BLM
 

 
Previous
  ద్వితీయోపదేశకాండము 4 అధ్యాయము  

4 కాబట్టి ఇశ్రాయేలీయులారా, విూరు బ్రతికి విూ పితరుల దేవుడైన యెహోవా విూకిచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరచుకొనునట్లు, విూరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను విూకు బోధించుచున్నాను వినుడి. | 2 విూ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను విూ కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను విూకాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. | 3 బయల్పెయోరు విషయములో యెహోవా చేసిన దానిని విూరు కన్నులారా చూచితిరి గదా. బయల్పెయోరు వెంట వెళ్లిన ప్రతి మనుష్యుని నీ దేవుడైన యెహోవా నీ మధ్యను ఉండ కుండ నాశనము చేసెను. | 4 విూ దేవుడైన యెహోవాను హత్తుకొనిన విూరందరును నేటివరకు సజీవులై యున్నారు. | 5 నా దేవుడైన యెహోవా నా కాజ్ఞాపించినట్లు విూరు స్వాధీనపరచుకొనబోవు దేశమున విూరాచరింపవలసిన కట్టడలను విధులను విూకు నేర్పితిని. | 6 ఈ కట్టడలన్నిటిని విూరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే విూకు జ్ఞానము, అదే విూకు వివేకము. వారు చూచి-నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞానవివేచనలుగల జనమని చెప్పుకొందురు. | 7 ఏలయనగా మనము ఆయనకు మొఱ పెట్టునప్పుడెల్ల మన దేవుడైన యెహోవా మనకు సవిూపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సవిూపముగా నున్నాడు? | 8 మరియు నేడు నేను విూకు అప్పగించుచున్న యీ ధర్మశాస్త్రమంతటిలోనున్న కట్టడలును నీతివిధులునుగల గొప్ప జనమేది? | 9 అయితే నీవు జాగ్రత్తపడుము; నీవు కన్నులార చూచిన వాటిని మరువకయుండునట్లును, అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి | 10 నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచియుండగా యెహోవా-నా యొద్దకు ప్రజలను కూర్చుము; వారు ఆ దేశము విూద బ్రదుకు దినములన్నియు నాకు భయపడ నేర్చుకొని, తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించెదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము | 11 అప్పుడు విూరు సవిూపించి ఆ కొండ దిగువను నిలిచితిరి. చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశము వరకు అగ్నితో మండుచుండగా | 12 యెహోవా ఆ అగ్ని మధ్య నుండి విూతో మాటలాడెను. మాటల ధ్వని విూరు వింటిరిగాని యే స్వరూపమును విూరు చూడలేదు, స్వరము మాత్రమే వింటిరి. | 13 మరియు విూరు చేయవలెనని ఆయన విధించిన నిబంధనను, అనగా పది ఆజ్ఞలను విూకు తెలియజేసి రెండు రాతి పలకల విూద వాటిని వ్రాసెను. | 14 అప్పుడు విూరు నది దాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో విూరు అనుసరింపవలసిన కట్టడలను విధులను విూకు నేర్పవలెనని యెహోవా నా కాజ్ఞాపించెను. | 15 హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి విూతో మాటలాడిన దినమున విూరు ఏ స్వరూపమును చూడలేదు. | 16 కావున విూరు చెడిపోయి భూమి విూదనున్న యే జంతువు ప్రతిమనైనను | 17 ఆకాశమందు ఎగురు రెక్కలుగల యే పక్షి ప్రతిమనైనను | 18 నేలవిూద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను భూమి క్రిందనున్న నీళ్లయందలి యే చేప ప్రతిమనైనను ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమనుగాని, యే స్వరూపము గలిగిన విగ్రహమును విూ కొరకు చేసికొనకుండునట్లును, ఆకాశము వైపు కన్నులెత్తి | 19 సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలుకొల్పబడి, నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచి పెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును విూరు బహు జాగ్రత్తపడుడి. | 20 యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు విూరు తనకు స్వకీయ జనముగా నుండుటకై, ఐగుప్తుదేశములో నుండి ఆ యినుప కొలిమిలో నుండి మిమ్మును రప్పించెను. | 21 మరియు యెహోవా మిమ్మునుబట్టి నా విూద కోపపడి నేను ఈ యొర్దాను దాటకూడదనియు, నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న యీ మంచి దేశములో ప్రవేశింపకూడదనియు ప్రమాణము చేసెను. | 22 కావున నేను ఈ యొర్దాను దాటకుండ ఈ దేశముననే చనిపోదును; విూరు దాటి ఆ మంచి దేశమును స్వాధీనపరచుకొనెదరు. | 23 విూ దేవుడైన యెహోవా విూకు ఏర్పరచిన నిబంధనను మరచి, నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసికొనకుండునట్లు విూరు జాగ్రత్తపడవలెను. | 24 ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషముగల దేవుడునై యున్నాడు. | 25 విూరు