BLM
 

 
Previous
  ద్వితీయోపదేశకాండము 1 అధ్యాయము  

1 యొర్దాను ఇవతలనున్న అరణ్యములో, అనగా పారాను కును తోపెలు, లాబాను, హజేరోతు, దీజాహాబను స్థలములకును మధ్య సూపునకు ఎదురుగానున్న ఆరాబాలో1 మోషే ఇశ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు ఇవే. | 2 హోరేబులో నుండి శేయీరు మన్నెపు మార్గముగా కాదేషు బర్నేయ వరకు పదకొండు దినముల ప్రయాణము. | 3 హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనును అష్తారోతులో నివసించిన బాషాను రాజైన ఓగును ఎద్రెయీలో హతము చేసిన తరువాత | 4 నలుబదియవ సంవత్సరములో పదకొండవ నెల మొదటి తేదిని మోషే ఇశ్రాయేలీయులకు బోధించుటకై యెహోవా తన కాజ్ఞాపించినదంతయు వారితో చెప్పెను. | 5 యొర్దాను ఇవతలనున్న మోయాబు దేశమున మోషే యీ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్లనెను | 6 -మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఈలాగు సెలవిచ్చెను-ఈ పర్వతము నొద్ద విూరు నివసించిన కాలము చాలును; | 7 విూరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్నెమునకును, అరాబాలోను, మన్నెములోను, లోయలోను, దక్షిణ దిక్కున సముద్రతీరములోనున్న స్థలములన్నిటికిని, కనాను దేశమునకును, లెబానోనుకును, మహానదియైన యూఫ్రటీసు వరకును2 వెళ్లుడి. | 8 ఇదిగో ఆ దేశమును విూకు అప్పగించితిని విూరు వెళ్లి యెహోవా విూ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకును వారి తరువాత వారి సంతానమునకును ఇచ్చెదనని నేను ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకొనుడి. | 9 అప్పుడు నేను-ఒంటరిగా మిమ్మును భరింపలేను. | 10 విూ దేవుడైన యెహోవా మిమ్ము విస్తరింపజేసెను గనుక నేడు విూరు ఆకాశ నక్షత్రములవలె విస్తరించి యున్నారు. | 11 విూ పితరుల దేవుడైన యెహోవా విూ జనసంఖ్యను వెయ్యి రెట్లు ఎక్కువ చేసి, తాను విూతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించును గాక. | 12 నేనొక్కడనే విూ కష్టమును విూ భారమును విూ వివాదమును ఎట్లు భరింపగలను? | 13 జ్ఞానవివేకములు కలిగి, విూ విూ గోత్రములలో ప్రసిద్ధి చెందిన మనుష్యులను ఏర్పరచుకొనుడి; వారిని విూ విూద నియమించెదనని విూతో చెప్పగా | 14 విూరు-నీవు చెప్పిన మాట చొప్పున చేయుట మంచిదని నాకు ఉత్తరమిచ్చితిరి. | 15 కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన విూ విూ గోత్రములలోని ముఖ్యులను పిలిపించుకొని, విూ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటకై వెయ్యి మందికి ఒకడును, నూరుమందికి ఒకడును ఏబదిమందికి ఒకడును, పదిమందికి ఒకడును వారిని, విూ విూద నేను నియమించితిని. | 16 అప్పుడు నేను విూ న్యాయాధిపతులతో -విూ సహోదరుల వ్యాజ్యెములను తీర్చి, ప్రతి మనుష్యునికిని వాని సహోదరునికిని వాని యొద్దనున్న పరదేశికిని న్యాయమునుబట్టి విూరు తీర్పు తీర్చవలెను. | 17 తీర్పు తీర్చునప్పుడు అల్పుల సంగతిగాని ఘనుల సంగతి గాని పక్షపాతము లేకుండ వినవలెను; న్యాయపు తీర్పు దేవునిదే. కాబట్టి విూరు మనుష్యుని ముఖము చూచి భయపడవద్దు. విూకు అసాధ్యమైన కఠిన వ్యాజ్యెమును నా యొద్దకు తీసికొని రావలెను; నేను దానిని విచారించెదనని వారి కాజ్ఞాపించితిని. | 18 మరియు విూరు చేయవలసిన సమస్త కార్యములను గూర్చి అప్పుడు విూకాజ్ఞాపించితిని. | 19 మనము హోరేబు నుండి సాగి మన దేవుడైన యెహోవా మనకాజ్ఞాపించినట్లు విూరు చూచిన ఆ ఘోరమైన మహారణ్యములో నుండి వచ్చి, అమోరీయుల మన్నెపు మార్గమున కాదేషు బర్నేయకు చేరితిమి. | 20 అప్పుడు నేను-మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న అమోరీయుల మన్నె మునకు వచ్చియున్నాము. | 21 ఇదిగో నీ దేవుడైన యెహోవా యీ దేశమును నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాని స్వాధీనపరచుకొనుము, భయపడకుము, అధైర్యపడకుమని నీతో చెప్పితిని. | 22 అప్పుడు విూరందరు నా యొద్దకు వచ్చి-మనకంటె ముందుగా మనుష్యులను పంపుదము; వారు మన కొరకు ఈ దేశమును వేగు చూచి, తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్లవలసిన