BLM
 

 
Previous
  లేవీయకాండము 27 అధ్యాయము  

27 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను | 2 -నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము-ఒకడు విశేషమైన మ్రొక్కుబడి చేసిన యెడల నీవు నిర్ణయించిన వెల చొప్పున వారు యెహోవాకు దాని చెల్లింపవలెను. | 3 నీవు నిర్ణయింపవలసిన వెల యేదనగా, ఇరువది ఏండ్లు మొదలుకొని అరువది ఏండ్ల వయస్సు వరకు మగవానికి పరిశుద్ధస్థలము యొక్క తులమువంటి యేబది తులముల వెండి నిర్ణయింపవలెను. | 4 ఆడుదానికి ముప్పది తులములు నిర్ణయింపవలెను. | 5 అయిదేండ్లు మొదలుకొని యిరువది ఏండ్లలోపలి వయస్సుగల మగవానికి ఇరువది తులముల వెలను, ఆడుదానికి పది తులముల వెలను నిర్ణయింపవలెను. | 6 ఒక నెల మొదలుకొని అయిదేండ్ల లోపలి వయస్సుగల మగవానికి అయిదు తులముల వెండి వెలను ఆడుదానికి మూడు తులముల వెండి వెలను నిర్ణయింపవలెను. | 7 అరువది ఏండ్ల ప్రాయము దాటిన మగవానికి పదునైదు తులముల వెలను ఆడుదానికి పది తులముల వెలను నిర్ణయింపవలెను. | 8 ఒకడు నీవు నిర్ణయించిన వెలను చెల్లింపలేనంత బీదవాడైన యెడల అతడు యాజకుని యెదుట నిలువవలెను; అప్పుడు యాజకుడు అతని వెలను నిర్ణయించును. మ్రొక్కుకొనిన వాని కలిమి చొప్పున వానికి వెలను నిర్ణయింపవలెను. | 9 యెహోవాకు అర్పణముగా అర్పించు పశువులలో ప్రతిదానిని యెహోవాకు ప్రతిష్ఠితముగా ఎంచవలెను. | 10 అట్టిదానిని మార్చకూడదు; చెడ్డదానికి ప్రతిగా మంచిదానినైనను మంచిదానికి ప్రతిగా చెడ్డదానినైనను, ఒకదానికి ప్రతిగా వేరొక దానిని ఇయ్యకూడదు. పశువుకు పశువును మార్చిన యెడల అదియు దానికి మారుగా ఇచ్చినదియు ప్రతిష్ఠితమగును. | 11 జనులు యెహోవాకు అర్పింపకూడని అపవిత్ర జంతువులలో ఒకదానిని తెచ్చిన యెడల ఆ జంతువును యాజకుని యెదుట నిలువబెట్టవలెను. | 12 అది మంచిదైతేనేమి చెడ్డదైతేనేమి యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను; యాజకుడవగు నీవు నిర్ణయించిన వెల స్థిరమగును. | 13 అయితే ఒకడు అట్టిదానిని విడిపింప గోరిన యెడల నీవు నిర్ణయించిన వెలలో అయిదవవంతు వానితో కలుపవలెను. | 14 ఒకడు తన యిల్లు యెహోవాకు ప్రతిష్ఠితమగుటకై దానిని ప్రతిష్ఠించిన యెడల అది మంచిదైనను చెడ్డదైనను యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను; యాజకుడు నిర్ణయించిన వెల స్థిరమగును. | 15 తన యిల్లు ప్రతిష్ఠించిన వాడు దాని విడిపింపగోరిన యెడల అతడు నీవు నిర్ణయించిన వెలలో అయిదవవంతు దానితో కలుపవలెను; అప్పుడు ఆ యిల్లు అతనిదగును. | 16 ఒకడు తన పిత్రార్జితమైన పొలములో కొంత యెహోవాకు ప్రతిష్ఠించిన యెడల దాని చల్లబడు విత్తనముల కొల చొప్పున దాని వెలను నిర్ణయింపవలెను. పందుము యవల విత్తనములు ఏబది తులముల వెండి వెలగలది. | 17 అతడు సునాద సంవత్సరము మొదలుకొని తన పొలమును ప్రతి ష్ఠించిన యెడల నీవు నిర్ణయించు వెల స్థిరము. | 18 సునాద సంవత్సరమైన తరువాత