BLM
 

 
Previous
  సంఖ్యాకాండము 33 అధ్యాయము  

33 మోషే అహరోనుల వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తుదేశములో నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణములు ఇవి. | 2 మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము, వారి ప్రయాణములనుబట్టి వారి సంచార క్రమములను వ్రాసెను. వారి సంచార క్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి. | 3 మొదటి నెల పదునయిదవ దినమున వారు రామెసేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలులనందరిని ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులందరి కన్నుల యెదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి. | 4 అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను. | 5 ఇశ్రాయేలీయులు రామెసేసులో నుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి. | 6 సుక్కో తులో నుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాములో దిగిరి. | 7 ఏతాములో నుండి బయలుదేరి బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతు తట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి. | 8 పీహహీరోతులో నుండి బయలుదేరి సముద్రము మధ్య నుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు మూడు దినముల ప్రయాణము చేసి మారాలో దిగిరి. మారాలో నుండి బయలుదేరి ఏలీముకు వచ్చిరి. | 9 ఏలీములో పన్నెండు నీటిబుగ్గలును డెబ్బది యీతచెట్లును ఉండెను; అక్కడ దిగిరి. | 10 ఏలీములో నుండి వారు బయలుదేరి ఎఱ్ఱ సముద్రమునొద్ద దిగిరి. | 11 ఎఱ్ఱసముద్రము నొద్ద నుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి. | 12 సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపకాలో దిగిరి. | 13 దోపకాలో నుండి బయలుదేరి ఆలూషులో దిగిరి. | 14 ఆలూషులో నుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి. అక్కడ జనులు త్రాగు టకై నీళ్లు లేకపోయెను. | 15 రెఫీదీములో నుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి. | 16 సీనాయి అరణ్యము నుండి బయలుదేరి కిబ్రోతుహత్తావాలో దిగిరి. | 17 కిబ్రోతుహత్తా వాలో నుండి బయలుదేరి హజేరోతులో దిగిరి. | 18 హజే రోతులో నుండి బయలుదేరి రిత్మాలో దిగిరి. | 19 రిత్మాలో నుండి బయలుదేరి రిమ్మోను పారెసులో దిగిరి. | 20 రిమ్మోను పారె సులో నుండి బయలుదేరి లిబ్నాలో దిగిరి. | 21 లిబ్నాలో నుండి బయలుదేరి రీసాలో దిగిరి. | 22 రీసాలో నుండి బయలు దేరి కెహేలాతాలో దిగిరి. | 23 కెహేలాతాలో నుండి బయలుదేరి షాపెరు కొండనొద్ద దిగిరి. | 24 షాపెరు కొండ నొద్దనుండి బయలుదేరి హరాదాలో దిగిరి. | 25 హరాదాలో నుండి బయలుదేరి మకెలోతులో దిగిరి. | 26 మకెలోతులో నుండి బయలుదేరి తాహతులో దిగిరి. | 27 తాహతులో నుండి బయలుదేరి తారహులో దిగిరి. | 28 తారహులో నుండి బయలుదేరి మిత్కాలో దిగిరి. | 29 మిత్కాలో నుండి బయలుదేరి హష్మోనాలో దిగిరి. | 30 హష్మోనాలో నుండి బయలుదేరి మొసేరోతులో దిగిరి. | 31 మొసేరోతులో నుండి బయలుదేరి బెనేయాకానులో దిగిరి. | 32 బెనేయాకానులో నుండి బయలుదేరి హోర్‌హగ్గిద్గాదులో దిగిరి. | 33 హోర్‌హగ్గిద్గాదులో నుండి బయలుదేరి యొత్బాతాలో దిగిరి. | 34 యొత్బాతాలో నుండి బయలుదేరి ఎబ్రోనాలో దిగిరి. | 35 ఎబ్రోనాలో నుండి బయలుదేరి ఎసోన్గెబెరులో దిగిరి. | 36 ఎసోన్గెబెరులో నుండి బయలుదేరి కాదేషు అనబడిన సీను అరణ్యములో దిగిరి. | 37 కాదేషులో నుండి బయలుదేరి ఎదోము దేశముకడనున్న హోరు కొండ దగ్గర దిగిరి. | 38 యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన నలువదియవ సంవత్సరమున అయిదవ నెల మొదటి దినమున అక్కడ మృతినొందెను. | 39 అహరోను నూట ఇరువది మూడేండ్ల యీడుగలవాడై హోరు కొండవిూద మృతినొందెను. | 40 అప్పుడు దక్షిణ దిక్కున కనాను దేశమందు నివసించిన అరాదు రాజైన కనానీయుడు ఇశ్రాయేలీయులు వచ్చిన సంగతి వినెను. | 41 వారు హోరు కొండనుండి బయలుదేరి సల్మానాలో దిగిరి. | 42 సల్మానాలో నుండి బయలుదేరి పూనొనులో దిగిరి. | 43 పూనొనులో నుండి బయలుదేరి ఓబోతులో దిగిరి. | 44 ఓబోతులో నుండి బయలుదేరి మోయాబు పొలిమేర యొద్దనున్న ఈయ్యె అబారీములో దిగిరి. | 45 ఈయ్యె అబారీములో నుండి బయలుదేరి దీబోనుగాదులో దిగిరి. | 46 దీబోనుగాదులో నుండి బయలుదేరి అల్మోను దిబ్లాతాయిములో దిగిరి. | 47 అల్మోను దిబ్లాతాయిములో నుండి బయలుదేరి నెబో యెదుటి అబారీము కొండలలో దిగిరి. | 48 అబారీము కొండలలో నుండి బయలుదేరి యెరికో దగ్గర యొర్దానుకు సవిూపమైన మోయాబు మైదానములలో దిగిరి. | 49 వారు మోయాబు మైదానములలో బెత్యేషిమోతు మొదలుకొని ఆబేలు షిత్తీమువరకు యొర్దాను దగ్గర దిగిరి. | 50 యెరికో యొద్ద, అనగా యొర్దానుకు సవిూపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. | 51 -నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము-విూరు యొర్దానును దాటి కనానుదేశమును చేరిన తరువాత | 52 ఆ దేశ నివాసులందరిని విూ యెదుట నుండి వెళ్లగొట్టి, వారి సమస్త ప్రతిమలను నాశనము చేసి వారి పోతవిగ్రహములన్నిటిని నశింపచేసి వారి ఉన్నత స్థలములనన్నిటిని పాడుచేసి | 53 ఆ దేశమును స్వాధీనపరచుకొని దానిలో నివసింపవలెను; ఏలయనగా దాని స్వాధీనపరచుకొనునట్లు ఆ దేశమును విూకిచ్చితిని. | 54 విూరు విూ వంశముల చొప్పున చీట్లు వేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును తక్కువమందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను. ఎవని చీటి యే స్థలమున పడునో వానికి ఆ స్థలమే కలుగును. విూ తండ్రుల గోత్రముల చొప్పున విూరు స్వాస్థ్యములు పొందవలెను. | 55 అయితే విూరు విూ యెదుట నుండి ఆ దేశనివాసులను వెళ్లగొట్టని యెడల, విూరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు విూ కన్నులలో ముండ్లుగాను విూ ప్రక్కలలో శూలములుగాను ఉండి, విూరు నివసించు ఆ దేశములో మిమ్మును బాధపెట్టెదరు. | 56 మరియు నేను వారికి చేయ తలంచినట్లు విూకు చేసెదనని వారితో చెప్పుము.

Previous