము నుండి మనము ప్రయాణము చేసితిమి. | 9 మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను- మోయాబీయులను బాధింపవద్దు; వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు ఆరు దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని, వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇయ్యను. | 10 పూర్వకాలమున ఏవిూయులను వారు ఆరు దేశములో నివసించిరి. వారు అనాకీయులవలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. వారును అనాకీయులవలె రెఫాయీయులుగా ఎంచబడినవారు. | 11 మోయాబీయులు వారికి ఏవిూయులని పేరు పెట్టిరి. | 12 పూర్వకాలమున హోరీయులు శేయీరులో నివసించిరి. ఇశ్రాయేలీయులు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశములో చేసినట్లు ఏశావు సంతానపు వారు హోరీయుల దేశమును స్వాధీనపరచుకొని తమ యెదుట నుండి వారిని నశింపజేసి వారి దేశములో నివసించిరి. | 13 కాబట్టి-విూరు లేచి జెరెదు ఏరు దాటుడి అని యెహోవా సెలవియ్యగా జెరెదు ఏరు దాటితిమి. | 14 మనము కాదేషు బర్నేయలో నుండి బయలుదేరి జెరెదు ఏరు దాటు వరకు, అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుష్యుల తరము వారందరు సేనలో నుండకుండ నశించు వరకు మనము నడిచిన కాలము ముప్పది యెనిమిది సంవత్సరములు. అంతేకాదు, వారు నశించు వరకు | 15 సేన మధ్య నుండి వారిని సంహరించుటకు యెహోవా బాహువు వారికి విరోధముగా నుండెను. | 16 సైనికులైన వారందరు ప్రజలలో నుండి లయమైపోయిన తరువాత యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను | 17 -నేడు నీవు మోయాబునకు సరిహద్దుగానున్న ఆరు దేశము దాటబోవుచున్నావు | 18 అమ్మోనీయుల మార్గమున వెళ్లునప్పుడు | 19 వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. ఏలయనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశములో నీకు స్వాస్థ్యము నియ్యను. | 20 అదియు రెఫాయీయుల దేశమని యెంచబడుచున్నది. పూర్వమందు రెఫాయీ యులు అందులో నివసించిరి. అమ్మోనీయులు వారిని జంజువ్మిూయులందురు. | 21 వారు అనాకీయులవలె ఉన్నత దేహులు, బలవంతులైన బహు జనులు. అయితే యెహోవా అమ్మోనీయుల యెదుట నుండి వారిని వెళ్లగొట్టెను గనుక అమ్మోనీయులు వారి దేశమును స్వాధీనపరచుకొని వారి చోట నివసించిరి. | 22 అట్లు ఆయన శేయీరులో నివసించు ఏశావు సంతానము కొరకు చేసెను. ఎట్లనగా ఆయన వారి యెదుట నుండి హోరీయులను నశింపజేసెను గనుక వారు హోరీయుల దేశమును స్వాధీనపరచుకొని నేటి వరకు వారి చోట నివసించుచున్నారు. | 23 గాజా వరకు గ్రామములలో నివసించిన ఆవీయులను కఫ్తోరులో నుండి బయలుదేరి వచ్చిన కఫ్తోరీయులు నశింపజేసి వారి చోట నివసించిరి. | 24 విూరు లేచి సాగి అర్నోను ఏరు దాటుడి; ఇదిగో అమోరీయుడైన హెష్బోను రాజగు సీహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని. దాని స్వాధీనపరచుకొన మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయుడి. | 25 నేడు నేను నీ వలని భయము నీ వలని వెరపు ఆకాశము క్రిందనున్న సమస్త దేశముల వారికిని పుట్టింప మొదలు పెట్టుచున్నాను. వారు నిన్ను గూర్చిన సమాచారము విని నీ యెదుట వణకి మనోవేదన నొందుదురు. | 26 అప్పుడు నేను కెదేమోతు అరణ్యములో నుండి హెష్బోను రాజైన సీహోనునొద్దకు దూతలను పంపి | 27 -నన్ను నీ దేశముగుండ దాటిపోనిమ్ము, కుడియెడమలకు తిరుగక త్రోవనే నడిచిపోవుదును. | 28 నా యొద్ద రూకలు తీసికొని తినుటకు భోజనపదార్ధములు నాకిమ్ము; నా యొద్ద రూకలు తీసికొని త్రాగుటకు నీళ్లిమ్ము. | 29 శేయీరులో నివసించు ఏశావు సంతానపు వారును ఆరులో నివసించు మోయాబీయులును నాకు చేసినట్లు, మా దేవుడైన యెహోవా మాకిచ్చుచున్న దేశములో ప్రవేశించుటకై యొర్దాను దాటు వరకు కాలినడకచేతనే నన్ను వెళ్లనిమ్మని సమాధానపు మాటలు పలికించితిని. | 30 అయితే హెష్బోను రాజైన సీహోను మనలను తన దేశమార్గమున వెళ్లనిచ్చుటకు సమ్మతింపలేదు. నేడు జరిగినట్లు నీ చేతికి అతని అప్పగించుటకు నీ దేవుడైన యెహోవా అతని మనస్సును కఠినపరచి అతని హృదయమునకు తెంపు కలుగజేసెను. | 31 అప్పుడు యెహోవా-చూడుము; సీహోనును అతని దేశమును నీకు అప్పగింప మొదలుపెట్టియున్నాను. అతని దేశము నీదగునట్లు నీవు దాని స్వాధీనపరచుకొన మొదలు పెట్టుమని నాతో చెప్పెను. | 32 సీహోనును అతని సమస్త జనమును యాహసులో యుద్ధము చేయుటకై మనకు ఎదురుగా బయలుదేరి రాగా | 33 మన దేవుడైన యెహోవా అతనిని మనకు అప్పగించెను గనుక మనము అతనిని అతని కుమారులను అతని సమస్త జనమును హతము చేసి | 34 ఆ కాలమున అతని సమస్త పురములను పట్టుకొని, ప్రతి పురమును అందలి స్త్రీ పురుషులను పిల్లలను శేషమేమియు లేకుండ నాశనము చేసితిమి. | 35 పశువులను మనము పట్టుకొనిన పురముల సొమ్మును దోపిడిగా దోచుకొంటిమి. | 36 అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరును ఆ యేటియొద్దనున్న పురము మొదలుకొని గిలాదు వరకు మనకు అసాధ్యమైన నగర మొకటియు లేకపోయెను. మన దేవుడైన యెహోవా అన్నిటిని మనకు అప్పగించెను. | 37 అయితే అమ్మోనీయుల దేశమునకైనను యబ్బోకు ఏటి లోయలోని యే ప్రాంత మునకైనను ఆ మన్నెములోని పురములకైనను మన దేవుడైన యెహోవా పోకూడదని చెప్పిన మరి ఏ స్థలమున కైనను నీవు సవిూపింపలేదు. |
||
| Previous | ||