|
||
| Previous | ||
| సంఖ్యాకాండము 35 అధ్యాయము | ||
35 మరియు యెరికో యొద్ద యొర్దానుకు సవిూపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను | 2 - ఇశ్రాయేలీయులు తాము పొందు స్వాస్థ్యములో లేవీయులు నివసించుటకు వారికి పురములను ఇయ్యవలెనని వారి కాజ్ఞాపించుము; ఆ పురముల చుట్టునున్న పల్లెలను లేవీయులకియ్యవలెను. | 3 వారు నివసించుటకు ఆ పురములు వారివగును. వాటి పొలములు వారి పశువులకును వారి మందలకును వారి సమస్త జంతువులకును ఉండవలెను. | 4 విూరు లేవీయులకిచ్చు పురముల పల్లెల ప్రతి పురము యొక్క గోడ మొదలుకొని చుట్టు వెయ్యి మూరలు | 5 మరియు విూరు ఆ పురముల వెలుపల నుండి తూర్పు దిక్కున రెండువేల మూరలను, దక్షిణ దిక్కున రెండువేల మూరలను, పడమటి దిక్కున రెండు వేల మూరలను, ఉత్తర దిక్కున రెండువేల మూరలను కొలవవలెను. ఆ నడుమ పురముండవలెను. అది వారి పురములకు పల్లెలుగా నుండును. | 6 మరియు విూరు లేవీయులకిచ్చు పురములలో ఆరు ఆశ్రయపురములుండవలెను. నరహంతకుడు వాటిలోనికి పారిపోవునట్లుగా వాటిని నియమింపవలెను. అవియుగాక నలువది రెండు పురములను ఇయ్యవలెను. | 7 వాటి వాటి పల్లెలతో కూడ విూరు లేవీయులకు ఇయ్యవలసిన పురములన్నియు నలువది యెనిమిది. | 8 విూరు ఇచ్చు పురములు ఇశ్రాయేలీయుల స్వాస్థ్యములో నుండియే ఇయ్యవలెను. విూరు ఎక్కువైన దానిలో ఎక్కువగాను, తక్కువైన దానిలో తక్కువగాను ఇయ్యవలెను. ప్రతి గోత్రము తాను పొందు స్వాస్థ్యము చొప్పున, తన తన పురములలో కొన్నిటిని లేవీయులకు ఇయ్యవలెను. | 9 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను | 10 -నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము. విూరు యొర్దాను దాటి కనాను దేశములోనికి వెళ్లిన తరువాత | 11 ఆశ్రయ పురములుగా ఉండుటకు విూరు పురములను ఏర్పరచుకొనవలెను. | 12 పొరబాటున ఒకని చంపినవాడు వాటిలోనికి పారిపోవచ్చును. తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజమునెదుట నిలుచు వరకు వాడు మరణశిక్ష నొంద కూడదు గనుక ప్రతిహత్య చేయువాడు రాకుండ అవి విూకు ఆశ్రయపురములుగా ఉండును. | 13 విూరు ఇయ్యవలసిన ఆ పురములలో ఆరు ఆశ్రయపురములుండవలెను. | 14 వాటిలో యొర్దాను ఇవతల మూడు పురములను ఇయ్యవలెను, కనాను దేశములో మూడు పురములను ఇయ్య వలెను. అవి విూకు ఆశ్రయపురములుగా ఉండును. | 15 పొరబాటున ఒకని చంపిన యెవడైనను వాటిలోనికి పారి పోవునట్లు ఆ ఆరు పురములు ఇశ్రాయేలీయులకును పర దేశులకును విూ మధ్య నివసించు వారికిని ఆశ్రయమై యుండును. | 16 ఒకడు చచ్చునట్లు వానిని ఇనుప ఆయుధముతో కొట్టువాడు నరహంతకుడు ఆ నరహంతకునికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. | 17 ఒకడు చచ్చునట్లు మరియొకడు రాతితో వాని కొట్టగా దెబ్బ తినిన వాడు చనిపోయిన యెడల కొట్టినవాడు నరహంతకుడగును. ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. | 18 మరియు ఒకడు చచ్చునట్లు మరియొకడు చేతికఱ్ఱతో కొట్టగా దెబ్బ తినినవాడు చనిపోయిన యెడల కొట్టినవాడు నరహంతకుడగును. ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. | 19 హత్య విషయములో ప్రతిహత్య చేయువాడు తానే నరహంతకుని చంపవలెను. | 20 వాని కనుగొనినప్పుడు వాని చంపవలెను. ఒకడు చచ్చునట్లు వాని పగపట్టి పొడిచినను, లేక పొంచియుండి వాని విూద దేనినైనను వేసినను, లేక ఒకడు చచ్చునట్లు వైరము వలన చేతితో వాని కొట్టినను, కొట్టినవాడు నరహంతకుడు, నిశ్చయముగా వాని చంపవలెను. | 21 నరహత్య విషయములో ప్రతిహత్య చేయు వాడు ఆ నరహంతకుని కనుగొనినప్పుడు వాని చంపవలెను. | 22-23 అయితే పగపట్టక హఠాత్తుగా వానిని పొడిచినను, పొంచియుండక వానివిూద ఏ ఆయుధమునైన వేసి నను, వాని చూడక ఒకడు చచ్చునట్లు వానివిూద రాయి పడవేసినను, దెబ్బతినినవాడు చనిపోయిన యెడల కొట్టిన వాడు వానివిూద పగపట్టలేదు, వానికి హానిచేయ గోరలేదు. | 24 కాబట్టి సమాజము ఈ విధులనుబట్టి కొట్టిన వానికిని హత్య విషయములో ప్రతిహత్య చేయువానికిని తీర్పు తీర్చవలెను. | 25 అట్లు సమాజము నరహత్య విషయ ములో ప్రతిహత్య చేయువాని చేతిలో నుండి ఆ నరహంతకుని విడిపించవలెను. అప్పుడు సమాజము వాడు పారి పోయిన ఆశ్రయ పురమునకు వాని మరల పంపవలెను. వాడు పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృతినొందు వరకు అక్కడనే నివసింపవలెను. | 26 అయితే ఆ నరహంతకుడు ఎప్పుడైనను తాను పారిపోయి చొచ్చిన ఆశ్రయపురము యొక్క సరిహద్దును దాటి వెళ్లునప్పుడు | 27 నరహత్య విషయములో ప్రతిహత్య చేయువాడు ఆశ్రయపురము యొక్క సరిహద్దు వెలుపల వాని కనుగొనిన యెడల, ఆ ప్రతి హంతకుడు ఆ నరహంతకుని చంపినను వానివిూద ప్రాణము తీసిన దోషము ఉండదు. | 28 ఏలయనగా ప్రధానయాజకుడు మృతినొందు వరకు అతడు ఆశ్రయపురములోనే నివసింపవలెను. ప్రధానయాజకుడు మృతినొందిన తరువాత ఆ నరహంతకుడు తన స్వాస్థ్య మున్న దేశమునకు తిరిగి వెళ్లవచ్చును. | 29 ఇవి విూ సమస్త నివాసస్థలములలో విూ తరతరములకు విూకు విధింపబడిన కట్టడ. | 30 ఎవడైనను ఒకని చావగొట్టిన యెడల సాక్షుల నోటిమాట వలన ఆ నరహంతకునికి మరణశిక్ష విధింపవలెను. ఒక సాక్షి మాటవిూదనే యెవనికిని మరణశిక్ష విధింప కూడదు. | 31 చావతగిన నరహంతకుని ప్రాణము కొరకు విూరు విమోచన ధనమును అంగీకరింపక నిశ్చయముగా వానికి మరణశిక్ష విధింపవలెను. | 32 మరియు ఆశ్రయపుర మునకు పారిపోయినవాడు యాజకుడు మృతినొందక మునుపు స్వదేశమందు నివసించునట్లు వానిచేత విమోచన ధనమును అంగీకరింపకూడదు. | 33 విూరుండు దేశమును అపవిత్రపరచకూడదు; నరహత్య దేశమును అపవిత్రపరచును గదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము వలననే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేనివలనను కలుగదు. | 34 విూరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు. అందులో నేను విూ మధ్యను నివసించుచున్నాను. నిజముగా యెహోవా అను నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నాను. |
||
| Previous | ||