|
||
| Previous | ||
| సంఖ్యాకాండము 9 అధ్యాయము | ||
9 ఐగుప్తుదేశములో నుండి వారు వచ్చిన తరువాత రెండవ సంవత్సరము మొదటి నెలలో యెహోవా సీనాయి అరణ్యమందు మోషేకు ఈలాగు సెలవిచ్చెను | 2 ఇశ్రాయేలీయులు పస్కా పండుగను దాని నియామక కాలమందు ఆచరింపవలెను. | 3 దాని నియామక కాలమున, అనగా ఈ నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలెను; దాని కట్టడలన్నిటినిబట్టి దాని విధులన్నిటినిబట్టి విూరు దానిని ఆచరింపవలెను. | 4 కాబట్టి మోషే -పస్కా పండుగను ఆచరింపవలెనని ఇశ్రాయేలీయులతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు పస్కాపండుగ సామగ్రిని సిద్ధపరచుకొనిరి. | 5 యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇశ్రాయేలీయులు అతడు చెప్పినట్లే చేసిరి. | 6 కొందరు నరశవమును ముట్టుట వలన అపవిత్రులై ఆ దినమున పస్కా పండుగను ఆచరింపలేకపోయిరి. | 7 వారు ఆ దినమున మోషే అహరోనుల ఎదుటికి వచ్చి మోషేతో-నరశవమును ముట్టుట వలన అపవిత్రులమైతిమి; యెహోవా అర్పణమును దాని నియామక కాలమున ఇశ్రాయేలీయుల మధ్యను అర్పింపకుండునట్లు ఏల అడ్డగింపబడితిమని అడుగగా | 8 మోషే-నిలువుడి; విూ విషయములో యెహోవా యేమి సెలవిచ్చునో నేను తెలిసికొందునని వారితో అనెను. | 9 అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. | 10 -నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము -విూలోగాని విూ వంశములలోగాని ఒకడు శవమును ముట్టుట వలన అపవిత్రుడైనను, దూరప్రయాణము చేయుచుండినను, అతడు యెహోవా పస్కా పండుగను ఆచరింపవలెను. | 11 వారు రెండవనెల పదునాలుగవ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగని వాటితోను చేదు ఆకుకూరలతోను దానిని తినవలెను. | 12 వారు మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగలనీయవలదు; దానిలోనిది ఒక్క యెముకనైనను విరువవలదు; పస్కా పండుగ విషయమైన కట్టడలన్నిటినిబట్టి వారు దానిని ఆచరింపవలెను. | 13 ప్రయాణములో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మానిన యెడల ఆ మనుష్యుడు తన జనులలో నుండి కొట్టివేయబడును. అతడు యెహోవా అర్పణమును దాని నియామక కాలమున అర్పింపలేదు గనుక ఆ మనుష్యుడు తన పాపమును తానే భరింపవలెను. | 14 విూలో నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరునప్పుడు అతడు పస్కా కట్టడ చొప్పున దాని విధినిబట్టియే దానిని చేయవలెను. పరదేశికిని విూ దేశములో పుట్టిన వానికిని విూకును ఒకటే కట్టడ ఉండవలెను. | 15 వారు మందిరమును నిలువబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను; సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు అగ్నివంటి ఆకారము మందిరము విూద నుండెను. | 16 నిత్యమును ఆలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను; రాత్రియందు అగ్నివంటి ఆకారము కనబడెను. | 17 ఆ మేఘము గుడారము విూద నుండి పైకెత్తబడునప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమైసాగిరి; ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీయులు తమ గుడారములను వేసికొనిరి. | 18 యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలీయులు ప్రయాణమైసాగిరి, యెహోవా నోటిమాట చొప్పున వారు తమ గుడారములను వేసికొనిరి. ఆ మేఘము మందిరము విూద నిలిచియుండిన దినములన్నియు వారు నిలిచిరి. | 19 ఆ మేఘము బహుదినములు మందిరము విూద నిలిచిన యెడల ఇశ్రాయేలీయులు యెహోవా విధి ననుసరించి ప్రయాణము చేయకుండిరి. | 20 మేఘము కొన్ని దినములు మందిరము విూద నిలిచిన యెడల వారును నిలిచిరి; యెహోవా నోటిమాట చొప్పుననే నిలిచిరి, యెహోవా నోటిమాట చొప్పుననే ప్రయాణము చేసిరి. | 21 ఆలాగే మేఘము సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు నిలిచిన యెడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణము చేసిరి. పగలేమి రాత్రియేమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణము చేసిరి. | 22 ఆ మేఘము రెండు దినములుగాని, ఒక నెలగాని, యేడాదిగాని తడవు చేసి మందిరము విూద నిలిచిన యెడల ఇశ్రాయేలీయులు ప్రయాణము చేయక తమ గుడారములలో నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి. | 23 యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసికొనిరి; యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి; మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటనుబట్టి యెహోవా ఆజ్ఞననుసరించి నడిచిరి. |
||
| Previous | ||