|
||
| Previous | ||
| ద్వితీయోపదేశకాండము 10 అధ్యాయము | ||
10 ఆ కాలమందు యెహోవా-మునుపటి వాటి వంటి రెండు రాతిపలకలను నీవు చెక్కుకొని కొండ యెక్కి నా యొద్దకు రమ్ము. మరియు నీవు ఒక కఱ్ఱ మందసమును చేసికొనవలెను. | 2 నీవు పగులగొట్టిన మొదటి పలకల విూదనున్న మాటలను నేను ఈ పలకల విూద వ్రాసిన తరువాత నీవు ఆ మందసములో వాటిని ఉంచవలెనని నాతో చెప్పెను. | 3 కాబట్టి నేను తుమ్మకఱ్ఱతో ఒక మందసమును చేయించి మునుపటి వాటివంటి రెండు రాతి పలకలను చెక్కి ఆ రెండు పలకలను చేత పట్టుకొని కొండ యెక్కితిని. | 4 ఆ సమాజ దినమున ఆ కొండవిూద అగ్ని మధ్యనుండి తాను విూతో పలికిన పది ఆజ్ఞలను మునుపు వ్రాసినట్టు యెహోవా ఆ పలకల విూద వ్రాసెను. యెహోవా వాటిని నాకిచ్చిన తరువాత నేను తిరిగి కొండ దిగివచ్చి | 5 నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచితిని. యెహోవా నాకాజ్ఞాపించినట్లు వాటిని దానిలో నుంచితిని. | 6 ఇశ్రాయేలీయులు యహకానీయులదైన బెయేరోతు నుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అక్కడ అహరోను చనిపోయి పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఎలియాజరు అతనికి ప్రతిగా యాజకు డాయెను. | 7 అక్కడ నుండి వారు గుద్గోదకును గుద్గోద నుండి నీటివాగులుగల దేశమైన యొత్బాతాకును ప్రయాణము చేసిరి. | 8 నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు, యెహోవా సన్నిధిని నిలుచుటకును, ఆయనను సేవించి ఆయన నామమునుబట్టి దీవించుటకును, లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను. | 9 కాబట్టి తమ సహోదరులతోపాటు లేవీయులు స్వాస్థ్యమునైనను పొందలేదు. నీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాయే వారికి స్వాస్థ్యము. | 10 నేను మునుపటివలె నలువది పగళ్లును నలువది రాత్రులును కొండవిూద ఉండగా యెహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింపజేయుట మానివేసెను. | 11 మరియు యెహోవా నాతో ఇట్లనెను-ఈ ప్రజలు నేను వారికిచ్చెదనని వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమున ప్రవేశించి స్వాధీన పరచుకొనునట్లు నీవు లేచి వారి ముందర సాగుమని చెప్పెను. | 12 కాబట్టి ఇశ్రాయేలూ, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు, ఆయనను ప్రేమించి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణాత్మతోను సేవించి, | 13 నీ మేలు కొరకు నేడు నేను నీకాజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? | 14 చూడుము; ఆకాశము, మహాకాశము, భూమియు, అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. | 15 అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారియందు ఆనంద పడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటివలె ఏర్పరచుకొనెను. | 16 కాబట్టి విూరు సున్నతిలేని విూ హృదయమునకు సున్నతి చేసికొని యికవిూదట ముష్కరులు కాకుండుడి. | 17 ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై యున్నాడు. ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడును భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొనని వాడు. | 18 ఆయన తలిదండ్రులు లేని వానికిని విధవరాలికిని న్యాయము తీర్చి, పరదేశియందు దయయుంచి అన్నవస్త్రముల ననుగ్రహించువాడు. | 19 విూరు ఐగుప్తుదేశములో పరదేశులై యుంటిరి గనుక పరదేశిని జాలి తలచుడి. | 20 నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. | 21 ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. | 22 నీ పితరులు డెబ్బది మందియై ఐగుప్తునకు వెళ్లిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రములవలె నిన్ను విస్తరింపజేసి యున్నాడు. |
||
| Previous | ||