పిల్లలను పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహు కాలము నివసించిన తరువాత మిమ్మును విూరు పాడుచేసికొని, యే స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నుల యెదుట కీడు చేసిన యెడల | 26 విూరు ఈ యొర్దాను దాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండ త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమ్యాకాశములను విూవిూద సాకక్షులుగా ఉంచుచున్నాను. ఆ దేశమందు బహు దినములుండక విూరు బొత్తిగా నశించిపోదురు | 27 మరియు యెహోవా జనములలో మిమ్మును చెదరగొట్టును; యెహోవా ఎక్కడికి మిమ్మును తోలివేయునో అక్కడి జనములలో విూరు కొద్దిమందే మిగిలియుందురు. | 28 అక్కడ విూరు మనుష్యుల చేతిపనియైన కఱ్ఱ రాతి దేవతలను పూజించెదరు; అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. | 29 అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను విూరు వెదకిన యెడల, నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. | 30 ఈ సంగతులన్నియు నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన యెడల | 31 నీ దేవుడైన యెహోవా కనికరముగల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు; నిన్ను నాశనము చేయడు; తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. | 32 దేవుడు భూమి విూద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటె ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశము యొక్క యీ దిక్కు నుండి ఆకాశము యొక్క ఆ దిక్కువరకు ఇట్టి గొప్ప కార్యము జరిగెనా? దీనివంటి వార్త వినబడెనా? అని నీవు అడుగుము. | 33 నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాటలాడుట వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రదికెనా? | 34 విూ దేవుడైన యెహోవా ఐగుప్తులో విూ కన్నుల యెదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోను సూచక క్రియలతోను మహత్కార్యములతోను యుద్ధముతోను బాహుబలముతోను చాచిన చేతితోను మహా భయంకర కార్యములతోను ఎప్పుడైనను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసికొన యత్నము చేసెనా? | 35 అయితే యెహోవా దేవుడనియు, ఆయన తప్ప మరి యొకడు లేడనియు నీవు తెలిసికొనునట్లు అది నీకు చూపబడెను. | 36 నీకు బోధించుటకు ఆయన ఆకాశము నుండి తన స్వరమును నీకు వినిపించెను; భూమి విూద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు వింటివి. | 37 ఆయన నీ పితరులను ప్రేమించెను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను. | 38 నీకంటె బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ల గొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకై నీకు తోడు గానుండి ఐగుప్తులో నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించెను. | 39 కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమియందును యెహోవాయే దేవుడనియు, మరియొక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము | 40 మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికిని క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నేడు నేను నీ కాజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. | 41 అంతకుముందొకడు పగపట్టక పరాకున తన పొరుగు వాని చంపిన యెడల | 42 చంపిన వాడు పారిపోవుటకు మోషే తూర్పుదిక్కున, యొర్దాను ఇవతల మూడు పురములను వేరుపరచెను. అట్టివాడెవడైనను ఆ పురములలో దేనిలోనికినైనను పారిపోయి బ్రదుకును. | 43 అవేవనగా రూబేనీయులకు మైదానపు దేశారణ్యమందలి బేసెరును, గాదీయులకు గిలాదులోనున్న రామోతును, మనష్షీయులకు బాషానులోనున్న గోలాను అనునవే. 44 మోషే ఇశ్రాయేలీయులకిచ్చిన ధర్మశాస్త్రము ఇది. | 45 ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వెలుపలికి వచ్చుచుండగా | 46 యొర్దాను ఇవతల బేత్పయోరు ఎదుటి లోయలో హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోను దేశమందు | 47 మోషే ఇశ్రాయేలీయులకు నియమించిన శాసనములు కట్టడలు న్యాయవిధులు ఇవి. | 48 మోషేయు ఇశ్రాయేలీయులును ఐగుప్తులో నుండి వచ్చుచు ఆ సీహోనును హతముచేసి అతని దేశమును, యొర్దాను ఇవతల ఉదయదిక్కుననున్న బాషాను రాజైన ఓగు యొక్క దేశమును, అర్నోను ఏటి దరినున్న అరోయేరు మొదలుకొని హెర్మోనను సీయోను కొండవరకున్న అమోరీయుల యిద్దరు రాజుల దేశమును, | 49 పిస్గా యూటలకు దిగువగా అరాబా సముద్రము వరకు తూర్పుదిక్కున యొర్దాను అద్దరి అరాబా ప్రదేశమంతయు స్వాధీనపరచుకొనిరి.

Previous