BLM
 

 
Previous
  సంఖ్యాకాండము 15 అధ్యాయము  

15 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. | 2 -నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము-నేను విూకిచ్చుచున్న దేశనివాసములలో విూరు ప్రవేశించిన తరువాత | 3 యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవులలోని దానినేకాని, గొఱ్ఱెమేకలలోని దానినేకాని, దహనబలిగానైనను, బలిగానైనను తెచ్చి, మ్రొక్కుబడి చెల్లించుటకనియో, స్వేచ్ఛార్పణగాననియో, నియామక కాలమందు అర్పించునదియనియో, దేనినైనను విూరు అర్పింపగోరిన యెడల | 4 యెహోవాకు ఆ అర్పణము నర్పించువాడు ముప్పావు నూనెతో కలుపబడిన రెండు పళ్ల పిండిని నైవేద్యముగా తేవలెను. | 5 ఒక్కొక్క గొఱ్ఱెపిల్లతో కూడ దహనబలివిూదనేమి బలివిూదనేమి పోయుటకై ముప్పావు ద్రాక్షారసమును పానార్పణముగా సిద్ధపరచవలెను. | 6 పొట్టేలుతో కూడ పడి నూనెతో కలుపబడిన నాలుగుపళ్ల పిండిని నైవేద్యముగా సిద్ధపరచవలెను. | 7 పడి ద్రాక్షారసమును పానార్పణముగా తేవలెను; అది యెహోవాకు ఇంపైన సువాసన. | 8 మ్రొక్కుబడిని చెల్లించుటకైనను యెహోవాకు సమాధానబలి నర్పించుటకైనను నీవు దహబలిగానైనను బలిగానైనను కోడెదూడను సిద్ధపరచిన యెడల | 9 ఆ కోడెతో కూడ పడిన్నర నూనె కలుపబడిన ఆరుపళ్ళ గోధుమపిండిని నైవేద్యముగా అర్పింపవలెను. | 10 మరియు యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా | 11 పడిన్నర ద్రాక్షా రసమును పానీయార్పణముగా తేవలెను; ఒక్కొక్క కోడెతో కూడను ఒక్కొక్క పొట్టేలుతో కూడను, గొఱ్ఱెలలోనిదైనను మేకలలోనిదైనను ఒక్కొక్క పిల్లతో కూడను, ఆలాగు చేయవలెను. | 12 విూరు సిద్ధపరచు వాటి లెక్కనుబట్టి వాటి లెక్కలో ప్రతిదానికిని అట్లు చేయవలెను. | 13 దేశములో పుట్టిన వారందరు యెహోవాకు ఇంపైన సువాసనగల హోమార్పణమును తెచ్చునప్పుడు ఆలాగుననే చేయవలెను. | 14 విూ యొద్ద నివసించు పరదేశిగాని విూ తరతరములలో విూ మధ్యనున్న వాడెవడుగాని యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము అర్పింప గోరినప్పుడు విూరు చేయునట్లే అతడును చేయవలెను. | 15 సంఘమునకు, అనగా విూకును విూలో నివసించు పరదేశికిని ఒక్కడే కట్టడ; అది విూ తరతరములకుండు నిత్యమైన కట్టడ; యెహోవా సన్నిధిని విూరున్నట్లే పరదేశియు ఉండును. | 16 విూకును విూ యొద్ద నివసించు పరదేశికిని ఒక్కటే యేర్పాటు, ఒక్కటే న్యాయవిధి యుండవలెను. | 17 యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. | 18 -నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము -నేను మిమ్మును కొని పోవుచున్న దేశములో విూరు ప్రవేశించిన తరువాత | 19 విూరు ఆ దేశపు ఆహారమును తినునప్పుడు ప్రతిష్ఠార్పణమును యెహోవాకు అర్పింపవలెను. | 20 విూరు విూ మొదటి పిండిముద్ద రొట్టెను ప్రతిష్ఠార్పణముగా అర్పింపవలెను; కళ్లపు అర్పణమువలె దాని అర్పింపవలెను. | 21 విూ తరతరములకు విూ మొదటి పిండిముద్దలో నుండి ప్రతిష్ఠార్పణ మును యెహోవాకు అర్పింపవలెను. | 22 యెహోవా మోషేతో చెప్పిన యీ ఆజ్ఞలన్నిటిలో, అనగా | 23 యెహోవా ఆజ్ఞాపించిన దినము మొదలుకొని అటుపైని విూ తరతరములకు యెహోవా మోషే ద్వారా విూకు ఆజ్ఞాపించిన వాటిలో పొరబాటున దేనినైనను విూరు చేయకపోయినప్పుడు, అది