|
||
| Previous | ||
| సంఖ్యాకాండము 8 అధ్యాయము | ||
8 యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను -నీవు అహరోనుతో | 2 నీవు దీపములను వెలిగించునప్పుడు ఆ యేడు దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపవలెనని చెప్పుమనెను. అహరోను ఆలాగు చేసెను. | 3 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను. | 4 ఆ దీపవృక్షము బంగారు నకిషిపని గలది; అది దాని స్తంభము మొదలుకొని పుష్పముల వరకు నకిషిపని గలది; యెహోవా కనుపరచిన మాదిరినిబట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను. | 5 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. | 6 -నీవు ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుము. | 7 వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినదేమనగా, వారి విూద పాపపరిహారార్థ జలమును ప్రోక్షింపుము; అప్పుడు వారు మంగలి కత్తితో తమ శరీరమంతయు గొరిగించుకొని | 8 తమ బట్టలు ఉదుకుకొని పవిత్రపరచుకొనిన తరువాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును, అనగా తైలముతో కలిసిన గోధుమపిండిని తేవలెను. నీవు పాపపరిహారార్థబలిగా మరియొక కోడెను తీసికొని రావలెను. | 9 అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి లేవీయులను తోడుకొని వచ్చి ఇశ్రాయేలీయుల సర్వసమాజమును పోగుచేయవలెను. | 10 నీవు యెహోవా సన్నిధికి లేవీయులను తోడుకొని వచ్చిన తరువాత ఇశ్రాయేలీయులు తమ చేతులను ఆ లేవీయుల విూద ఉంచవలెను. | 11 లేవీయులు యెహోవా సేవ చేయువారవుటకు అహరోనును ఇశ్రాయేలీయులును ప్రతిష్ఠార్పణముగా వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలెను. | 12 లేవీయులు ఆ కోడెల తలల విూద తమ చేతులుంచిన తరువాత నీవు లేవీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు యెహోవాకు వాటిలో ఒక దానిని పాపపరిహారార్థబలిగాను రెండవ దానిని దహనబలిగాను అర్పించి | 13 అహరోను ఎదుటను అతని కుమారుల యెదుటను లేవీయులను నిలువబెట్టి యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పింపవలెను. | 14-15 అట్లు నీవు ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను వేరుపరచవలెను; లేవీయులు నావారై యుందురు. తరువాత నీవు వారిని పవిత్రపరచి ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకై లోపలికి వెళ్లవచ్చును. | 16 ఇశ్రాయేలీయులలో వారు నా వశము చేయబడినవారు; తొలిచూలియైన ప్రతివానికిని, అనగా ఇశ్రాయేలీయులలో ప్రథమ సంతానమంతటికిని ప్రతిగా వారిని నేను తీసికొనియున్నాను. | 17 ఏలయనగా మనుష్యులలోను పశువులలోను ఇశ్రాయేలీయులలో తొలిచూలియైనది యావత్తును నాది; ఐగుప్తు దేశములో తొలిచూలియైన ప్రతివానిని నేను సంహరించిననాడు వారిని నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని. | 18 ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతివానికి మారుగా లేవీయులను తీసికొనియున్నాను. | 19 మరియు ప్రత్యక్షపు గుడారములో ఇశ్రా యేలీయుల నిమిత్తము సేవ చేయుటకును ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, ఇశ్రాయేలీయులలో లేవీయులను అహరోనుకును అతని కుమారులకును ఇచ్చి అప్పగించియున్నాను. అందువలన ఇశ్రాయేలీయులు పరిశుద్ధమందిరమునకు సవిూపించునప్పుడు ఏ తెగులైనను ఇశ్రాయేలీయులకు సంభవింపకపోవును అని చెప్పెను. | 20 అప్పుడు మోషే అహరోనులును ఇశ్రాయేలీయుల సర్వసమాజము యెహోవా లేవీయులను గూర్చి మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమునుబట్టి లేవీయుల యెడల చేసిరి; ఇశ్రాయేలీయులు వారికి అట్లే చేసిరి. | 21 లేవీయులు తమ్మును పవిత్రపరచుకొని తమ బట్టలు ఉదుకుకొనిన తరువాత అహరోను యెహోవా సన్నిధిని ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పించెను. వారిని పవిత్రపరచుటకు అహరోను వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. | 22 తరువాత లేవీయులు అహరోను ఎదుటను అతని కుమారుల యెదుటను ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు లోపలికి వెళ్లిరి. యెహోవా లేవీయులను గూర్చి మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు వారి యెడల చేసెను. | 23 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను-ఇది లేవీయులను గూర్చిన విధి. | 24 ఇరువదియైదేండ్లు మొదలుకొని పైప్రాయముగల ప్రతివాడును ప్రత్యక్షపు గుడారము యొక్క సేవలో పని చేయుటకు రావలెను. | 25 అయితే ఏబది ఏండ్ల వయస్సు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలెను. | 26 వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారములో తమ గోత్రపు వారితో కూడ పరిచర్య చేయవలెనుగాని పని చేయవలదు. లేవీయులు కాపాడవలసిన వాటి విషయము నీవు వారికి ఆలాగు నియమింపవలెను. |
||
| Previous | ||