5 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. | 2 -ప్రతి కుష్ఠరోగిని, స్రావముగల ప్రతి వానిని, శవము ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతి వానిని, పాళెములో నుండి వెలివేయవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము | 3 నేను నివసించుచుండు వారి పాళెమును వారు అపవిత్ర పరచకుండునట్లు మగవానినేమి ఆడుదానినేమి అందరిని పంపివేయవలెను; వారిని ఆ పాళెము వెలుపలికి వెళ్లగొట్ట వలెను. | 4 ఇశ్రాయేలీయులు ఆలాగు చేసిరి; పాళెము వెలుపలికి అట్టివారిని వెళ్లగొట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి.
5 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. | 6 -నీవు ఇశ్రాయేలీయులతో -పురుషుడుగాని స్త్రీగాని యెహోవా విూద తిరుగబడి మనుష్యులు చేయు పాపము లలో దేనినైనను చేసి అపరాధులగునప్పుడు | 7 వారు తాము చేసిన పాపమును ఒప్పుకొనవలెను. మరియు వారు తమ అపరాధము వలని నష్టమును సరిగా నిచ్చుకొని దానిలో అయిదవవంతు దానితో కలిపి యెవనికి విరోధముగా ఆ అపరాధము చేసిరో వానికిచ్చుకొనవలెను. | 8 ఆ అపరాధ నష్టమును తీసికొనుటకు ఆ మనుష్యునికి రక్తసంబంధి లేని యెడల యెహోవాకు చెల్లింపవలసిన అపరాధ నష్టమును యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అర్పించిన ప్రాయశ్చిత్తార్ధమైన పొట్టేలును యాజకుని వగును. | 9 ఇశ్రాయేలీయులు యాజకునికి తెచ్చు ప్రతిష్ఠిత మైన వాటన్నిటిలో ప్రతిష్ఠింపబడిన ప్రతి వస్తువు యాజ కుని వగును. ఎవడైనను ప్రతిష్ఠించినవి అతనివగును. | 10 ఎవడైనను యాజకునికి ఏమైనను ఇచ్చిన యెడల అది అతని దగునని చెప్పుము.
11 యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. | 12 -నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఒకని భార్య త్రోవ తప్పి వానికి ద్రోహము చేసిన యెడల, అనగా వేరొకడు ఆమెతో వీర్యస్ఖలనముగా శయనించిన యెడల | 13 ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వాని కన్నులకు మరుగైయుండి ఆమె అపవిత్రపరచబడినదనుటకు సాక్ష్యము లేకపోయినను, ఆమె పట్టుబడకపోయినను, | 14 వాని మనస్సులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య విూద కోపపడిన యెడల, లేక వాని మనస్సులో రోషము పుట్టి అపవిత్ర పరచబడని తన భార్య విూద కోపపడిన యెడల, | 15 ఆ పురు షుడు యాజకుని యొద్దకు తన భార్యను తీసికొని వచ్చి, ఆమె విషయము తూమెడు యవలపిండిలో పదియవ వంతును తేవలెను. వాడు దాని విూద తైలము పోయకూడదు దాని విూద సాంబ్రాణి వేయకూడదు; ఏలయనగా అది రోష విషయమైన నైవేద్యము, అనగా దోషమును జ్ఞాప కము చేయుటకై జ్ఞాపకార్ధమైన నైవేద్యము. | 16 అప్పుడు యాజకుడు ఆమెను దగ్గరకు తీసికొని వచ్చి యెహోవా సన్నిధిని ఆమెను నిలువబెట్టవలెను. | 17 తరువాత యాజ కుడు మంటికుండతో పరిశుద్ధమైన నీళ్లు తీసికొనవలెను, మరియు