BLM
 

 
Previous
  సంఖ్యాకాండము 3 అధ్యాయము  

3 యెహోవా సీనాయి కొండవిూద మోషేతో మాట లాడిన నాటికి అహరోను మోషేల వంశావళులు ఇవే. | 2 అహరోను కుమారుల పేరులు ఏవనగా, తొలుత పుట్టిన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు అనునవే. | 3 ఇవి అభిషేకమునొంది యాజకులైన అహరోను కుమారుల పేరులు; వారు యాజకులగునట్లు అతడు వారిని ప్రతిష్ఠిం చెను. | 4 నాదాబు అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని నర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. వారికి కుమారులు కలుగలేదు గనుక ఎలియాజరు ఈతామారును తమ తండ్రి యైన అహరోను ఎదుట యాజకసేవ చేసిరి. | 5 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను | 6 -నీవు లేవి గోత్రికులను తీసికొని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలువబెట్టుము. | 7 వారు ప్రత్యక్షపు గుడా రము నెదుట మందిరపు సేవ చేయవలెను. తాము కాపాడ వలసిన దానిని, సర్వసమాజము కాపాడవలసిన దానిని, వారు కాపాడవలెను. | 8 మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారము యొక్క ఉపకరణములన్నిటిని, ఇశ్రాయేలీ యులు కాపాడవలసినదంతటిని, వారే కాపాడవలెను. | 9 కాగా నీవు లేవీయులను అహరోనుకును అతని కుమారుల కును అప్పగింపవలెను. వారు ఇశ్రాయేలీయులలో నుండి అతని వశము చేయబడిన వారు. | 10 నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను. వారు తమ యాజక ధర్మము ననుసరించి నడుచుకొందురు. అన్యుడు సవిూపించిన యెడల వాడు మరణశిక్ష నొందును. | 11 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను | 12 -ఇదిగో నేను ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతి మగపిల్లకు మారుగా ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను నా వశము చేసికొనియున్నాను. ప్రతి తొలి చూలియు నాది గనుక లేవీయులు నావారైయుందురు. | 13 ఐగుప్తుదేశములో నేను ప్రతి తొలిచూలును సంహరించిన నాడు మనుష్యుల తొలిచూలులనేమి పశువుల తొలి చూలులనేమి ఇశ్రాయేలీయులలో అన్నిటిని నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని; వారు నావారైయుందురు. నేనే యెహోవాను. | 14 మరియు సీనాయి అరణ్యమందు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. | 15 -లేవీయుల పితరుల కుటుంబము లను వారి వారి వంశములను లెక్కింపుము. ఒక నెల మొదలుకొని పై ప్రాయముగల మగవారినందరిని లెక్కింప వలెను. | 16 కాబట్టి మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించి నట్లు ఆయన మాట చొప్పున వారిని లెక్కించెను. | 17 లేవి కుమారుల పేళ్లు గెర్షోను కహాతు మెరారి అనునవి. | 18 గెర్షోను కుమారుల వంశకర్తల పేళ్లు లిబ్నీ షివిూ అనునవి.| 19 కహాతు కుమారుల వంశకర్తల పేళ్లు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు అనునవి. | 20 మెరారి కుమారుల వంశకర్తల పేళ్లు మహలి మూషి. వారి వారి పితరుల కుటుంబముల చొప్పున ఇవి లేవీయుల వంశములు. | 21 లిబ్నీ యులు షివిూయులు గెర్షోను వంశస్థులు గెర్షోనీయుల వంశపువారు వీరే. | 22 వారిలో లెక్కింపబడిన వారు అనగా ఒక నెల మొదలుకొని పై ప్రాయముగల మగ వారందరిలో లెక్కింపబడిన వారు ఏడువేల ఐదువందల మంది. | 23 గెర్షోనీ యుల వంశములు మందిరము వెనుకను, అనగా పడమటి దిక్కున దిగవలెను. | 24 గెర్షోనీయుల పితరుల కుటుంబములో లాయేలు కుమారుడైన ఎలీయాసాపు ప్రధానుడు. | 25 ప్రత్య క్షపు గుడారములో గెర్షోను కుమారులు కాపాడవలసిన వేవనగా, మందిరము గుడారము దాని పైకప్పు ప్రత్యక్షపు గుడారము ద్వారపు తెరయు | 26 ప్రాకార యవనికలు మందిరమునకును బలిపీఠమునకును చుట్టునున్న ప్రాకార ద్వారపు తెరయు దాని సమస్త సేవకొరకైన త్రాళ్లును. | 27 కహాతు వంశమేదనగా, అమ్రావిూయుల వంశము ఇస్హారీయుల వంశము హెబ్రోనీయుల వంశము ఉజ్జీయేలీ యుల వంశము; ఇవి కహాతీయుల వంశములు. | 28 ఒక