|
||
| Previous | ||
| ద్వితీయోపదేశకాండము 12 అధ్యాయము | ||
12 విూరు స్వాధీనపరచుకొనుటకు నీ పితరుల దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశమున విూరు భూమి విూద బ్రదుకు దినములన్నిటను విూరు అనుసరించి గైకొనవలసిన కట్టడలును విధులును ఇవి. | 2 విూరు స్వాధీనపరచుకొనబోవు జనములు గొప్ప పర్వతముల విూదనేమి మెట్టల విూదనేమి పచ్చని చెట్లన్నిటి క్రిందనేమి, యెక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించెనో ఆ స్థలములన్నిటిని విూరు బొత్తిగా పాడుచేయవలెను. | 3 వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతాస్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి వాటి పేరులు అచ్చట లేకుండ నశింపజేయవలెను. | 4 వారు తమ దేవతలకు చేసినట్టు విూరు విూ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు. | 5 విూ దేవుడైన యెహోవా విూ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. | 6 అక్కడికే విూరు విూ దహనబలులను, విూ బలులను, విూ దశమభాగములను, ప్రతిష్ఠితములుగా విూరు చేయు నైవేద్యములను, విూ మ్రొక్కుబడి అర్పణములను, విూ స్వేచ్ఛార్పణములను, పశువులలోను గొఱ్ఱెమేకలలోను తొలిచూలు వాటిని తీసికొని రావలెను. | 7 విూరును విూ దేవుడైన యెహోవా మిమ్ము నాశీర్వదించి విూకు కలుగజేసిన విూ కుటుంబములును విూ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి విూ చేతి పనులన్నిటియందు సంతోషింపవలెను. | 8 నేడు మనమిక్కడ చేయుచున్నట్లు విూలో ప్రతి మనుష్యుడు తన కంటికి యుక్తమైన దంతయు చేయకూడదు. | 9 నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న విశ్రాంతిని స్వాస్థ్యమును విూరు ఇది వరకు పొందలేదు. | 10 విూరు యొర్దాను దాటి విూ దేవుడైన యెహోవా విూకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తరువాత ఆయన విూ చుట్టునుండు శత్రువులందరు లేకుండ విూకు విశ్రాంతి కలుగజేసినందున విూరు నెమ్మది పొందునప్పుడు | 11 నేను విూకాజ్ఞాపించు సమస్తమును, అనగా విూ దహనబలులను విూ బలులను విూ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా విూరు చేయు నైవేద్యములను విూరు యెహోవాకు మ్రొక్కుకొను విూ శ్రేష్ఠమైన మ్రొక్కుబళ్లను విూ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమునకే విూరు తీసికొని రావలెను. | 12 విూరు, విూ కుమారులు, విూ కుమార్తెలు, విూ దాసులు, విూ పనికత్తెలు, విూలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక విూ యిండ్లలో ఉండు లేవీయులు విూ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. | 13 నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహనబలులను అర్పింపకూడదు సువిూ. | 14 యెహోవా నీ గోత్రములలో ఒకదానియందు ఏర్పరచుకొను స్థలముననే నీ దహనబలులను అర్పించి నేను విూకాజ్ఞాపించుచున్న సమస్తమును అక్కడనే జరిగింపవలెను. | 15 అయితే నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది యిండ్లన్నిటిలో నీ మనస్సు కోరు దానిని చంపి తినవచ్చును. పవిత్రులేమి అపవిత్రులేమి యెఱ్ఱజింకను చిన్న దుప్పిని తినినట్లు తినవచ్చును. | 16 విూరు రక్తము మాత్రము తినక దానిని నీళ్లవలె నేల విూద పారబోయవలెను. | 17 నీ ధాన్యములోనేమి నీ ద్రాక్షారసములోనేమి నీ నూనెలోనేమి దశమభాగమును, నీ గోవులలోనిదేమి నీ గొఱ్ఱె మేకల మందలోనిదేమి తొలిచూలు పిల్లలను నీవు మ్రొక్కుకొను మ్రొక్కుబళ్లలో దేనిని నీ స్వేచ్ఛా ర్పణమును ప్రతిష్ఠార్పణమును నీ యింట తినక | 18 నీ దేవు డైన యెహోవా ఏర్పరచుకొను స్థలముననే నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ యింట నుండు లేవీయులు, కలిసికొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని, నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుదువు. | 19 నీవు నీ దేశములోనున్న నీ దినములన్నిటను లేవీయులను విడువకూడదు సువిూ. | 20 నీ దేవుడైన యెహోవా తాను నీకిచ్చిన మాట చొప్పున నీ సరిహద్దులను విశాలపరచిన తరువాత నిశ్చయముగా మాంసము తినగోరి మాంసము తినెదననుకొందువు. అప్పుడు నీకిష్టమైన మాంసము తినవచ్చును. | 21 నీ దేవుడైన యెహోవా తన నామమును ప్రకటించుటకు ఏర్పరచుకొను స్థలము విూకు దూరముగా ఉండిన యెడల | 22 యెహోవా నీకిచ్చిన గోవులలోనిదేగాని విూ గొఱ్ఱె మేకలలోనిదేగాని నేను నీకాజ్ఞాపించినట్లు చంపి నీవు ఆశించిన దాని నీ యింట తినవచ్చును. జింకను దుప్పిని తినునట్లు దాని తినవచ్చును. పవిత్రాపవిత్రులు భేదము లేకుండ తినవచ్చును. | 23 అయితే రక్తమును తిననే తినకూడదు. భద్రము సువిూ. ఏలయనగా రక్తము ప్రాణము; మాంసముతో ప్రాణాధారమైన దాని తినకూడదు; | 24 నీవు దాని తినక భూమివిూద నీళ్లవలె పారబోయవలెను. | 25 నీవు యెహోవా దృష్టికి యుక్తమైన దానిని చేసినందున నీకు నీ తరువాత నీ సంతతి వారికి మేలు కలుగునట్లు దాని తినకూడదు. | 26 నీకు నియమింపబడిన ప్రతిష్ఠితములను మ్రొక్కుబళ్లను మాత్రము యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు నీవు తీసికొని పోవలెను. | 27 నీ దహనబలులను వాటి రక్తమాంసములను నీ దేవుడైన యెహోవా బలిపీఠము విూద అర్పింపవలెను. నీ బలుల రక్తమును నీ దేవుడైన యెహోవా బలిపీఠము విూద పోయవలెను; వాటి మాంసము నీవు తినవలెను. | 28 నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యధార్థమునగు దానిని నీవు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతి వారికిని నిత్యము మేలు కలుగునట్లు నేను నీకాజ్ఞాపించుచున్న యీ మాటలన్నిటిని నీవు జాగ్రత్తగా వినవలెను. 29 నీవు వారి దేశమును స్వాధీనపరచుకొనుటకు వెళ్లుచున్న జనములను నీ దేవుడైన యెహోవా నీ యెదుట నుండి నాశనము చేసిన తరువాత, నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరచుకొని, వారి దేశములో నివసించినప్పుడు, వారు నీ యెదుట నుండి నశింపజేయబడిన తరువాత నీవు వారి వెంట వెళ్లి చిక్కుబడి, | 30 వారి దేవతలను ఆశ్రయింపగోరి-ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనును చేసెదనని అనుకొనకుండ జాగ్రత్తగా ఉండవలెను. | 31 తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు, ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చి వేయుదురు గదా. | 32 నేను విూ కాజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమియు కలుపకూడదు దానిలో నుండి ఏమియు తీసివేయకూడదు. |
||
| Previous | ||