BLM
 

 
Previous
  ద్వితీయోపదేశకాండము 20 అధ్యాయము  

20 నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుఱ్ఱములను రథములను విూకంటె విస్తారమైన జనమును చూచునప్పుడు వారికి భయపడవద్దు; ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. | 2 అంతేకాదు, విూరు యుద్ధమునకు సవిూపించునప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఈలాగు చెప్పవలెను | 3 -ఇశ్రాయేలీయులారా వినుడి; నేడు విూరు విూ శత్రువులతో యుద్ధము చేయుటకు సవిూపించుచున్నారు. విూ హృదయములను జంకనియ్యకుడి, భయపడకుడి, | 4 వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, విూ కొరకు విూ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు విూ దేవుడైన యెహోవాయే. | 5 మరియు నాయకులు జనులతో చెప్పవలసినదేమనగా, క్రొత్త యిల్లు కట్టుకొనినవాడు గృహప్రవేశము కాకమునుపే యుద్ధములో చనిపోయిన యెడల వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అట్టివాడు తన యింటికి తిరిగి వెళ్లవచ్చును. | 6 ద్రాక్షతోట వేసి యింక దాని పండ్లు తినక ఒకడు యుద్ధ ములో చనిపోయిన యెడల వేరొకడు దాని పండ్లు తినును గనుక అట్టివాడును తన యింటికి తిరిగి వెళ్లవచ్చును. | 7 ఒకడు స్త్రీని ప్రధానము చేసికొని ఆమెను ఇంకను పరిగ్రహింపక మునుపే యుద్ధములో చనిపోయిన యెడల వేరొకడు ఆమెను పరిగ్రహించును గనుక అట్టివాడును తన యింటికి తిరిగి వెళ్లవచ్చును. | 8 నాయకులు జనులతో -యెవడు భయపడి మెత్తని గుండెగల వాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచకుండునట్లు తన యింటికి తిరిగి వెళ్లవచ్చునని చెప్పవలెను. | 9 నాయకులు జనులతో మాటలాడుట చాలించిన తరువాత జనులను నడిపించుటకు సేనాధిపతులను నియమింపవలెను. | 10 యుద్ధము చేయుటకు విూరొక పురము విూదికి సవిూపించునప్పుడు సమాధానము నిమిత్తము రాయబారమును పంపవలెను. సమాధానమని అది నీకు ఉత్తరమిచ్చి | 11 గుమ్మములను తెరచిన యెడల దానిలోనున్న జనులందరు నీకు పన్ను చెల్లించి నీ దాసులగుదురు. | 12 అది విూతో సమాధానపడక యుద్ధమే మంచిదని యెంచిన యెడల దాని ముట్టడివేయుడి. | 13 నీ దేవుడైన యెహోవా దాని నీ చేతి కప్పగించునప్పుడు దానిలోని మగవారినందరిని కత్తివాత హతము చేయవలెను. | 14 అయితే స్త్రీలను చిన్నవారిని పశు వులను ఆ పురములోనున్నది యావత్తును దాని కొల్ల సొమ్మంతటిని నీవు తీసికొనవచ్చును; నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ శత్రువుల కొల్లసొమ్మును నీవు అనుభవించుదువు. | 15-18 ఈ జనముల పురములు గాక నీకు బహు దూరముగా ఉండిన సమస్త పురములకు మాత్రమే యీలాగున చేయవలెను. అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న యీ జనముల పురములలో ఊపిరిగల దేనిని బ్రదుకనియ్యకూడదు. వీరు, అనగా హిత్తీ యులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులనువారు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయకృత్యముల రీతిగా విూరు చేసి, నీ దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేయుటకు వారు విూకు నేర్పకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలము చేయవలెను. 19 నీవు ఒక పురమును లోపరచుకొనుటకు దానివిూద యుద్ధము చేయుచు అనేక దినములు ముట్టడి వేయునప్పుడు, దాని చెట్లు గొడ్డలిచేత పాడుచేయకూడదు; వాటి పండ్లు తినవచ్చునుగాని వాటిని నరికివేయకూడదు; నీవు వాటిని ముట్టడించుటకు పొలములోని చెట్లు నరులా? అట్టి చెట్లను నీవు కొట్టకూడదు. | 20 ఏ చెట్లు తినదగిన ఫలములనిచ్చునవి కావని నీవెరుగుదువో వాటిని పాడుచేసి నరికి, నీతో యుద్ధము చేయు పురము పడు వరకు వాటితో దానికి ఎదురుగా ముట్టడిదిబ్బ కట్టవచ్చును.

Previous