సమాజమునకు తెలియబడని యెడల | 24 సర్వసమాజము యెహోవాకు ఇంపైన సువాసనగా నుండుటకై దహనబలిగా ఒక కోడెదూడను, విధి చొప్పున దాని నైవేద్యమును దాని పానీయార్పణ మును పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సిద్ధపరచవలెను. | 25 యాజకుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను; తెలియకయే దాని చేసెను గనుక క్షమింపబడును. వారు పొరబాటున చేసిన పాపములనుబట్టి తమ అర్పణమును, అనగా యెహో వాకు చెందవలసిన హోమమును పాపపరిహారార్థబలిని యెహోవా సన్నిధికి తీసికొని రావలెను. | 26 అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజమేమి, వారి మధ్యను నివసించు పరదేశియేమి క్షమాపణ నొందును; ఏలయనగా ప్రజలందరు తెలియకయే దాని చేయుట తటస్థించెను. | 27 ఒకడు పొరబాటున పాపము చేసిన యెడల వాడు పాపపరిహారార్థబలిగా ఏడాది ఆడుమేకపిల్లను తీసికొని రావలెను. | 28 పొరబాటున యెహోవా సన్నిధిని దాని చేసెను గనుక తెలియకయే పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయును; వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుట వలన వాడు క్షమాపణ నొందును. | 29 ఇశ్రాయేలీయులలో పుట్టినవాడేగాని వారి మధ్యను నివసించు పరదేశియేగాని పొరబాటున ఎవడైనను పాపము చేసిన యెడల వానికిని విూకును విధి ఒక్కటే ఉండవలెను. | 30 అయితే దేశమందు పుట్టినవాడేగాని పరదేశియేగాని యెవడైనను సాహసించి పాపము చేసిన యెడల | 31 వాడు యెహోవాను తృణీకరించిన వాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో నుండకుండ కొట్టివేయబడును; వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను విూరినందున నిశ్చయముగా కొట్టివేయబడును; వాని దోషశిక్షకు వాడే కారకుడు. | 32 ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. | 33 వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోనునొద్ద కును సర్వసమాజమునొద్దకును వానిని తీసికొని వచ్చిరి. | 34 వానికి ఏమి చేయవలెనో అది విశదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. | 35 తరువాత యెహోవా-ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను. | 36 సర్వసమాజము పాళెము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలెనని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వసమాజము పాళెము వెలుపలికి వాని తీసికొనిపోయి రాళ్లతో వాని చావగొట్టెను. | 37 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. | 38 -నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము. వారు తమ తరతరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసికొని అంచుల కుచ్చుల విూద నీలిసూత్రము తగిలింపవలెను. | 39-41 విూరు నా ఆజ్ఞలన్నిటిని జ్ఞాపకము చేసికొని విూ దేవునికి ప్రతిష్ఠితులై యుండునట్లు మునుపటివలె కోరిన వాటినిబట్టియు చూచిన వాటినిబట్టియు వ్యభిచరింపక, దాని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటిని జ్ఞాపకము చేసికొని వాటి ననుసరించుటకే అది విూకు కుచ్చుగానుండును. నేను విూకు దేవుడనై యుండునట్లుగా ఐగుప్తుదేశములో నుండి మిమ్మును రప్పించిన విూ దేవుడనైన యెహోవాను; విూ దేవుడనైన యెహోవాను నేనే.

Previous