|
||
| Previous | ||
| ద్వితీయోపదేశకాండము 8 అధ్యాయము | ||
8 విూరు బ్రదికి అభివృద్ధినొంది యెహోవా విూ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరచుకొనునట్లు నేడు నేను నీకాజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. | 2 మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ నలువది సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసికొనుము. | 3 ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రదుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి, నీవేగాని నీ పితరులేగాని యెన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. | 4 ఈ నలువది సంవత్సరములు నీవు వేసికొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. | 5 ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలిసికొని | 6 ఆయన మార్గములలో నడుచుకొనునట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. | 7 నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులును, లోయలలో నుండియు కొండలలో నుండియు పారు ఊటలును అగాధ జలములును గల దేశము. | 8 అది గోధుమలు యవలు ద్రాక్షచెట్లు అంజూరపు చెట్లు దానిమ్మపండ్లును గల దేశము, ఒలీవనూనెయు తేనెయుగల దేశము. | 9 కరవు అనుకొనకుండ నీవు ఆహారము తిను దేశము అందులో నీకు ఏ లోపముండదు. అది యినుపరాళ్లుగల దేశము; దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. | 10 నీవు తిని తృప్తిపొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమునుబట్టి ఆయనను స్తుతింపవలెను. | 11 నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపార తిని | 12 మంచి యిండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా, | 13 నీ పశువులు నీ గొఱ్ఱె మేకలును వృద్ధియై నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు | 14 నీ మనస్సు మదించి, దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. | 15 తాపకరమైన పాములును తేళ్లును కలిగి యెడారియై నీళ్లులేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను, రాతి బండనుండి నీకు నీళ్లు తెప్పించెను. | 16 తుదకు నీకు మేలు చేయవలెనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను. | 17 అయితే విూరు - మా సార్ద్యధము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసెనని అనుకొందురేమో. | 18 కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసికొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలె స్థాపింపవలెనని విూరు భాగ్యము సంపాదించుకొనుటకై విూకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. | 19 నీవు ఏ మాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి యితర దేవతలననుసరించి పూజించి నమస్కరించిన యెడల విూరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మును గూర్చి నేను సాక్ష్యము పలికియున్నాను. | 20 నీ యెదుట నుండకుండ యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు విూ దేవుడైన యెహోవా మాట విూరు వినక పోయిన యెడల విూరును వారివలెనే నశించెదరు. |
||
| Previous | ||