|
||
| Previous | ||
| సంఖ్యాకాండము 34 అధ్యాయము | ||
34 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను-నీవు ఇశ్రాయేలీయులతో | 2 కనాను దేశమున, అనగా పొలిమేరల చొప్పున విూరు చీట్లు వేసి స్వాస్థ్యముగా పంచుకొను కనాను దేశమున | 3 విూరు ప్రవేశించుచుండగా, విూ దక్షిణదిక్కు సీను అరణ్యము మొదలుకొని ఎదోము సరిహద్దు, అనగా | 4 విూ దక్షిణపు సరిహద్దు ఉప్పు సముద్రము యొక్క తూర్పు తీరము వరకు ఉండును. విూ సరిహద్దు దక్షిణము మొదలుకొని అక్రబ్బీము కనుమ యొద్ద తిరిగి సీను వరకు వ్యాపించును. అది దక్షిణము నుండి కాదేషు బర్నేయ వరకు వ్యాపించి, అక్కడ నుండి హసరద్దారు వరకు పోయి, అక్కడ నుండి అస్మోను వరకు సాగును. | 5 అస్మోను నుండి ఐగుప్తు నది వరకు సరిహద్దు తిరిగి సముద్రము వరకు వ్యాపించును. | 6 పడమటి సరిహద్దు ఏదనగా మహాసముద్రము, అదే విూకు పడమటి సరిహద్దుగా నుండును. | 7 విూ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రము యొద్దనుండి హోరు కొండ వరకు ఏర్పరచుకొనవలెను. | 8 హోరు కొండ యొద్ద నుండి హమాతునకు పోవు మార్గము వరకు ఏర్పరచుకొనవలెను. ఆ సరిహద్దు సెదాదు వరకు వ్యాపించును. | 9 అక్కడ నుండి సరిహద్దు జిప్రోను వరకు వ్యాపించును, దాని చివర హసరేనానునొద్ద ఉండును. అది విూకు ఉత్తరపు సరిహద్దు. | 10 తూర్పు సరిహద్దు హసరేనాను నుండి షెపాము వరకు విూరు ఏర్పరచుకొనవలెను. | 11 షెపాము నుండి సరిహద్దు అయీనుకు తూర్పున రిబ్లా వరకు నుండును. ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నెరెతు సముద్రమునొడ్డును తగిలియుండును. | 12 ఆ సరిహద్దు యొర్దాను నది వరకు దిగి ఉప్పు సముద్రముదనుక వ్యాపించును. ఆ దేశము చుట్టునున్న సరిహద్దుల మధ్యనున్న దేశము విూదై యుండునని వారి కాజ్ఞాపించుము. | 13 మోషే ఇశ్రాయేలీయులతో-విూరు చీట్లచేత పొందబోవుచున్న దేశము ఇది. యెహోవా తొమ్మిది గోత్రములకును అర్ధగోత్రమునకును దీని నియ్యవలెనని ఆజ్ఞాపించెను; | 14 ఏలయనగా తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము రూబేనీయులును గాదీయులును తమ తమ స్వాస్థ్యముల నొందిరి. | 15 మనష్షే అర్ధగోత్రపు వారు తమ స్వాస్థ్యము నొందిరి. ఆ రెండు గోత్రపు వారును అర్ధ గోత్రపు వారును సూర్యోదయ దిక్కున, అనగా తూర్పు దిక్కున యెరికో యొద్ద యొర్దాను ఇవతల తమ తమ స్వాస్థ్యములను పొందిరని చెప్పెను. | 16 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను | 17 -ఆ దేశమును విూకు స్వాస్థ్యముగా పంచి పెట్టవలసిన వారెవరనగా, యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు | 18 మరియు ఆ దేశమును విూకు స్వాస్థ్యముగా పంచి పెట్టుటకు ప్రతి గోత్రములో ఒక్కొక్క ప్రధానుని ఏర్పరచుకొనవలెను. | 19 వారెవరనగా, యూదావారి గోత్రములో యెఫున్నె కుమారుడైన కాలేబు. | 20 షిమ్యోనీయుల గోత్రములో అవిూహూదు కుమారుడైన షెమూయేలు, | 21 బెన్యావిూనీయుల గోత్రములో కిస్లోను కుమారుడైన ఎలీదాదు. | 22 దానీయుల గోత్రములో యొగ్లి కుమారుడైన బుక్కీ ప్రధాని, | 23 యోసేపు పుత్రులలో ఏఫోదు కుమారుడైన హన్నీయేలు మనష్షీయుల గోత్ర ప్రధాని, | 24 ఎఫ్రాయివిూయుల గోత్రములో షిప్తాను కుమారుడైన కెమూయేలు ప్రధాని, | 25 జెబూలూనీయుల గోత్రములో పర్నాకు కుమారుడైన ఎలీషాపాను ప్రధాని, | 26 ఇశ్శాఖారీయుల గోత్రములో అజాను కుమారుడైన పల్తీయేలు ప్రధాని, | 27 ఆషేరీయుల గోత్రములో షెలోమి కుమారుడైన అహీహూదు ప్రధాని. | 28 నఫ్తాలీయుల గోత్రములో అవిూహూదు కుమారుడైన పెదహేలు ప్రధాని. | 29 కనాను దేశములో ఇశ్రాయేలీయులకు వారి వారి స్వాస్థ్యములను పంచిపెట్టుటకు యెహోవా ఆజ్ఞాపించిన వారు వీరే. |
||
| Previous | ||