BLM
 

 
Previous
  సంఖ్యాకాండము 16 అధ్యాయము  

16 లేవికి మునిమనుమడును కహాతుకు మనుమడును ఇస్హారు కుమారుడునగు కోరహు, రూబేనీయులలో ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములును, పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని | 2 ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులును సమాజ ప్రధానులునైన రెండువందల యేబదిమందితో మోషేకు ఎదురుగా లేచి | 3 మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి-విూతో మాకిక పనిలేదు; ఈ సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే యెహోవా వారి మధ్యనున్నాడు; యెహోవా సంఘము విూద మిమ్మును విూరేల హెచ్చించుకొనుచున్నారనగా, | 4 మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరహుతోను వాని సమాజముతోను ఇట్లనెను | 5 -తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనిన వానిన తన యొద్దకు చేర్చుకొనును. | 6 ఈలాగు చేయుడి; కోరహును అతని సమస్త సమూహమునైన విూరును ధూపార్తులను తీసికొని వాటిలో అగ్నియుంచి రేపు యెహోవా సన్నిధిని వాటివిూద ధూపద్రవ్యము వేయుడి. | 7 అప్పుడు యెహోవా యే మనుష్యుని యేర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, విూతో నాకిక పనిలేదు. | 8 మరియు మోషే కోరహుతో ఇట్లనెను-లేవి కుమారులారా వినుడి. | 9 తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, విూరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజములో నుండి మిమ్మును వేరుపరచుటయు విూకు అల్పముగా కనబడునా? | 10 ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారినందరిని చేర్చుకొనెను గదా. అయితే విూరు యాజకత్వము కూడ కోరుచున్నారు. | 11 ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగైయున్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా విూరు సణుగనేల అనెను. | 12 అప్పుడు మోషే ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపించెను. | 13 అయితే వారు-మేము రాము; ఈ అరణ్యములో మమ్మును చంప వలెనని పాలు తేనెలు ప్రవహించు దేశములో నుండి మమ్మును తీసికొని వచ్చుట చాలనట్టు, మా విూద ప్రభుత్వము చేయుటకును నీకధికారము కావలెనా? | 14 అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి మమ్మును తీసికొని రాలేదు; పొలములు ద్రాక్షతోటలుగల స్వాస్థ్యము మాకియ్యలేదు; ఈ మనుష్యుల కన్నులను ఊడదీయుదువా? మేము రాము అనిరి. | 15 అందుకు మోషే మిక్కిలి కోపించి-నీవు వారి నైవేద్యమును లక్ష్యపెట్టకుము. ఒక్క గాడిదనైనను వారియొద్ద నేను తీసికొన లేదు; వారిలో ఎవనికిని నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేసెను. | 16 మరియు మోషే కోరహుతో- నీవును నీ సర్వసమూహమును, అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలువవలెను. | 17 విూలో ప్రతివాడును తన తన ధూపార్తిని తీసికొని వాటి విూద ధూపద్రవ్యము వేసి, ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని రెండువందల ఏబది ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలెను, నీవును అహరోనును ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవలెనని చెప్పెను. | 18 కాబట్టి వారిలో ప్రతివాడును తన ధూపార్తిని తీసికొని వాటిలో అగ్నియుంచి వాటివిూద ధూపద్రవ్యమును వేసినప్పుడు, వారును మోషే అహరోనులును ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచిరి. | 19 కోరహు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు సర్వసమాజమును వారికి విరోధముగా పోగుచేయగా యెహోవా మహిమ సర్వసమాజ మునకు కనబడెను. | 20 అప్పుడు యెహోవా-విూరు ఈ సమాజములో నుండి అవతలికి వెళ్లుడి. | 21 క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా | 22 వారు సాగిలపడి-సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, యీ యొక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజము విూద నీవు కోపపడుదువా? అని వేడుకొనిరి. | 23-24 అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను-కోరహు దాతాను అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జనసమాజముతో చెప్పుము. | 25 అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్లగా ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్లిరి. | 26 అతడు-ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి; విూరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక యుండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను. | 27 కాబట్టి వారు కోరహు దాతాను అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా, దాతాను అబీరాములును వారి భార్యలును వారి కుమారులును వారి పసిపిల్లలును తమ గుడారముల ద్వారమున నిలిచిరి. | 28 మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు, నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీని వలన విూరు తెలిసికొందురు. | 29 మనుష్యులందరికి వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన యెడలను, సమస్త మనుష్యులకు కలుగునదే వీరికి కలిగిన యెడలను, యెహోవా నన్ను పంపలేదు. | 30 అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మ్రింగి వేసిన యెడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని విూకు తెలియుననెను. | 31 అతడు ఆ మాటలన్నియు చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచెను. | 32 భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధు లందరిని వారి సమస్త సంపాద్యమును మ్రింగివేసెను. | 33 వారును వారి సంబంధులందరును ప్రాణముతో పాతాళములో కూలిరి; భూమి వారిని మ్రింగివేసెను; వారు సమాజములో ఉండకుండ నశించిరి. | 34 వారి చుట్టునున్న ఇశ్రాయేలీయులందరు వారి ఘోష విని-భూమి మనలను మ్రింగివేయునేమో అనుకొనుచు పారిపోయిరి. | 35 మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణ మును తెచ్చిన ఆ రెండువందల ఏబదిమందిని కాల్చి వేసెను. | 36 అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను-నీవు యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లనుము-ఆ అగ్ని మధ్య నుండి ఆ ధూపార్తులను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి. | 37 ఆ అగ్నిని దూరముగా చల్లుము. | 38 పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరి ధూపార్తులను తీసికొని బలిపీఠమునకు కప్పుగా వెడల్పయిన రేకులను చేయవలెను. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి; అవి ఇశ్రాయేలీయులకు ఆనవాలుగా ఉండును. | 39-40 అహరోను సంతాన సంబంధికాని అన్యుడెవడును యెహోవా సన్నిధిని ధూపము అర్పింప సవిూపించి, కోరహువలెను అతని సమాజమువలెను కాకుండునట్లు ఇశ్రాయేలీయులకు జ్ఞాపక సూచనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడినవారు అర్పించిన యిత్తడి ధూపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పయిన రేకులు చేయించెను. | 41 మరునాడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు-విూరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి | 42 సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారము వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను; యెహోవా మహిమయు కనబడెను. | 43 మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా | 44 యెహోవా-విూరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోవుడి; | 45 క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవియ్యగా వారు సాగిలపడిరి. | 46 అప్పుడు మోషే-నీవు ధూపార్తిని తీసికొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపమువేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్లి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము; కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను; తెగులు మొదలు పెట్టెనని అహరోనుతో చెప్పగా | 47 మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసికొని సమాజము మధ్యకు పరుగెత్తి పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి యుండెను; కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయ శ్చిత్తము చేసెను. | 48 అతడు చచ్చిన వారికిని బ్రతికియున్న వారికిని మధ్యను నిలువబడగా తెగులు ఆగెను. | 49 కోరహు తిరుగుబాటున చనిపోయిన వారు గాక పదునాలుగువేల ఏడువందలమంది ఆ తెగులుచేత చచ్చిరి. | 50 ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరనున్న మోషే యొద్దకు తిరిగి వచ్చెను.

Previous