యాజకుడు మందిరములో నేలనున్న ధూళి కొంచెము తీసికొని ఆ నీళ్లలో వేయవలెను. | 18 తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టి, ఆ స్త్రీ తన ముసుకును తీసి, రోష విషయమైన నైవేద్య మును, అనగా ఆ జ్ఞాపకార్ధమైన నైవేద్యమును ఆమె చేతులలో ఉంచవలెను. శాపము పొందించు చేదునీళ్లు యాజకుని చేతిలో ఉండవలెను. | 19 అప్పుడు యాజకుడు ఆ స్త్రీ చేత ప్రమాణము చేయించి ఆమెతో చెప్పవలసిన దేమనగా -ఏ పురుషుడను నీతో శయనింపని యెడలను, నీవు నీ భర్తకు అధీనురాలవైనప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యము చేయకపోయిన యెడలను, శాపము కలుగజేయు ఈ చేదునీళ్ల నుండి నిర్దోషివికమ్ము. | 20 నీవు నీ భర్తకు అధీనురాలవైనప్పుడు నీవు త్రోవ తప్పి అపవిత్ర పరచబడిన యెడల, అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషుడు నీతో కూటమి చేసిన యెడల | 21 యెహోవా నీ నడుము పడునట్లును నీ కడుపు ఉబ్బునట్లును చేయుట వలన యెహోవా నీ జనుల మధ్యను నిన్ను శపథమునకును ప్రమాణమునకును ఆస్పదముగా చేయుగాక. | 22 శాపము కలుగజేయు ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడునట్లును చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీచేత శపథ ప్రమాణము చేయించిన తరువాత ఆ స్త్రీ -ఆమేన్1 అని చెప్పవలెను. | 23 తరువాత యాజకుడు పత్రము విూద ఆ శపథములను వ్రాసి ఆ చేదు నీళ్లతో వాటిని తుడిచి | 24 శాపము కలుగజేయు ఆ చేదు నీళ్లను ఆ స్త్రీకి త్రాగింపవలెను. శాపము కలుగజేయు ఆ నీళ్లు ఆమెలోనికి చేదు పుట్టించును. | 25 మరియు యాజకుడు ఆ స్త్రీ చేతి నుండి దోష విషయమైన ఆ నైవేద్యమును తీసికొని యెహోవా సన్నిధిని ఆ నైవేద్య మును అల్లాడించి బలిపీఠమునొద్దకు దాని తేవలెను. | 26 తరువాత యాజకుడు దానికి జ్ఞాపకార్ధమైనదిగా ఆ నైవేద్య ములో నుండి పిడికెడు తీసి బలిపీఠము విూద దాని దహించి | 27 ఆ నీళ్లు ఆ స్త్రీకి త్రాగింపవలెను. అతడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించిన తరువాత జరుగునదేమనగా, ఆమె అపవిత్రపరపబడి తన భర్తకు ద్రోహము చేసిన యెడల, శాపము కలుగజేయు ఆ నీళ్లు చేదై ఆమెలోనికి చేరిన తరువాత ఆమె కడుపు ఉబ్బును ఆమె నడుము పడి పోవును. ఆ స్త్రీ తన జనుల మధ్య శాపమున కాస్పద ముగా నుండును. | 28 ఆ స్త్రీ అపవిత్రపరపబడక పవిత్రు రాలై యుండిన యెడల, ఆమె నిర్దోషియై గర్భవతియగు నని చెప్పుము. | 29 రోషము విషయమైన విధి యిదే. ఏ స్త్రీయైనను తన భర్త అధీనములో నున్నప్పుడు త్రోవ తప్పి అపవిత్రపడిన యెడలనేమి, | 30 లేక వానికి రోషము పుట్టి తన భార్య విూద కోపపడిన యెడలనేమి, వాడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టినప్పుడు యాజ కుడు ఆమె యెడల సమస్తము విధి చొప్పున చేయవలెను. | 31 అప్పుడు ఆ పురుషుడు నిర్దోషియగును, ఆ స్త్రీ తాను చేసిన దోషమును భరింపవలెను. |