BLM
 

 
Previous
  సంఖ్యాకాండము 4 అధ్యాయము  

4 యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెల విచ్చెను | 2 -నీవు లేవీయులలో కహాతీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను | 3 ముప్పది యేండ్లు మొదలుకొని, యేబది యేండ్ల వరకు ప్రాయము కలిగి, ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేరగల వారందరి సంఖ్యను వ్రాయిం చుము. | 4 అతి పరిశుద్ధమైన దాని విషయములో ప్రత్య క్షపు గుడారమునందు కహాతీయులు చేయవలసిన సేవ యేదనగా | 5 దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులును లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి | 6 దానివిూద సముద్రవత్సల చర్మమయమైన కప్పును వేసి దానివిూద అంతయు నీలవర్ణముగల బట్టను పరచి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను. | 7 సన్నిధి బల్లవిూద నీలిబట్టను పరచి దాని విూద గిన్నెలను ధూపార్తులను పాత్రలను తర్పణ పాత్ర లను ఉంచవలెను. నిత్యముగా ఉంచవలసిన రొట్టెలును దానివిూద ఉండవలెను. అప్పుడు వారు వాటి విూద ఎఱ్ఱ బట్ట పరచి | 8 దానివిూద సముద్రవత్సల చర్మపు కప్పువేసి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను. | 9 మరియు వారు నీలి బట్టను తీసికొని దీపవృక్షమును దాని ప్రదీపములను దాని కత్తెరను దాని కత్తెర చిప్పలను దాని సేవలో వారు ఉప యోగపరచు సమస్త తైలపాత్రలను కప్పి | 10 దానిని దాని ఉపకరణములన్నిటిని సముద్రవత్సల చర్మమయమైన కప్పులో పెట్టి దండెవిూద ఉంచవలెను. | 11 మరియు బంగారుమయమైన బలిపీఠము విూద నీలిబట్టను పరచి సముద్రవత్సల చర్మముతో దానిని కప్పి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను. | 12 మరియు తాము పరిశుద్ధస్థలములో సేవ చేయు ఆ ఉపకరణములన్నిటిని వారు తీసికొని నీలిబట్టలో ఉంచి సముద్రవత్సల చర్మముతో కప్పి వాటిని దండెవిూద పెట్టవలెను. | 13 వారు బలిపీఠపు బూడిద యెత్తి దానివిూద ధూమ్రవర్ణముగల బట్టను పరచి | 14 దానివిూద తమ సేవోప కరణములన్నిటిని, అనగా ధూపార్తి ముండ్లు గరిటెలు గిన్నెలునైన బలిపీఠపు ఉపకరణములన్నిటిని దానివిూద పెట్టి, సముద్రవత్సల చర్మమయమైన కప్పును దానివిూద పరచి, దాని మోతకఱ్ఱలను తగిలింపవలెను. | 15 దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులును పరిశుద్ధస్థలమును పరిశుద్ధస్థలము యొక్క ఉపకరణములన్ని టిని కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దాని మోయ రావలెను. అయితే వారు చావకయుండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్షపు గుడా రములో కహాతీయుల భారము. | 16 యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరు పై విచారణలోనికి వచ్చునవి ఏవనగా-దీపతైలము పరిమళ ధూపద్రవ్యములు నిత్య నైవేద్యము అభిషేక తైలము. మందిరమంతటి పైవిచారణ పరిశుద్ధస్థలములోనేమి, వారి ఉపకరణములలోనేమి, దానిలోనున్న అంతటి పై విచారణయు అతని భారము.
17 మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను | 18 -విూరు కహాతీయుల గోత్ర కుటుంబము లను లేవీయులలో నుండి ప్రత్యేకింపకుడి. | 19 వారు అతి పరిశుద్ధమైన దానికి సవిూపించినప్పుడు వారు చావక బ్రదికి యుండునట్లు విూరు వారిని గూర్చి చేయవలసినదేమనగా -అహరోనును అతని కుమారులును లోపలికి వచ్చి ప్రతి వానికి వాని వాని పనియు వాని వాని బరువును నియ మింపవలెను. | 20 వారు చావకయుండునట్లు పరిశుద్ధస్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు.
