BLM
 

 
Previous
  సంఖ్యాకాండము 7 అధ్యాయము  

7 మోషే మందిరమును నిలువబెట్టుట ముగించి దాని అభిషేకించి ప్రతిష్ఠించి, | 2 దాని ఉపకరణములన్నిటిని బలిపీఠమును దాని పాత్రలన్నిటిని చేయించి, అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబములలో ప్రధానులును గోత్రముఖ్యులును లెక్కింపబడిన వారివిూద అధిపతులునైన ఇశ్రాయేలీయులలోని ప్రధానులు అర్పణములను తెచ్చిరి. | 3 వారు ఇద్దరిద్దరికి ఒక్కొక్క బండి చొప్పునను, ప్రతివానికి ఒక్కొక్క యెద్దు చొప్పునను, ఆరు గూడు బండ్లను పన్నెండు ఎద్దులను యెహోవా సన్నిధికి తీసికొని వచ్చిరి. వారు మందిరము ఎదుటికి వాటిని తీసికొని వచ్చిరి. | 4-5 అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను-నీవు వారి యొద్ద ఈ వస్తువులను తీసికొనుము; అవి ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకై యుండును; నీవు వాటిని లేవీయులలో ప్రతివానికిని వాని వాని సేవ చొప్పున ఇయ్యవలెను. | 6 మోషే ఆ బండ్లను ఆ యెద్దులను తీసికొని లేవీయుల కిచ్చెను. | 7 అతడు రెండు బండ్లను నాలుగు ఎద్దులను వారి వారి సేవ చొప్పున గెర్షోనీయులకిచ్చెను. | 8 అతడు నాలుగు బండ్లను ఎనిమిది యెద్దులను యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద సేవ చేయు మెరారీయులకు వారి వారి సేవ చొప్పున ఇచ్చెను. | 9 కహాతీయుల కియ్యలేదు; ఏలయనగా పరిశుద్ధస్థలపు సేవ వారిది; తమ భుజముల విూద మోయుటయే వారి పని గనుక వారికి వాహనములను నియమింపలేదు. | 10 బలిపీఠము అభిషేకింపబడినవాడు ఆ ప్రధానులు దానికి ప్రతిష్ఠార్పణములను తెచ్చిరి; ప్రధానులు బలిపీఠము ఎదుటికి తమ తమ అర్పణములను తెచ్చిరి. | 11 బలిపీఠమును ప్రతిష్ఠించుటకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన తన అర్పణమును అర్పింపవలెనని యెహోవా మోషేకు సెలవిచ్చెను. | 12 మొదటి దినమున తన అర్పణమును తెచ్చిన వాడు అవ్మిూనాదాబు కుమారుడును యూదా గోత్రికుడునైన నయస్సోను. | 13 అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండిగిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని | 14 ధూపద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని | 15 దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను | 16 పాప పరిహారార్థబలిగా ఒక మేకపిల్లను | 17 సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అవ్మిూనాదాబు కుమారుడైన నయస్సోను అర్పణము. 18 రెండవ దినమున అర్పణమును తెచ్చిన వాడు సూయారు కుమారుడును ఇశ్శాఖారీయులకు ప్రధానుడునైన నెతనేలు. | 19 అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని | 20 ధూపద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని | 21 దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను | 22 పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను | 23 సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది సూయారు కుమారుడైన నెతనేలు అర్పణము. | 24 మూడవ దినమున అర్పణమును తెచ్చినవాడు హేలోను కుమారుడును జెబూలూను కుమారులకు ప్రధానుడునైన ఏలీయాబు. | 25 అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని | 26 ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని | 27 దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను | 28 పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను | 29 సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది హేలోను కుమారుడైన ఏలీయాబు అర్పణము. | 30 నాలుగవ దినమున అర్పణమును తెచ్చిన వాడు షెదేయూరు కుమారుడును రూబేనీయులకు ప్రధానుడునైన ఏలీసూరు. | 31 అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని | 32 ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని | 33 దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను | 34 పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను | 35 సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది షెదేయూరు కుమారుడైన ఏలీసూరు అర్పణము. | 36 అయిదవ దినమున అర్పణమును తెచ్చినవాడు సూరీష ద్దాయి కుమారుడును షిమ్యోనీయులకు ప్రధానుడునైన షెలువిూయేలు. | 37 అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణ మునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమపిండిని | 38 ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని | 39 దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను | 40 పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను | 41 సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది సూరీషద్దాయి కుమారుడైన షెలువిూయేలు అర్పణము. | 42 ఆరవ దినమున అర్పణమును తెచ్చినవాడు దెయూ వేలు కుమారుడును గాదీయులకు ప్రధానుడునైన ఎలీయా సాపా. | 43 అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్య ముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని | 44 ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని | 45 దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టే లును ఏడాది గొఱ్ఱెపిల్లను | 46 పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను | 47 సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపా అర్పణము. | 48 ఏడవ దినమున అర్పణమును తెచ్చినవాడు అవిూహూదు కుమారుడును ఎఫ్రాయివిూయులకు ప్రధానుడునైన ఎలీషామా. | 49 అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని | 50 ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని | 51 దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను | 52 పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను | 53 సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేక పోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అవిూహూదు కుమారుడైన ఎలీషామా అర్పణము. | 54 ఎనిమిదవ దినమున అర్పణమును తెచ్చినవాడు పెదా సూరు కుమారుడును మనష్షీయులకు ప్రధానుడునైన గమలీయేలు. | 55 అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్య ముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని | 56 ధూపద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని | 57 దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను | 58 పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను | 59 సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది పెదాసూరు కుమారుడైన గమలీయేలు అర్పణము. | 60 తొమ్మిదవ దినమున అర్పణమును తెచ్చినవాడు గిద్యోనీ కుమారుడును బెన్యావిూనులకు ప్రధానుడునైన అబీదాను. | 61 అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తుల ముల యెత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమపిండిని | 62 ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని | 63 దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను | 64 పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను | 65 సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది గిద్యోనీ కుమారుడైన అబీదాను అర్పణము. | 66 పదియవ దినమున అర్పణమును తెచ్చినవాడు అవిూషద్దాయి కుమారుడును దానీయులకు ప్రధానుడునైన అహీయెజెరు. | 67 అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని | 68 ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని | 69 దహనబలిగా ఒక చిన్నకోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను | 70 పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను | 71 సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అవిూషద్దాయి కుమారుడైన అహీయెజెరు అర్పణము. | 72 పదకొండవ దినమున అర్పణమును తెచ్చినవాడు ఒక్రాను కుమారుడును ఆషేరీయులకు ప్రధానుడునైన పగీయేలు. | 73 అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని | 74 ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని | 75 దహనబలిగా ఒక చిన్నకోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను | 76 పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను | 77 సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఒక్రాను కుమారుడైన పగీయేలు అర్పణము. | 78 పన్నెండవ దినమున అర్పణమును తెచ్చినవాడు ఏనాను కుమారుడును నఫ్తాలీయులకు ప్రధానుడునైన అహీర. | 79 అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తుల ముల యెత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్య ముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని | 80 ధూప ద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని | 81 దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టే లును ఏడాది గొఱ్ఱెపిల్లను | 82 పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను | 83 సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఏనాను కుమారుడైన అహీర అర్పణము. | 84 బలిపీఠము అభిషేకింపబడిన దినమున ఇశ్రాయేలీయుల ప్రధానులు అర్పించిన ప్రతిష్ఠార్పణములు ఇవి, వెండి గిన్నెలు పండ్రెండు, వెండి ప్రోక్షణ పాత్రలు పన్నెండు బంగారు ధూపార్తులు పండ్రెండు, ప్రతి వెండిగిన్నె నూట ముప్పది తులములది. | 85 ప్రతి ప్రోక్షణ పాత్ర డెబ్బది తులములది; ఆ ఉపకరణముల వెండి అంతయు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి రెండువేల నాలుగు వందల తులములది. | 86 ధూపద్రవ్యముతో నిండిన బంగారు ధూపార్తులు పన్నెండు; వాటిలో ఒకటి పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి పది తులములది. | 87 ఆ ధూపార్తుల బంగారమంతయు నూట ఇరువది తులములది; దహనబలి పశువులన్నియు పన్నెండు కోడెలు, పొట్టేళ్లు పండ్రెండు ఏడాదివైన గొఱ్ఱెపిల్లలు పన్నెండు, వాటి నైవేద్యములును పాపపరిహారార్థమైన మగమేకపిల్లలు పండ్రెండు, | 88 సమాధానబలి పశువులన్నియు ఇరువది నాలుగు కోడెలు, | 89 పొట్టేళ్లు అరువది, మేకపోతులు అరువది, ఏడాదివైన గొఱ్ఱెపిల్లలు అరువది. | 90 మోషే యెహోవాతో మాటలాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లినప్పుడు సాక్ష్యపు మందసము విూదనున్న కరుణాపీఠము విూద నుండి, అనగా రెండు కెరూబుల నడుమ నుండి తనతో మాటలాడిన యెహోవా స్వరము అతడు వినెను, అతడు ఆయనతో మాటలాడెను.

Previous