నెల మొదలుకొని పై ప్రాయముగల మగ వారందరి లెక్క చూడగా ఎనిమిదివేల ఆరువందలమంది పరిశుద్ధస్థలమును కాపాడవలసినవారైరి. | 29 కహాతు కుమారుల వంశములు మందిరము యొక్క ప్రక్కను, అనగా దక్షిణ దిక్కున దిగవలసినవారు. | 30 కహాతీయుల వంశముల పితరుల కుటుంబ మునకు ప్రధానుడు ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాపాను. | 31 వారు మందసము బల్ల దీపవృక్షము వేదికలు తాము సేవ చేయు పరిశుద్ధస్థలములోని ఉపకరణములు అడ్డ తెరయు కాపాడి దాని సమస్త సేవయు జరుపవలసిన వారు. | 32 యాజకుడైన అహరోను కుమారుడగు ఎలియాజరు లేవీయుల ప్రధానులకు ముఖ్యుడు. అతడు పరిశుద్ధస్థలమును కాపాడు వారివిూద విచారణకర్త. | 33 మెరారి వంశమేదనగా, మహలీయుల వంశము మూషీయుల వంశము; ఇవి మెరారి వంశములు. | 34 వారిలో లెక్కింపబడిన వారెందరనగా, ఒక నెల మొదలుకొని పై ప్రాయముగల మగవారందరు ఆరువేల రెండువందల మంది. | 35 మెరారీయుల పితరుల కుటుంబములో అబీహా యిలు కుమారుడైన సూరీయేలు ప్రధానుడు. వారు మందిరమునొద్ద ఉత్తర దిక్కున దిగవలసిన వారు. | 36 మెరారి కుమారులు మందిరము యొక్క పలకలను దాని అడ్డకఱ్ఱలను దాని స్తంభములను దాని దిమ్మలను దాని ఉపకరణము లన్నిటిని దాని సేవకొరకైనవన్నిటిని | 37 దాని చుట్టునున్న ప్రాకార స్తంభములను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్లను కాపాడవలసిన వారు. | 38 మందిరము ఎదుటి తూర్పు దిక్కున, అనగా ప్రత్యక్షపు గుడారము ఎదుటి పూర్వదిశయందు దిగవలసినవారు మోషే అహరోనులు అహరోను కుమారులు; ఇశ్రాయేలీయులు కాపాడ వలసిన పరిశుద్ధస్థలమును వారే కాపాడవలెను. అన్యుడు సవిూపించిన యెడల అతడు మరణశిక్ష నొందును. | 39 మోషే అహరోనులు యెహోవా మాటనుబట్టి, తమ తమ వంశ ముల చొప్పున లెక్కించిన లేవీయులలో లెక్కింపబడిన వారందరు, అనగా ఒక నెల మొదలుకొని పై ప్రాయము గల మగవారందరు ఇరువది రెండువేలమంది. | 40 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను -నీవు ఇశ్రాయేలీయులలో ఒక నెల మొదలుకొని పై ప్రాయముగల తొలిచూలియైన ప్రతి మగవానిని లెక్కించి వారి సంఖ్యను వ్రాయించుము. | 41 నేనే యెహోవాను; నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతి మగ పిల్లకు మారుగా లేవీయులను ఇశ్రాయేలీయుల పశువులలో తొలిచూలియైన ప్రతిదానికి మారుగా లేవీయుల పశువు లను నా నిమిత్తము తీసికొనవలెను. | 42 కాబట్టి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయులలో తొలుత పుట్టిన వారినందరిని లెక్కించెను. | 43 వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య, అనగా ఒక నెల మొదలుకొని పై ప్రాయము గల తొలిచూలి మగవారందరి సంఖ్య యిరువది రెండు వేల రెండువందల డెబ్బదిమూడు. 44 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. | 45 -నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతివానికి మారుగా లేవీయులను వారి పశువులకు ప్రతిగా లేవీయుల పశువులను తీసికొనుము. లేవీయులు నా వారైయుందురు; నేనే యెహోవాను. | 46 ఇశ్రాయేలీయులకు తొలుత పుట్టిన వారిలో లేవీయులకంటె రెండువందల డెబ్బది ముగ్గురు ఎక్కువైనందున శేషించిన వారియొద్ద తలకొక అయిదేసి తులముల వెండిని తీసికొనవలెను. | 47 పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసికొనవలెను. | 48 తులము ఇరువది చిన్నములు. వారిలో ఎక్కువమంది విమోచన కొరకు ఇయ్య బడిన ధనమును అహరోనుకును అతని కుమారులకును ఇయ్యవలెను. | 49 కాబట్టి మోషే లేవీయుల వలన విడిపింప బడిన వారికంటె ఆ యెక్కువైన వారి యొక్క విమోచన ధనమును తీసికొనెను. | 50 పరిశుద్ధమైన తులము చొప్పున వెయ్యి మూడువందల అరువదియైదు తులముల ధనమును ఇశ్రాయేలీయుల జ్యేష్ఠ కుమారుల యొద్ద తీసికొనెను. | 51 యెహోవా మోషే కాజ్ఞాపించినట్లు యెహోవా నోటి మాట చొప్పున అహరోనుకును అతని కుమారులకును విడి పింపబడిన వారి విమోచన ధనమును మోషే యిచ్చెను.

Previous