BLM
 

 
Previous
  సంఖ్యాకాండము 14 అధ్యాయము  

14 అప్పుడు ఆ సర్వసమాజము ