BLM
 

 
Previous
  ద్వితీయోపదేశకాండము 3 అధ్యాయము  

3 మనము తిరిగి బాషాను మార్గమున వెళ్లినప్పుడు బాషాను రాజైన ఓగును అతని ప్రజలందరును ఎద్రెయీలో మనతో యుద్ధము చేయుటకు బయలుదేరి యెదురుగా రాగా | 2 యెహోవా నాతో ఇట్లనెను-అతనికి భయపడకుము, అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించియున్నాను. హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చేయవలెనని చెప్పెను. | 3 అట్లు మన దేవుడైన యెహోవా బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును మనచేతికి అప్పగించెను; అతనికి శేషమేమియు లేకుండ అతనిని హతము చేసితిమి. | 4 ఆ కాలమున అతని పురములన్నిటిని పట్టుకొంటిమి. వారి పురములలో మనము పట్టుకొనని పురమొకటియు లేదు. బాషానులో ఓగు రాజ్యమగు అర్గోబు ప్రదేశమందంతటనున్న అరువది పురములను పట్టుకొంటిమి. | 5 ఆ పురములన్నియు గొప్ప ప్రాకారములు గవునులు గడియలునుగల దుర్గములు. అవియు గాక ప్రాకారములేని పురములనేకములను పట్టుకొంటిమి. | 6 మనము హెష్బోను రాజైన సీహోనుకు చేసినట్లు వాటిని నిర్మూలము చేసితిమి; ప్రతి పురములోని స్త్రీ పురుషులను పిల్లలను నిర్మూలము చేసితిమి; | 7 వారి పశువులన్నిటిని ఆ పురముల సొమ్మును దోపిడిగా తీసికొంటిమి. | 8 ఆ కాలమున అర్నోను ఏరు మొదలుకొని హెర్మోను కొండ వరకు యొర్దాను అద్దరినున్న దేశమును అమోరీయుల యిద్దరు రాజుల యొద్ద నుండి పట్టుకొంటిమి. | 9 సీదోనీయులు హెర్మోనును షిర్యోనని అందురు. అమోరీయులు దానిని శెనీరని అందురు. | 10 మైదానమందలి పురములన్నిటిని బాషానునందలి ఓగు రాజ్యపురములైన సల్కా ఎద్రెయీ అనువాటి వరకు గిలాదంతటిని బాషానును పట్టుకొంటిమి. | 11 రెఫాయీయులలో బాషాను రాజైన ఓగు మాత్రము మిగిలెను. అతని మంచము ఇనుప మంచము. అది అమ్మోనీయుల రబ్బాలోనున్నది గదా? దాని పొడుగు మనుష్యుని మూరతో తొమ్మిది మూరలు దాని వెడల్పు నాలుగు మూరలు. | 12 అర్నోను లోయలోనున్న అరోయేరు మొదలుకొని గిలాదు మన్నెములో సగమును, మనము అప్పుడు స్వాధీనపరచుకొనిన దేశమును, దాని పురములను రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిని. | 13 ఓగు రాజు దేశమైన బాషాను యావ త్తును గిలాదులో మిగిలిన దానిని, అనగా రెఫాయీయుల దేశమనబడిన బాషాను అంతటిని అర్గోబు ప్రదేశమంతటిని మనష్షే అర్ధగోత్రమున కిచ్చితిని. | 14 మనష్షే కుమారుడైన యాయీరు గెషూరీయుల యొక్కయు మాయాకాతీయుల యొక్కయు సరిహద్దుల వరకు అర్గోబు ప్రదేశమంతటిని పట్టుకొని, తన పేరునుబట్టి వాటికి యాయీరు బాషాను గ్రామములని పేరు పెట్టెను. నేటి వరకు ఆ పేర్లు వాటికున్నవి. | 15 మాకీరీయులకు గిలాదు నిచ్చితిని. | 16 గిలాదు మొదలుకొని అర్నోను లోయ మధ్య వరకును, యబ్బోకు నది వరకును అమ్మోనీయుల పడమటి సరిహద్దు వరకును | 17 కిన్నెరెతు మొదలుకొని తూర్పుదిక్కున పిస్గా కొండ చరియల దిగువగా, ఉప్పు సముద్రము అనబడిన అరాబా సముద్రము వరకును వ్యాపించియున్న అరాబా ప్రదేశమును, యొర్దాను లోయ మధ్యభూమిని రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిని. | 18 ఆ కాలమందు నేను మిమ్మును చూచి-విూరు స్వాధీనపరచుకొనునట్లు విూ దేవుడైన యెహోవా ఈ దేశమును విూకిచ్చెను. విూలో పరాక్రమవంతులందరు యుద్ధసన్నద్ధులై విూ సహోదరులగు ఇశ్రాయేలీయుల ముందర నది దాటవలెను | 19 అయితే యెహోవా విూకు విశ్రాంతి నిచ్చినట్లు విూ సహోదరులకును, విశ్రాంతినిచ్చు వరకు, | 20 అనగా విూ దేవుడైన యెహోవా యొర్దాను అద్దరిని వారి కిచ్చుచున్న దేశమును వారును స్వాధీనపరచుకొను వరకు, విూ భార్యలును విూ పిల్లలును విూ మందలును నేను విూ కిచ్చిన పురములలో నివసింపవలెను. తరువాత విూలో ప్రతివాడును నేను విూకిచ్చిన తన తన స్వాస్థ్యమునకు తిరిగి రావలెనని విూకు ఆజ్ఞాపించితిని. విూ మందలు విస్తారములని నాకు తెలియును. | 21 ఆ కాలమున నేను యెహోషువతో ఇట్లంటిని-విూ దేవుడైన యెహోవా ఈ యిద్దరు రాజులకు చేసినదంతయు నీవు కన్నులారా చూచితివి గదా. నీవు వెళ్లుచున్న రాజ్యములనన్నిటికిని యెహోవా ఆలాగుననే చేయును. | 22 విూ దేవుడైన యెహోవా విూ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని. | 23 మరియు ఆ కాలమున నేను-యెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనుపరచ మొదలుపెట్టి యున్నావు. | 24 ఆకాశమందే గాని భూమియందేగాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు? | 25 నేను అద్దరికి వెళ్లి యొర్దాను అద్దరినున్న యీ మంచి దేశమును మంచి మన్నెమును ఆ లెబానోనును చూచునట్లు దయచేయుమని నేను యెహోవాను బ్రతి మాలుకొనగా | 26 యెహోవా మిమ్మునుబట్టి నా విూద కోపపడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను-చాలును; ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాటలాడవద్దు. | 27 నీవు ఈ యొర్దానును దాటకూడదు గాని నీవు పిస్గా కొండయెక్కి కన్నులెత్తి పడమటి వైపును ఉత్తర వైపును దక్షిణ వైపును తూర్పు వైపును తేరి చూడుము. | 28 యెహోషువకు ఆజ్ఞ యిచ్చి అతని ధైర్యపరచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని నది దాటి నీవు చూడబోవు దేశమును వారిని స్వాధీనపరచుకొనచేయును. | 29 అప్పుడు మనము బేత్పయోరు యెదుటనున్న లోయలో దిగియుంటిమి.

Previous