21 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను | 22 -గెర్షోనీయులను వారి వారి పితరుల కుటుంబముల చొప్పు నను వారి వారి వంశముల చొప్పునను లెక్కించి సంఖ్యను వ్రాయించుము. | 23 ముప్పదియేండ్లు మొదలుకొని యేబది యేండ్ల వరకు వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు సేవలో పనిచేయ చేరువారందరిని లెక్కింప వలెను. | 24 పని చేయుటయు మోతలు మోయుటయు గెర్షో నీయుల సేవ; | 25 వారు మందిరము యొక్క తెరలను ప్రత్యక్షపు గుడారమును దాని కప్పును దాని పైనున్న సముద్రవత్సల చర్మమయమైన పైకప్పును ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారపు తెరను ప్రాకార తెరలను | 26 మందిరము చుట్టును బలిపీఠము చుట్టును ఉండు ప్రాకారపు గవిని ద్వారపు తెరలను వాటి త్రాళ్లను వాటి సేవా సంబంధమైన ఉపకరణములన్నిటిని వాటి కొరకు చేయ బడినది యావత్తును మోయుచు పనిచేయుచు రావలెను. | 27 గెర్షోనీయుల పని అంతయు, అనగా తాము మోయు వాటినన్నిటిని చేయు పనియంతటిని అహరోను యొక్కయు అతని కుమారుల యొక్కయు నోటి మాట చొప్పున జరుగ వలెను. వారు జరుపు వాటినన్నిటిని జాగ్రత్తగా చూచు కొనవలెనని వారికి ఆజ్ఞాపింపవలెను. | 28 ప్రత్యక్షపు గుడా రములో గెర్షోనీయుల యొక్క పని యిది; వారు పని చేయుచు యాజకుడగు అహరోను కుమారుడైన ఈతా మారు చేతిక్రింద నుండవలెను.
29 మెరారీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపవలెను. | 30 ముప్పదియేండ్లు మొదలుకొని యేబదియేండ్ల వరకు వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారములో పని చేయుటకు సేనగా చేరు వారందరిని లెక్కింపవలెను. | 31 ప్రత్యక్షపు గుడార ములో వారు చేయు పని అంతటి విషయములో వారు, మందిరపు పలకలను దాని అడ్డ కఱ్ఱలను దాని స్తంభము లను | 32 దాని దిమ్మలను దాని చుట్టునున్న ప్రాకార స్తంభము లను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్లను వాటి ఉపకరణములన్నిటిని వాటి సంబంధమైన పనియంతటికి కావలసిన వన్నిటిని వారు మోసి కాపాడవలసిన బరువు లను పేర్ల వరుసను లెక్కింపవలెను. | 33 మెరారీయుల వంశములు ప్రత్యక్షపు గుడారములో యాజకుడగు అహ రోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద చేయవలసిన సేవ యిది; అంతే వారు చేయవలసిన సేవ అని చెప్పెను.
34 అప్పుడు మోషే అహరోనులు సమాజ ప్రధానులను కహాతీయులను, అనగా వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను ముప్పది యేండ్లు మొదలుకొని | 35 యేబదియేండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు సేనగా చేరువారందరిని లెక్కించిరి. | 36 వారి వారి వంశముల చొప్పున వారిలో లెక్కింపబడిన వారు రెండువేల ఏడువందల ఏబదిమంది. | 37 ప్రత్యక్షపు గుడారములో సేవచేయ తగిన వారని కహాతీయుల వంశములలో లెక్కింపబడిన వారు వీరే; యెహోవా మోషేచేత పలికించిన మాట చొప్పున మోషే అహరోనులు వారిని లెక్కించిరి. 38 గెర్షోనీయులలో వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడిన వారు, అనగా ముప్పది యేండ్లు మొదలుకొని | 39 యేబది యేండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకై సేనగా చేరు వారందరు తమ తమ వంశ ముల చొప్పునను | 40 తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను వారిలో లెక్కింపబడిన వారు రెండువేల ఆరు వందల ముప్పదిమంది. | 41 ప్రత్యక్షపు గుడారములో సేవ చేయతగినవారని గెర్షోనీయులలో లెక్కింపబడిన వారు వీరే; యెహోవా నోటిమాటను బట్టి మోషే అహరోనులు వారిని లెక్కించిరి. | 42 మెరారీయుల వంశములలో తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడినవారు | 43 అనగా ముప్పదియేండ్లు మొదలుకొని యేబది యేండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్య క్షపు గుడారములో సేవ చేయుటకు సేనగా చేరువారు | 44 అనగా తమ తమ వంశముల చొప్పున వారిలో లెక్కింప బడినవారు మూడువేల రెండువందలమంది. | 45 మెరారీ యుల వంశములలో లెక్కింపబడినవారు వీరే; యెహోవా మోషేచేత పలికించిన మాటనుబట్టి మోషే అహరోనులు వారిని లెక్కించిరి. | 46 మోషే అహరోనులు ఇశ్రాయేలీ యుల ప్రధానులు లెక్కించిన లేవీయులలో | 47 ముప్పది యేండ్లు మొదలుకొని యేబది యేండ్ల వరకు ప్రాయము కలిగి తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడినవారు | 48 అనగా ప్రత్యక్షపు గుడారములో సేవయు మోతయు జరిగించు నిమిత్తమై చేరు వారందరు, అనగా వారిలో లెక్కింపబడిన వారు ఎనిమిదివేల ఐదువందల ఎనుబదిమంది. | 49 యెహోవా నోటిమాట చొప్పున మోషేచేత వారు లెక్కింపబడిరి; ప్రతివాడును తన తన సేవనుబట్టియు తన తన మోతను బట్టియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అతని వలన లెక్కింపబడిరి.

Previous