|
||
| Previous | ||
| లేవీయకాండము 26 అధ్యాయము | ||
26 విూరు విగ్రహములను చేసికొనకూడదు. చెక్కిన ప్రతిమనుగాని బొమ్మనుగాని నిలువపెట్టకూడదు. విూరు సాగిలపడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని విూ దేశములో నిలుపకూడదు. నేను విూ దేవుడనైన యెహోవాను. | 2 నేను నియమించిన విశ్రాంతి దినములను విూరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను, నేను యెహోవాను. | 3 విూరు నా కట్టడలనుబట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన యెడల | 4 విూ వర్షకాలములలో విూకు వర్షమిచ్చెదను, విూ భూమి పంటల నిచ్చును, విూ పొలముల చెట్లు ఫలించును, | 5 విూ ద్రాక్ష పండ్ల కాలము వరకు విూ నూర్పు సాగుచుండును, విూరు తృప్తిగా భుజించి విూ దేశములో నిర్భయముగా నివసించెదరు. | 6 ఆ దేశములో నేను విూకు క్షేమము కలుగజేసెదను. విూరు పండుకొనునప్పుడు ఎవడును మిమ్మును భయపెట్టడు, ఆ దేశములో దుష్టమృగములు లేకుండ చేసెదను, విూ దేశములోనికి ఖడ్గమురాదు; | 7 విూరు విూ శత్రువులను తరిమెదరు; వారు విూ యెదుట ఖడ్గముచేత పడెదరు. | 8 విూలో అయిదుగురు నూరుమందిని తరుముదురు; నూరుమంది పదివేలమందిని తరుముదురు; విూ శత్రువులు విూ యెదుట ఖడ్గముచేత కూలుదురు. | 9 ఏలయనగా నేను మిమ్మును కటాక్షించి విూకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింపజేసి విూతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. | 10 విూరు చాలా కాలము నిలువైయున్న పాతగిలిన ధాన్యమును తినెదరు; క్రొత్తది వచ్చినను పాతది మిగిలి యుండును. | 11 నా మందిరమును విూ మధ్య ఉంచెదను; విూయందు నా మనస్సు అసహ్యపడదు. | 12 నేను విూ మధ్య నడిచెదను విూకు దేవుడనైయుందును; విూరు నాకు ప్రజలైయుందురు. | 13 విూరు ఐగుప్తీయులకు దాసులు కాకుండ వారి దేశములో నుండి మిమ్మును రప్పించితిని; నేను విూ దేవుడనైన యెహోవాను. నేను విూ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవచేసితిని. | 14 విూరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక | 15 నా కట్టడలను నిరాకరించిన యెడలను, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధనను విూరునట్లు విూరు నా తీర్పుల విషయమై అసహ్యించుకొనిన యెడలను, | 16 నేను విూకు చేయునదేమనగా విూ కన్నులను క్షీణింపచేయునట్టియు ప్రాణమును ఆయాసపరచునట్టియు తాపజ్వరమును క్షయ రోగమును విూ విూదికి రప్పించెదను. విూరు విత్తిన విత్తనములు విూకు వ్యర్ధములగును, విూ శత్రువులు వాటి పంటను తినెదరు; | 17 నేను విూకు పగవాడనవుదును; విూ శత్రువుల యెదుట విూరు చంపబడెదరు; విూ విరోధులు మిమ్మును ఏలెదరు; మిమ్మును ఎవరును తరుమకపోయినను విూరు పారిపోయెదరు. | 18 ఇవన్నియు సంభవించినను విూరింక నా మాటలు వినని యెడల నేను విూ పాపములనుబట్టి మరి ఏడంతలుగా మిమ్మును దండించెదను. | 19 విూ బల గర్వమును భంగపరచి, ఆకాశము ఇనుమువలెను భూమి ఇత్తడివలెను ఉండచేసెదను. | 20 విూ బలము ఉడిగిపోవును; విూ భూమి ఫలింపకుండును; విూ దేశవృక్షములు ఫలమియ్యకుండును. | 21 విూరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన యెడల నేను విూ పాపములనుబట్టి మరి ఏడంతలుగా మిమ్మును బాధించెదను. | 22 విూ మధ్యకు అడవి మృగములను రప్పించెదను; అవి మిమ్మును సంతాన రహితులనుగా చేసి విూ పశువులను హరించి మిమ్మును కొద్దిమందిగా చేయును. విూ మార్గములు పాడైపోవును. | 23 శిక్షల మూలముగా విూరు నా యెదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన యెడల | 24 నేను కూడ విూకు విరోధముగా నడిచెదను; విూ పాపములనుబట్టి ఇక ఏడంతలుగా మిమ్మును దండించెదను. | 25 విూ విూదికి ఖడ్గమును రప్పించెదను; అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయును; విూరు విూ పట్టణములలో కూడియుండగా విూ మధ్యకు తెగులును రప్పించెదను; విూరు శత్రువుల చేతికి అప్పగింపబడెదరు. | 26 నేను విూ ఆహారమును, అనగా విూ ప్రాణాధారమును తీసివేసిన తరువాత పదిమంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే విూకు ఆహారము వండి తూనికె చొప్పున విూ ఆహారమును విూకు మరల ఇచ్చెదరు, విూరు తినెదరు గాని తృప్తిపొందరు. | 27 నేను ఈలాగు చేసిన తరువాత విూరు నా మాట వినక నాకు విరోధముగా నడిచిన యెడల | 28 నేను కోపపడి విూకు విరోధముగా నడిచెదను. నేనే విూ పాపములనుబట్టి ఏడంతలుగా మిమ్మును దండించెదను. | 29 విూరు విూ కుమారుల మాంసమును తినెదరు, విూ కుమార్తెల మాంస మును తినెదరు. | 30 నేను విూయున్నత స్థలములను పాడు చేసెదను; విూ విగ్రహములను పడగొట్టెదను; విూ బొమ్మల పీనుగుల విూద విూ పీనుగులను పడవేయించెదను. | 31 నా మనస్సు విూయందు అసహ్యపడును, నేను విూ పట్టణములను పాడుచేసెదను; విూ పరిశుద్ధస్థలములను పాడు చేసెదను; విూ సువాసనగల వాటి సువాసనను ఆఘ్రా ణింపను. | 32 నేనే విూ దేశమును పాడుచేసిన తరువాత దానిలో కాపురముండు విూ శత్రువులు దాని చూచి ఆశ్చర్యపడెదరు. | 33 జనములలోనికి మిమ్మును చెదరగొట్టి విూవెంట కత్తి దూసెదను, విూ దేశము పాడైపోవును, విూ పట్టణములు పాడుపడును. | 34 విూరు విూ శత్రువుల దేశములో ఉండగా విూ దేశము పాడైయున్న దినములన్నియు అది తన విశ్రాంతి కాలములను అనుభవించును. | 35 అది పాడైయుండు దినములన్నియు అది విశ్రమించును. విూరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలములో పొందక పోయిన విశ్రాంతిని అది పాడైయుండు దినములలో అనుభవించును. | 36 విూలో మిగిలిన వారు తమ శత్రువుల దేశములలో ఉండగా వారి హృదయములలో అధైర్యము పుట్టించెదను; కొట్టుకొని పోవుచున్న ఆకు చప్పుడు వారిని తరుమును, ఖడ్గము ఎదుట నుండి పారిపోవునట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయెదరు; తరుమువాడు లేకయే పడెదరు. | 37 తరుమువాడు లేకయే వారు ఖడ్గమును చూచినట్టుగా ఒకని విూద నొకడు పడెదరు; విూ శత్రువుల యెదుట విూరు నిలువలేక పోయెదరు. | 38 విూరు జనముగానుండక నశించెదరు. విూ శత్రువుల దేశము మిమ్మును తినివేయును | 39 విూలో మిగిలిన వారు విూ శత్రు వుల దేశములలో తమ దోషములనుబట్టి క్షీణించి పోయెదరు. మరియు వారు తమ విూదికి వచ్చిన తమ తండ్రుల దోషములనుబట్టి క్షీణించిపోయెదరు. | 40 వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని, తాము నాకు విరోధముగా నడిచితిమనియు | 41 నేను తమకు విరోధముగా నడిచితిననియు, తమ శత్రువుల దేశములోనికి తమ్మును రప్పించితిననియు, ఒప్పుకొనిన యెడల, అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించితిమని ఒప్పుకొనిన యెడల, | 42 నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును; నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను నేను అబ్రాహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును; ఆ దేశమును కూడ జ్ఞాపకము చేసికొందును. | 43 వారిచేత విడువబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతి దినములను అనుభవించును. వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహ్యించు కొనిరి. ఆ హేతువుచేతనే వారు తమ దోషశిక్ష న్యాయమని ఒప్పుకొందురు. | 44 అయితే వారు తమ శత్రువుల దేశములో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను; నా నిబంధనను భంగపరిచి వారిని కేవలము నశింపజేయునట్లు వారి యందు అసహ్యపడను. ఏలయనగా నేను వారి దేవుడనైన యెహోవాను. | 45 నేను వారికి దేవుడనై యుండునట్లు వారి పూర్వికులను జనముల యెదట ఐగుప్తులో నుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వికులనుబట్టి జ్ఞాపకము చేసికొందును. నేను యెహోవాను అని చెప్పుము అనెను. | 46 యెహోవా మోషే ద్వారా సీనాయి కొండవిూద తన కును ఇశ్రాయేలీయులకును మధ్య నియమించిన కట్టడలును తీర్పులును ఆజ్ఞలును ఇవే. |
||
| Previous | ||