|
||
| Previous | ||
| సంఖ్యాకాండము 1 అధ్యాయము | ||
1 వారు ఐగుప్తు దేశము నుండి బయలు వెళ్లిన రెండవ సంవత్సరము రెండవ నెల మొదటి తేదిని, సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను | 2 -ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములనుబట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరిని లెక్కించి సర్వసమాజ సంఖ్యను వ్రాయించుము. | 3 ఇశ్రాయేలీయులలో సైన్యముగా వెళ్లు వారిని, అనగా ఇరువది యేండ్లు మొదలుకొని పైప్రాయముగల వారిని, తమ తమ సేనలనుబట్టి నీవును అహరోనును లెక్కింపవలెను. | 4 మరియు ప్రతి గోత్రములో ఒకడు, అనగా తన పితరుల కుటుంబములో ముఖ్యడు, విూతో కూడ ఉండవలెను. | 5 విూతో కూడ ఉండవలసిన వారి పేళ్లు ఏవేవనగా-రూబేను గోత్రములో షెదేయూరు కుమారుడైన ఏలీసూరు; | 6 షిమ్యోను గోత్రములో సూరీషద్దాయి కుమారుడైన షెలువిూయేలు | 7 యూదా గోత్రములో అవ్మిూనాదాబు కుమారుడైన నయస్సోను | 8 ఇశ్శాఖారు గోత్రములో సూయారు కుమారుడైన నెతనేలు | 9 జెబూ లూను గోత్రములో హేలోను కుమారుడైన ఏలీయాబు | 10 యోసేపు సంతానమందు, అనగా ఎప్రాయిము గోత్ర ములో అవిూహూదు కుమారుడైన ఎలీషామాయు; మనష్షే గోత్రములో పెదాసూరు కుమారుడైన గమలీయేలు | 11 బెన్యావిూను గోత్రములో గిద్యోనీ కుమారుడైన అబీదాను | 12 దాను గోత్రములో ఆవిూషద్దాయి కుమారుడైన అహీయెజెరు | 13 ఆషేరు గోత్రములో ఒక్రాను కుమారుడైన పగీయేలు | 14 గాదు గోత్రములో దెయూవేలు కుమారుడైన ఎలాసాపు | 15 నఫ్తాలి గోత్రములో ఏనాను కుమారుడైన అహీర అనునవి. | 16 వీరు సమాజములో పేరు పొందినవారు. వీరు తమ తమ పితరుల గోత్రములలో ప్రధానులు ఇశ్రాయేలీయుల కుటుంబములకు పెద్దలును. | 17 పేళ్లచేత వివరింపబడిన ఆ మనుష్యులను మోషే అహరోనులు పిలుచుకొని రెండవ నెల మొదటి తేదిని సర్వసమాజమును కూర్చెను. | 18 ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయముగలవారు తమ తమ వంశావళులనుబట్టి తమ తమ వంశములను తమ తమ పితరుల కుటుంబములను తమ తమ పెద్దల సంఖ్యను తెలియచెప్పగా | 19 యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యములో మోషే వారిని లెక్కించెను. | 20 ఇశ్రాయేలు ప్రధమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లు వారందరి సంఖ్యను తెలియ చెప్పగా రూబేను గోత్రములో లెక్కింపబడిన వారు నలుబదియారువేల ఐదువందల మందియైరి. | 21-22 షిమ్యోను పుత్రుల వంశావళి. తమ తమ వంశము లలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లు వారందరి పెద్దల సంఖ్యను తెలియచెప్పగా | 23 షిమ్యోను గోత్రములో లెక్కింపబడినవారు ఏబది తొమ్మిదివేల మూడు వందలమందియైరి. | 24 గాదు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లు వారందరి సంఖ్యను తెలియచెప్పగా | 25 గాదు గోత్రములో లెక్కింపబడినవారు నలుబది యయిదువేల ఆరువందల ఏబదిమందియైరి. | 26 యూదా పుత్రుల వంశావళి.తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లు వారందరి సంఖ్యను తెలియచెప్పగా | 27 యూదా గోత్రములో లెక్కింప బడినవారు డెబ్బది నాలుగువేల ఆరువందలమంది యైరి. 