|
||
| Previous | ||
| సంఖ్యాకాండము 2 అధ్యాయము | ||
2 మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను. | 2 ఇశ్రాయేలీయులందరు తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమ తమ ధ్వజము నొద్ద దిగవలెను, వారు ప్రత్యక్షపు గుడారమున కెదురుగా దానిచుట్టు దిగవలెను. | 3 సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాళెపు ధ్వజముగలవారు తమ తమ సేనల చొప్పున దిగవలెను. అవ్మిూనాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు. | 4 అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు డెబ్బదినాలుగువేల ఆరువందలమంది. | 5 అతని సవిూపమున ఇశ్శాఖారు గోత్రికులు దిగవలెను. సూయారు కుమారుడైన నెతనేలు ఇశ్శాఖారు కుమారులకు ప్రధానుడు. | 6 అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు ఏబదినాలుగువేల నాలుగువందల మంది. | 7 అతని సవిూపమున జెబూలూను గోత్రికులుండవలెను. హేలోను కుమారుడైన ఏలీయాబు జెబూలూనీయులకు ప్రధానుడు. | 8 అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు ఏబది ఏడువేల నాలుగువందల మంది. | 9 యూదా పాళెములో లెక్కింపబడిన వారందరు వారి సేనల చొప్పున లక్ష యెనుబదియారువేల నాలుగువందల మంది. వారు ముందర సాగి నడువవలెను. | 10 రూబేను పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున దక్షిణ దిక్కున ఉండవలెను. షెదేయూరు కుమారుడైన ఏలీసూరు రూబేను కుమారులకు ప్రధానుడు. | 11 అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు నలుబదియారువేల ఐదువందలమంది. | 12 అతని సవిూపమున షిమ్యోను గోత్రికులు దిగవలెను. సూరీషద్దాయి కుమారుడైన షెలువిూయేలు షిమ్యోను కుమారులకు ప్రధానుడు. | 13 అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ఏబది తొమ్మిది వేల మూడు వందలమంది. | 14 అతని సవిూపమున గాదు గోత్రముండవలెను. రగూయేలు కుమారుడైన ఎలీయాసాపు గాదు కుమారులకు ప్రధానుడు. | 15 అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబదియయిదువేల ఆరువందల ఏబదిమంది. | 16 రూబేను పాళె ములో లెక్కింపబడిన వారందరు వారి సేనల చొప్పున లక్ష యేబది యొకవేయి నాలుగువందల ఏబదిమంది. వారు రెండవ తెగలో సాగి నడవవలెను. | 17 ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాళెముతో పాళెముల నడుమను సాగి నడవవలెను. వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములనుబట్టి ప్రతివాడును తన తన వరసలో సాగి నడవవలెను. | 18 ఎఫ్రాయిము సేనల చొప్పున వారి పాళెపు ధ్వజము పడమటి దిక్కున ఉండవలెను. అవిూహూదు కుమారుడైన ఎలీషామా ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు. | 19 అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు నలుబదివేల ఐదువందలమంది. | 20 అతని సవిూపమున మనష్షే గోత్రముండవలెను. పెదాసూరు కుమారుడైన గమలీయేలు మనష్షే కుమారులలో ప్రధానుడు. | 21 అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు ముప్పదిరెండువేల రెండువందలమంది. | 22 అతని సవిూపమున బెన్యావిూను గోత్రముండవలెను. గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యావిూను కుమారులకు ప్రధానుడు. | 23 అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు ముప్పది యయిదువేల నాలుగు వందలమంది. | 24 ఎఫ్రాయిము పాళెములో లెక్కింపబడిన వారందరు వారి సేనల చొప్పున లక్ష యెనిమిదివేల నూరుమంది. వారు మూడవ గుంపులో సాగి నడవవలెను. | 25 దాను పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున ఉత్తర దిక్కున ఉండవలెను. అవిూషదాయి కుమారుడైన అహీయెజెరు దాను కుమారులకు ప్రధానుడు. | 26 అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు అరువది రెండు వేల ఏడువందలమంది. | 27 అతని సవిూపమున ఆషేరు గోత్రికులు దిగవలెను. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు. | 28 అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబదియొకవేయి ఐదువందలమంది. | 29 అతని సవిూపమున నఫ్తాలి గోత్రికు లుండవలెను. ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలి కుమారులకు ప్రధానుడు. | 30 అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ఏబదిమూడువేల నాలుగువందల మంది. | 31 దాను పాళెములో లెక్కింపబడిన వారందరు లక్ష యేబదియేడువేల ఆరువందలమంది. వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవవలెను. | 32 వీరు ఇశ్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము లెక్కింపబడినవారు. తమ తమ సేనల చొప్పున తమ తమ పాళెములలో లెక్కింపబడిన వారందరు ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమంది. | 33 అయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఇశ్రాయేలీయులలో తమ్మును లెక్కించుకొనలేదు. | 34 అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును చేసిరి. అట్లు వారు తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను ప్రతివాడు తన తన ధ్వజమునుబట్టి దిగుచు సాగుచునుండిరి. |
||
| Previous | ||