BLM
 

 
Previous
  సంఖ్యాకాండము 36 అధ్యాయము  

36 యోసేపు పుత్రుల వంశములలో మాకీరు కుమారుడును మనష్షే మనుమడునైన గిలాదు యొక్క పుత్రు వంశముల పెద్దలు వచ్చి మోషే యెదుటను ఇశ్రాయేలీయుల పితరుల కుటుంబముల ప్రధానుల యెదుటను మాటలాడి యిట్లనిరి | 2 -ఆ దేశమును వంతు చీట్ల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా ఇయ్యవలెనని యెహోవా మా యేలినవాని కాజ్ఞాపించెను. మరియు మా సహోదరుడైన సెలోపెహాదు స్వాస్థ్యమును అతని కుమార్తెలకు ఇయ్యవలెనని మా యేలినవాడు యెహోవా చేత ఆజ్ఞనొందెను. | 3 అయితే వారు ఇశ్రాయేలీయులలో వేరు గోత్రముల వారి నెవరినైనను పెండ్లి చేసికొనిన యెడల వారి స్వాస్థ్యము మా పితరుల స్వాస్థ్యము నుండి తీయబడి, వారు కలిసికొనిన వారి గోత్ర స్వాస్థ్యముతో కలుపబడి, మాకు వంతు చీట్ల చొప్పున కలిగిన స్వాస్థ్యము నుండి విడిపోవును. | 4 కాబట్టి ఇశ్రాయేలీయులకు సునాద1 సంవత్సరము వచ్చునప్పుడు వారి స్వాస్థ్యము వారు కలిసికొనిన వారి గోత్ర స్వాస్థ్యముతో కలుపబడును గనుక ఆ వంతున మా పితరుల గోత్ర స్వాస్థ్యము తగ్గిపోవుననగా | 5 మోషే యెహోవా సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి యిట్లనెను- యోసేపు పుత్రుల గోత్రికులు చెప్పినది న్యాయమే. | 6 యెహోవా సెలోపెహాదు కుమార్తెలను గూర్చి సెలవిచ్చిన మాట ఏదనగా - వారు తమకు ఇష్టులైన వారిని పెండ్లి చేసికొనవచ్చును గాని వారు తన తండ్రి గోత్ర వంశములోనే పెండ్లి చేసికొనవలెను. | 7 ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రములోనికి పోకూడదు. ఇశ్రాయేలీయులలో ప్రతివాడును తన తన పితరుల గోత్రస్వాస్థ్యమును హత్తుకొని యుండవలెను. | 8 మరియు ఇశ్రాయేలీయులకు వారి వారి పితరుల స్వాస్థ్యము కలుగునట్లు, ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వాస్థ్యముగల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్రవంశములోనే పెండ్లి చేసికొనవలెను. | 9 స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రమునకు పోకూడదు. ఇశ్రాయేలీయుల గోత్రములు వారి వారి స్వాస్థ్యములో నిలిచియుండవలెను. | 10 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోపెహాదు కుమార్తెలు చేసిరి. | 11 సెలోపెహాదు కుమార్తెలైన మహలా, తిర్సా, హొగ్లా, మిల్కా, నోయా తమ తండ్రి సహోదరుని కుమారులను పెండ్లి చేసికొనిరి. | 12 వారు యోసేపు కుమారులైన మనష్షీయులను పెండ్లి చేసికొనిరి గనుక వారి స్వాస్థ్యము వారి తండ్రి గోత్ర వంశములోనే నిలిచెను. | 13 యెరికో యొద్ద యొర్దానుకు సవిూపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేచేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన విధులును ఆజ్ఞలును ఇవే.

1. జూబిలి.
Previous