28 ఇశ్శాఖారు పుత్రుల వంశావళి. తమ తమ వంశము లలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లు వారందరి సంఖ్యను తెలియచెప్పగా | 29 ఇశ్శాఖారు గోత్రములో లెక్కింపబడిన వారు ఏబది నాలుగువేల నాలుగువందల మందియైరి. | 30 జెబూలూను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లు వారందరి సంఖ్యను తెలియచెప్పగా | 31 జెబూలూను గోత్రములో లెక్కింపబడిన వారు ఏబది యేడువేల నాలుగువందల మందియైరి. | 32 యోసేపు పుత్రుల వంశావళి. అనగా ఎఫ్రాయిము పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లు వారందరి సంఖ్యను తెలియచెప్పగా | 33 యోసేపు గోత్రములో లెక్కింపబడిన వారు నలుబదివేల ఐదువందలమందియైరి. | 34 మనష్షే పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లు వారందరి సంఖ్యను తెలియచెప్పగా | 35 మనష్షే గోత్రములో లెక్కింప బడినవారు ముప్పది రెండువేల రెండువందలమందియైరి. | 36 బెన్యావిూను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లు వారందరి సంఖ్యను తెలియచెప్పగా | 37 బెన్యావిూను గోత్రములో లెక్కింపబడిన వారు ముప్పదియైదువేల నాలుగువందల మందియైరి. | 38 దాను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లు వారందరి సంఖ్యను తెలియచెప్పగా | 39 దాను గోత్రములో లెక్కింప బడినవారు అరువది రెండువేల ఏడువందలమందియైరి. | 40 ఆషేరు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లు వారందరి సంఖ్యను తెలియచెప్పగా | 41 ఆషేరు గోత్రములో లెక్కింప బడినవారు నలుబది యొకవేయి ఐదువందలమందియైరి. | 42 నఫ్తాలి పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లు వారందరి సంఖ్యను తెలియచెప్పగా | 43 నఫ్తాలి గోత్రములో లెక్కింపబడినవారు ఏబది మూడువేల నాలుగవందలమందియైరి.| 44 వీరు లెక్కింపబడినవారు, అనగా మోషేయు అహరోనును తమ తమ పితరుల కుటుంబమునుబట్టి ఒక్కొక్కడుగా ఏర్పడిన ప్రధానులును లెక్కించిన వారు. | 45 అట్లు ఇశ్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరు, అనగా ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా బయలు వెళ్లిన ఇశ్రాయేలీయులందరు | 46 లెక్కింపబడి ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమందియైరి. | 47 అయితే లేవీయులు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. | 48 ఏలయనగా యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చియుండెను. -నీవు లేవీ గోత్రమును లెక్కింపకూడదు. | 49 ఇశ్రాయేలీయుల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు. | 50 నీవు సాక్ష్యపు గుడారము విూదకు దాని ఉపకరణములన్నిటి విూదను దానిలో చేరిన వాటన్నిటి విూదను లేవీయులను నియమింపుము. వారే మందిరమును దాని ఉపకరణములన్నిటిని మోయవలెను. వారు మందిరపు సేవ చేయుచు దానిచుట్టు దిగవలసినవారై యుందురు. | 51 మందిరము సాగబోవునప్పుడు లేవీయులే దాని విప్పవలెను, మందిరము దిగునప్పుడు లేవీయులే దాని వేయవలెను. అన్యుడు సవిూపించిన యెడల వాడు మరణశిక్ష నొందును. | 52 ఇశ్రాయేలీయులు తమ తమ సేనల చొప్పున ప్రతివాడును తన తన పాళెములో తన తన ధ్వజము నొద్ద దిగవలెను. | 53 ఇశ్రాయేలీయుల సమాజము విూద కోపము రాకుండునట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టు దిగవలెను; వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను. | 54 యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని తప్పకుండ ఇశ్రాయేలీయులు చేసిరి. |
||
| Previous | ||