BLM
 

 
Previous
  సంఖ్యాకాండము 10 అధ్యాయము  

10 యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. | 2 -నీవు రెండు వెండి బూరలు చేయించుకొనుము; నకిషిపనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తర్లించుటకును నీకుండవలెను. | 3 ఊదువారు వాటిని ఊదునప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునెదుట నీ యొద్దకు కూడి రావలెను. | 4 వారు ఒకటే ఊదిన యెడల ఇశ్రాయేలీయుల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావలెను. | 5 విూరు ఆర్భాటముగా ఊదునప్పుడు తూర్పు దిక్కున దిగి యున్న సైన్యములు సాగవలెను. | 6 విూరు రెండవ మారు ఆర్భాటముగా ఊదునప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యములు సాగవలెను. వారు ప్రయాణమై పోవునప్పుడు ఆర్భాటముగా ఊదవలెను. | 7 సమాజమును కూర్చునప్పుడు ఊదవలెనుగాని ఆర్భాటము చేయవలదు. | 8 అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలెను; నిత్యమైన కట్టడనుబట్టి అవి విూ వంశముల పరంపరగా విూకు ఉండును. | 9 మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా విూ దేశములో యుద్ధమునకు వెళ్లునప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను. అప్పుడు విూ దేవుడైన యెహోవా సన్నిధిని విూరు జ్ఞాపకమునకు వచ్చి విూ శత్రువుల నుండి రక్షింపబడుదురు. | 10 మరియు ఉత్సవ దినమందును నియామక కాలములయందును నెలల ఆరంభములయందును విూరు దహనబలులనుగాని సమాధానబలులనుగాని అర్పించునప్పుడు ఆ బూరలు ఊదవలెను అప్పుడు అవి విూ దేవుని సన్నిధిని విూకు జ్ఞాపకార్థముగా ఉండును విూ దేవుడైన యెహోవాను నేనే. | 11 రెండవ సంవత్సరము రెండవ నెల యిరువదియవ తేదిని మేఘము సాక్ష్యపు మందిరము విూదనుండి పైకెత్తబడెను గనుక ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యములో నుండి ప్రయాణములు చేయసాగిరి. | 12 తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను. | 13 యెహోవా మోషే చేత పలికించిన మాటనుబట్టి వారు మొదట ప్రయాణము చేసిరి. | 14 యూదీయుల పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగెను; అవ్మిూనాదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి. | 15 ఇశ్శాఖారీయుల గోత్ర సైన్యమునకు సూయారు కుమారుడైన నెతనేలు అధిపతి. | 16 జెబూలూనీయుల గోత్ర సైన్యమునకు హేలోను కుమారుడైన ఏలీయాబు అధిపతి. | 17 మందిరము విప్పబడినప్పుడు గెర్షోనీయులును మెరారీయులును మందిరమును మోయుచు సాగిరి. | 18 రూబేనీయుల పాళెము ధ్వజము వారి సేనల చొప్పున సాగెను. ఆ సైన్యమునకు షెదేయూరు కుమారుడైన ఏలీసూరు అధిపతి. | 19 షిమ్యోనీయుల గోత్ర సైన్యమునకు సూరీషద్దాయి కుమారుడైన షెలువిూయేలు అధిపతి. | 20 గాదీయుల గోత్ర సైన్యమునకు దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపు అధిపతి. | 21 కహాతీయులు పరిశుద్ధమైన వాటిని మోయుచు సాగిరి; అందరు వచ్చులోగా వారు మందిరమును నిలువబెట్టిరి. | 22 ఎఫ్రాయీవిూయుల పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున సాగెను; ఆ సైన్యమునకు అవిూహూదు కుమారుడైన ఎలీషామా అధిపతి. | 23 పెదాసూరు కుమారుడైన గమలీయేలు మనష్షీయుల గోత్ర సైన్యమునకు అధిపతి. | 24 గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యావిూనుల గోత్ర సైన్యమునకు అధిపతి. | 25 దానీయుల పాళెపు ధ్వజము సాగెను; అది పాళెములన్నిటిలో వెనుక నుండెను; అవిూషద్దాయి కుమారుడైన అహీయెజరు ఆ సైన్యమునకు అధిపతి. | 26 ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరీయుల గోత్ర సైన్యమునకు అధిపతి. | 27 ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలీయుల గోత్ర సైన్యమునకు అధిపతి. | 28 ఇశ్రాయేలీయులు ప్రయాణము చేయునప్పుడు తమ తమ సైన్యముల చొప్పుననే ప్రయాణమై సాగిరి. | 29 మోషే మామయగు మిద్యానీయుడైన రెవూయేలు కుమారుడగు హోబాబుతో మోషే-యెహోవా మా కిచ్చెదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమై పోవుచున్నాము; మాతో కూడ రమ్ము; మేము విూకు మేలు చేసెదము; యెహోవా ఇశ్రాయేలీయులకు తాను చేయబోవు మేలును గూర్చి వాగ్దానము చేసెననగా | 30 అందు కతడు-నేను రాను, నా దేశమునకును నా వంశస్థుల యొద్దకును వెళ్లుదుననెను. | 31 అందుకు మోషే-నీవు దయచేసి మమ్మును విడువకుము; ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసియున్నవి; నీవు మాకు కన్నులవలె ఉందువు. | 32 మరియు నీవు మాతో కూడ వచ్చిన యెడల యెహోవా మాకు ఏ మేలు చేయునో ఆ మేలునుబట్టి మేము నీకు మేలు చేయుదుమనెను. | 33 వారు యెహోవా కొండనుండి మూడు దినముల ప్రయాణము చేసిరి; వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ మూడు దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను. | 34 వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటివేళ వారి విూద ఉండెను. 35 ఆ మందసము సాగినప్పుడు మోషే-యెహోవా లెమ్ము; నీ శత్రువులు చెదరిపోవుదురు గాక, నిన్ను ద్వేషించువారు నీ యెదుట నుండి పారిపోవుదురు గాక యనెను. | 36 అది నిలిచినప్పుడు అతడు-యెహోవా, ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరల రమ్మనెను.

Previous