BLM
 

 
Previous
  ద్వితీయోపదేశకాండము 19 అధ్యాయము  

19 నీ దేవుడైన యెహోవా యెవరి దేశమును నీకిచ్చుచున్నాడో ఆ జనములను నీ దేవుడైన యెహోవా నాశనము చేసిన తరువాత నీవు వారి దేశమును స్వాధీనపరచుకొని, వారి పట్టణములలోను వారి యిండ్లలోను నివసించునప్పుడు | 2 నీవు స్వాధీనపరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో మూడు పురములను వేరుపరచవలెను. | 3 ప్రతి నరహంతకుడు పారిపోవునట్లుగా నీవు త్రోవను ఏర్పరచుకొని, నీవు స్వాధీనపరచుకొనుట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశము యొక్క సరిహద్దులలోగా ఉన్న పురములను మూడు భాగములు చేయవలెను. | 4 పారిపోయి బ్రదుకగల నరహంతకుని గూర్చిన పద్ధతి యేదనగా, ఒకడు అంతకు ముందు తన పొరుగువానియందు పగపట్టక | 5 పొరబాటున వాని చంపిన యెడల, అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగు వానితో కూడ అడవికి పోయి చెట్లు నరుకుటకు తన చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు, గొడ్డలి పిడి ఊడి వాని పొరుగు వానికి తగిలి వాడు చనిపోయిన యెడల, వాడు అంతకు ముందు తన పొరుగువానియందు పగపట్టలేదు గనుక | 6 వానికి మరణదండన విధిలేదు. అయితే హత్య విషయములో ప్రతిహత్య చేయువాని మనస్సు కోపముతో మండుచుండగా, మార్గము దూరమైనందున వాడు నరహంతకుని తరిమి వాని కలిసికొని వాని చావగొట్టకయుండునట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురములలో ఒకదానియందు జొచ్చి బ్రదుకును. | 7 అందుచేతను-మూడు పురములను నీకు ఏర్పరచుకొనవలెనని నేను నీకాజ్ఞాపించుచున్నాను. | 8 మరియు నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణము చేసినట్లు ఆయన నీ సరిహద్దులను విశాలపరచి, నీ పితరులకు ఇచ్చెదనని చెప్పిన సమస్త దేశమును నీకిచ్చిన యెడల నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు | 9 నిత్యమును ఆయన మార్గములలో నడుచుటకు నేడు నేను నీకాజ్ఞాపించిన యీ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుచు, ఈ మూడు పురములు గాక మరి మూడు పురములను ఏర్పరచుకొనవలెను. | 10 ప్రాణము తీసిన దోషము నీవిూద మోపబడకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్య ముగా ఇచ్చుచున్న నీ దేశమున నిర్దోషి యొక్క ప్రాణము తీయకుండవలెను. | 11 ఒకడు తన పొరుగువానియందు పగపట్టి వాని కొరకు పొంచియుండి వానివిూదపడి వాడు చచ్చునట్లు కొట్టి | 12 ఆ పురములలో ఒకదానిలోనికి పారిపోయిన యెడల, వాని ఊరి పెద్దలు మనుష్యులను పంపి అక్కడ నుండి వానిని రప్పించి వానిని చంపుటకై హత్య విషయములో ప్రతిహత్య చేయువానిచేతికి వాని నప్పగింపవలెను. | 13 వాని కటాక్షింపకూడదు; నీకు మేలు కలుగునట్లు ఇశ్రాయేలీయుల మధ్యనుండి నిర్దోషి ప్రాణవిషయమైన దోషమును పరిహరింపవలెను. | 14 నీవు స్వాధీనపరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీకు కలుగు నీ స్వాస్థ్యములో పూర్వికులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాతిని నీవు తీసివేయకూడదు. 15 ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని యే పాపమును గూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. ఇద్దరు సాకక్షుల మాట విూదనైనను ముగ్గురు సాక్షుల మాటవిూదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును. | 16 అన్యాయపు సాక్ష్యము ఒకని విూద చెప్పుటకు ఒకడు నిలువబడి నేరము మోపుటకై అబద్ధమాడిన యెడల | 17 ఆ వివాదముగల ఇద్దరు మనుష్యులు యెహోవా సన్నిధిని, అనగా ఆ కాలములోనున్న యాజకుల యెదుటను న్యాయాధిపతుల యెదుటను నిలువవలెను. | 18 ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యము అబద్ధ సాక్ష్యమై తన సహోదరుని విూద వాడు అబద్ధసాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడియైన యెడల, వాడు తన సహోదరునికి చేయ తలంచినట్లే వానికి చేయవలెను. | 19 అట్లు విూ మధ్యనుండి ఆ చెడుతనమును పరిహరించుదురు. | 20 మిగిలినవారు విని భయపడి నీ దేశమున అట్టి దుష్కార్యము ఇకను చేయకుందురు. | 21 నీవు ఎవనిని కటాక్షింపకూడదు, ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పల్లు చేతికి చెయ్యి కాలికి కాలు విూకు విధి.

Previous