|
||
| Previous | ||
| సంఖ్యాకాండము 6 అధ్యాయము | ||
6 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. | 2 -నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము. పురుషుడేగాని స్త్రీయేగాని యెహోవాకు నాజీరగుటకు1 ఎవరైనను మ్రొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొనిన యెడల వాడు ద్రాక్షరస మద్యములను మానవలెను. | 3 ద్రాక్షా రసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు; ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు; పచ్చివిగాని యెండినవిగాని ద్రాక్షపండ్లను తినవలదు. | 4 అతడు ప్రత్యేకముగానుండు దినములన్నియు పచ్చికాయలేగాని పైతోలేగాని ద్రాక్షావల్లిని పుట్టినదేదియు తినవలదు. | 5 అతడు నాజీ రగుటకు మ్రొక్కుకొనిన దినములన్నిటిలో మంగలకత్తి అతని తలవిూద వేయవలదు, అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెండ్రుకలను ఎదుగనియ్యవలెను. | 6 అతడు యెహోవాకు ప్రత్యేకముగానుండు దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు. | 7 తన దేవునికి విూదు కట్టబడిన తలవెండ్రుకలు అతని తలవిూద నుండును గనుక అతని తండ్రిగాని తల్లిగాని సహోదరుడుగాని సహోదరిగాని చనిపోయినను వారినిబట్టి అతడు తన్ను తాను అపవిత్రపరచుకొనవలదు. | 8 అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నియు అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును. | 9 ఒకడు అతని యొద్ద హఠాత్తుగా చనిపోవుట వలన ప్రత్యేకముగా ఉండువాని తల అపవిత్రపరపబడిన యెడల అతడు పవిత్రపరపబడు దినమున, అనగా ఏడవ దినమున తన తల గొరిగించుకొనవలెను. | 10 ఎనిమిదవ దినమున అతడు రెండు తెల్లగువ్వలనైనను రెండు పావురపు పిల్లల నైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దనున్న యాజకుని యొద్దకు తేవలెను. | 11 అప్పుడు యాజకుడు ఒకదానితో పాపపరిహారార్థబలిని రెండవదానితో దహనబలిని అర్పించి, వాడు శవము ముట్టుట వలన పాపియైనందున వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి ఆ దినమున వాని తలను పరిశుద్ధపరపవలెను. | 12 మరియు తాను ప్రత్యేకముగా ఉండు దినములను మరల యెహోవాకు తన్ను ప్రత్యేకించుకొని అపరాధపరిహారార్థబలిగా ఏడాది గొఱ్ఱెపిల్లను తీసికొని రావలెను; తన వ్రత సంబంధమైన తల వెండ్రుకలు అపవిత్రపరపబడెను గనుక మునుపటి దినములు వ్యర్ధమైనవి. | 13 నాజీరు ప్రత్యేకముగా ఉండు దినములు నిండిన తరువాత వాని గూర్చిన విధి యేదనగా, ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు వానిని తీసికొని రావలెను. | 14 అప్పుడతడు దహనబలిగాను నిర్దోషమైన యేడాది మగ గొఱ్ఱెపిల్లను, పాపపరిహారార్థబలిగాను నిర్దోషమైన యేడాది ఆడు గొఱ్ఱెపిల్లను, సమాధానబలిగాను నిర్దోష మైన యొక పొట్టేలును, | 15 గంపెడు పొంగని పిండి, అనగా గోధుమపిండి వంటలను నూనె కలిపిన గోధుమపిండితో చేసిన భక్ష్యములను నూనె పూసిన పొంగని పూరీలను వాటి నైవేద్యమును పానార్పణములను అర్పణముగా యెహోవా యొద్దకు తేవలెను. | 16 అప్పుడు యాజకుడు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చి అతని నిమిత్తము పాపపరిహారార్థబలిని దహనబలిని అర్పింపవలెను. | 17 యాజకుడు ఆ గంపెడు పొంగని భక్ష్యములతో ఆ పొట్టేలును యెహోవాకు సమాధానబలిగా అర్పింపవలెను; వాని నైవేద్యమును వాని పానార్పణమును అర్పింపవలెను. | 18 అప్పుడా నాజీరు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్ద తన వ్రతసంబంధమైన తన తల వెండ్రుకలు గొరిగించుకొని, ఆ వ్రతసంబంధమైన తన తల వెండ్రుకలు తీసికొని, సమాధానబలి ద్రవ్యము క్రిందనున్న అగ్నిలో వేయవలెను. | 19 మరియు యాజకుడు ఆ పొట్టేలు యొక్క వండిన జబ్బను ఆ గంపలో నుండి పొంగని యొక భక్ష్యమును పొంగని యొక పూరీని తీసికొని నాజీరు తన వ్రతసంబంధమైన వెండ్రుకలు గొరిగించుకొనిన పిమ్మట అతని చేతుల విూద వాటి నుంచవలెను. | 20 తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా వాటిని అల్లాడింపవలెను. అల్లాడింపబడు బోరతోను ప్రతిష్ఠిత మైన జబ్బతోను అది యాజకునికి ప్రతిష్ఠితమగును; తరువాత ఆ నాజీరు ద్రాక్షారసము త్రాగవచ్చును. | 21 మ్రొక్కుకొనిన నాజీరు తన కలిమి కొలది ఇచ్చు దాని గూర్చిన విధియు, అతడు నాజీరైయున్నందున యెహోవాకు అర్పింపవలసిన దాని గూర్చిన విధియు ఇదే. తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున నాజీరును గూర్చిన విధినిబట్టి ఇదియంతయు చేయవలెనని చెప్పుము. | 22 యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను-నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఈలాగనుము. | 23 -విూరు ఇశ్రాయేలీయులను ఈలాగు దీవింపవలెను. | 24 యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక; | 25 యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక; | 26 యెహోవా నీ విూద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల విూద నా నామమును ఉచ్ఛరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. |
||
| Previous | ||