త్రోవను గూర్చియు, మనము చేర వలసిన పురములను గూర్చియు మనకు వర్తమానము చెప్పుదురంటిరి. | 23 ఆ మాట మంచిదనుకొని నేను గోత్ర మొక్కింటికి ఒక మనుష్యుని చొప్పున పన్నిద్దరు మనుష్యులను పిలిపించితిని. | 24 వారు తిరిగి ఆ మన్నెమునకు పోయి ఎష్కోలు లోయకు వచ్చి దాని వేగుజూచి ఆ దేశ ఫలములను చేత పట్టుకొని | 25 మన యొద్దకు తీసికొని వచ్చి-మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న దేశము మంచిదని మనకు తెలియజెప్పిరి. | 26 అయితే విూరు వెళ్లనొల్లక విూ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరుగబడి | 27 విూ గుడారములలో సణుగుచు-యెహోవా మనయందు పగపట్టినందున మనలను సంహరించునట్లు అమోరీయుల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తుదేశములో నుండి మనలను రప్పించియున్నాడు. | 28 మనమెక్కడికి వెళ్లగలము? మన సహోదరులు-అక్కడి జనులు మనకంటె బలిష్ఠులును ఎత్తరులునై యున్నారు; ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటు ప్రాకారములతో నున్నవి; అక్కడ అనాకీయులను చూచితిమని చెప్పి మా హృదయములను కరగజేసిరని విూరు చెప్పితిరి. | 29 అప్పుడు నేను మిమ్మును చూచి దిగులు పడకుడి, వారికి భయపడకుడి, | 30 విూకు ముందర నడచుచున్న విూ దేవుడైన యెహోవా విూ కన్నుల యెదుట | 31 ఐగుప్తులోను అరణ్యములోను విూ కొరకు చేసినట్టు విూ పక్షముగా యుద్ధము చేయును, విూరు ఈ చోటికి చేరువరకు విూరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తికొనునట్లు విూ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తికొని వచ్చిన సంగతి విూరెరుగుదురని విూతో చెప్పితిని. | 32 అయితే విూకు త్రోవ చూపించి విూ గుడారములను వేయవలసిన స్థలమును విూకు సిద్ధపరచునట్లు | 33 రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను విూకు ముందర నడిచిన విూ దేవుడైన యెహోవాయందు విూరు విశ్వాస ముంచలేదు. | 34 కాగా యెహోవా విూరు చెప్పిన మాటలు విని | 35 బహుగా కోపపడి-నేను విూ పితరులకిచ్చెదనని ప్రమాణము చేసిన యీ మంచి దేశమును ఈ చెడ్డతరము వారిలో | 36 యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు. అతడు పూర్ణమనస్సుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకును ఇచ్చెదనని ప్రమాణము చేసెను. | 37 మరియు యెహోవా మిమ్మునుబట్టి నా విూద కోపపడి-నీ పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించునుగాని నీవు దానిలో ప్రవేశింపవు. | 38 అతడు ఇశ్రాయేలీయులు దాని స్వాధీనపరచుకొన చేయును గనుక అతని ధైర్యపరచుము. | 39 ఆ దినమున మంచి చెడ్డలనెరుగని విూ కుమారులు, అనగా-అపహరింపబడుదురని విూరు చెప్పిన విూ పిల్లలు దానిలో ప్రవేశింతురు; దానిని వారి కిచ్చెదను; వారు దానిని స్వాధీనపరచుకొందురు. | 40 విూరు తిరిగి ఎఱ్ఱసముద్ర మార్గముగా అరణ్యమునకు ప్రయాణము చేయుడని చెప్పెను. | 41 అందుకు విూరు-మేము యెహోవాకు విరోధముగా పాపము చేసితిమి; మా దేవుడైన యెహోవా మాకాజ్ఞాపించిన మాటలన్నిటి ననుసరించి మేము పోయి యుద్ధము చేసెదమని నాతో ఉత్తరమిచ్చి, విూరందరు విూ ఆయుధములను కట్టుకొని, ఆలోచింపక ఆ మన్నెమునకు పోగా | 42 యెహోవా నాతో ఇట్లనెను- యుద్ధమునకు పోకుడి; నేను విూ మధ్యనుండను గనుక వెళ్లకుడి; విూరు వెళ్లినను విూ శత్రువుల యెదుట హతము చేయబడుదురని వారితో చెప్పుము. | 43 ఆ మాటలు నేను విూతో చెప్పినప్పుడు విూరు వినక యెహోవా మాటకు తిరుగబడి మూర్ఖులై ఆ మన్నెమునకు వెళ్లితిరి. | 44 అప్పుడు ఆ మన్నెములో నివసించిన అమోరీయులు విూకెదురుగా బయలుదేరి వచ్చి, కందిరీగలవలె మిమ్ము తరిమి హోర్మా వరకు శేయీరులో మిమ్ము హతము చేసిరి. | 45 తరువాత విూరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని యేడ్వగా, యెహోవా విూ మొఱ్ఱను లక్ష్యపెట్టలేదు, విూ మాట వినలేదు. | 46 కాగా విూరు కాదేషులో బహు దినములు నివసించితిరి. విూరు నివసించిన దినములెన్నో విూకు తెలిసినవి.

1. మృతసముద్రము దగ్గరనున్న లోయ. 2. ఫరాతు.
Previous