BLM
 

 
Previous
  ద్వితీయోపదేశకాండము 14 అధ్యాయము  

14 విూరు విూ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవనిబట్టి మిమ్మును విూరు కోసికొనకూడదు, విూ కనుబొమ్మల మధ్య బోడి చేసికొనకూడదు. | 2 ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. మరియు యెహోవా భూమి విూదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయజనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. | 3 నీవు హేయమైనదేదియు తినకూడదు. విూరు తినదగిన జంతువులు ఏవేవనగా | 4-5 ఎద్దు, గొఱ్ఱెపిల్ల, మేకపిల్ల, దుప్పి, ఎఱ్ఱ చిన్నజింక, దుప్పి, కారుమేక, కారుజింక, లేడి, కొండగొఱ్ఱె అనునవే. | 6 జంతువులలో రెండు డెక్కలుగలదై నెమరువేయు జంతువును తినవచ్చును. | 7 నెమరు వేయువాటిలోనిదే కాని రెండు డెక్కలుగల వాటిలోనిదే కాని నెమరువేసి ఒంటి డెక్కగల ఒంటె, కుందేలు, పొట్టి కుందేలు అనువాటిని తినకూడదు. అవి విూకు హేయములు. | 8 మరియు పంది రెండు డెక్కలు గలదైనను నెమరువేయదు గనుక అది విూకు హేయము, వాటి మాంసము తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు. | 9 నీట నివసించు వాటన్నిటిలో విూరు వేటిని తినవచ్చుననగా, రెక్కలు పొలుసులుగలవాటినన్నిటిని తినవచ్చును. | 10 రెక్కలు పొలుసులు లేని దానిని విూరు తినకూడదు అది విూకు హేయము. | 11-20 పవిత్రమైన ప్రతి పక్షిని విూరు తినవచ్చును. విూరు తినరానివి ఏవనగా-పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంచుపక్షి, పిల్లిగద్ద, గద్ద, తెల్లగద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పైడికంటె, గుడ్లగూబ, హంస, గూడు బాతు, తెల్లబందు, చెరువుకాకి, చీకుబాతు, సారసపక్షి, ప్రతివిధమైన సంకుబుడికొంగ, కొంగ, కుకుడుగువ్వ, గబ్బిలము అనునవి. ఎగురు ప్రతి పురుగు విూకు హేయము; వాటిని తినకూడదు. పవిత్రమైన ప్రతి పక్షిని తినవచ్చును. | 21 చచ్చిన దానిని విూరు తినకూడదు. నీ యింటనున్న పరదేశికి దానిని ఇయ్యవచ్చును. వాడు దానిని తినవచ్చును; లేక అన్యునికి దాని అమ్మవచ్చును; ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు. | 22 ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. | 23 నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకొనునట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలోగాని నీ ద్రాక్షారసములోగాని నీ నూనెలోగాని పదియవ వంతును, నీ పశువులలోగాని గొఱ్ఱె మేకలలోగాని తొలిచూలు వాటిని తినవలెను. | 24 మార్గము దీర్ఘముగానున్నందున, అనగా యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలము మిక్కిలి దూరముగా నున్నందున, నీవు వాటిని మోయ లేనియెడల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించునప్పుడు, వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేత పట్టుకొని, | 25 నీ దేవుడైన యెహోవా యేర్పరచుకొను స్థలమునకు వెళ్లి నీవు కోరు దేనికైనను | 26 ఎద్దులకేమి గొఱ్ఱెలకేమి ద్రాక్షారసమునకేమి మద్యమునకేమి నీవు కోరు దానికి ఆ వెండినిచ్చి, అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనముచేసి, నీవును నీ యింటి వారును నీ యింటనుండు లేవీయులును సంతోషింపవలెను. | 27 లేవీయులను విడువకూడదు; నీ మధ్యను వారికి పాలైనను స్వాస్థ్యమైనను లేదు. | 28 నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోను నిన్ను ఆశీర్వదించునట్లు మూడేసి సంవత్సరములకొకసారి, ఆ యేట నీకు కలిగిన పంటలో పదియవ వంతంతయు బయటికి తెచ్చి నీ యింట ఉంచవలెను. | 29 అప్పుడు నీ మధ్యనుపాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులును, నీ యింటనున్న పరదేశులును, తండ్రిలేనివారును, విధవరాండ్రును వచ్చి భోజనము చేసి తృప్తిపొందుదురు.

Previous