ఒకడు తన పొలమును ప్రతిష్ఠిం చిన యెడల యాజకుడు మిగిలిన సంవత్సరముల లెక్క చొప్పున, అనగా మరుసటి సునాద సంవత్సరము వరకు వానికి వెలను నిర్ణయింపవలెను. నీవు నిర్ణయించిన వెలలో దాని వారడి తగ్గింపవలెను. | 19 పొలమును ప్రతిష్ఠించిన వాడు దాని విడిపింపగోరిన యెడల నీవు నిర్ణయించిన వెలలో అయిదవ వంతును అతడు దానితో కలుపవలెను. అప్పుడు అది అతనిదగును. | 20 అతడు ఆ పొలమును విడిపింపని యెడలను వేరొకనికి దాని అమ్మిన యెడలను మరి ఎన్నటికి దాని విడిపింప వీలుకాదు. | 21 ఆ పొలము సునాద సంవత్సరమున విడుదల కాగా అది ప్రతిష్ఠించిన పొలమువలె యెహోవాకు ప్రతిష్ఠితమగును; ఆ స్వాస్థ్యము యాజకునిదగును. | 22 ఒకడు తాను కొనిన పొలమును, అనగా తన స్వాస్థ్యములో చేరని దానిని యెహోవాకు ప్రతిష్ఠించిన యెడల | 23 యాజకుడు సునాద సంవత్సరము వరకు నిర్ణయించిన వెల చొప్పున అతనికి నియమింపవలెను. ఆ దినమందే నీవు నిర్ణయించిన వెల మేరచొప్పున యెహోవాకు ప్రతిష్ఠితముగా దాని చెల్లింపవలెను. | 24 సునాద సంవత్సరమున ఆ భూమి యెవని పిత్రార్జితమైనదో వానికి, అనగా ఆ పొలమును అమ్మిన వానికి అది తిరిగి రావలెను. | 25 నీ వెలలన్నియు పరిశుద్ధ స్థలము యొక్క వెల చొప్పున నిర్ణయింపవలెను. ఒక తులము ఇరువది చిన్నములు. | 26 అయితే జంతువులలో తొలిపిల్ల యెహోవాది గనుక యెవడును దాని ప్రతిష్ఠింపకూడదు; అది ఎద్దయిననేమి గొఱ్ఱె మేకల మందలోనిదైననేమి యెహోవాదగును. | 27 అది అపవిత్ర జంతువైన యెడల వాడు నీవు నిర్ణయించు వెలలో అయిదవ వంతు దానితో కలిపి దాని విడిపింప వచ్చును. దాని విడిపింపని యెడల నీవు నిర్ణయించిన వెలకు దాని అమ్మవలెను. | 28 అయితే మనుష్యులలోగాని జంతువులలోగాని స్వాస్థ్యమైన పొలములలోగాని తనకు కలిగిన వాటన్నిటిలో దేనినైనను ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన యెడల ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు, విడిపింపనుకూడదు, ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును. | 29 మనుష్యులు ప్రతిష్ఠించు వాటిలో దేని నైనను విడిపింపక హతము చేయవలెను. | 30 భూధాన్యములలోనేమి వృక్షఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమభాగము యెహోవా సొమ్ము; అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. | 31 ఒకడు తాను చెల్లింపవల సిన థమభాగములలో దేనినైనను విడిపింపగోరిన యెడల దానిలో అయిదవవంతును దానితో కలుపవలెను. | 32 గోవులలోనేగాని గొఱ్ఱె మేకలలోనేగాని, కోల క్రింద నడుచునన్నిటిలో థమభాగము ప్రతిష్ఠితమగును. | 33 అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, దాని మార్చకూడదు. దాని మార్చిన యెడల అదియు దానికి మారుగా నిచ్చినదియు ప్రతిష్ఠితములగును; అట్టిదాని విడిపింపకూడదని చెప్పుము. | 34 ఇవి యెహోవా సీనాయి కొండవిూద ఇశ్రాయేలీయుల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు.

Previous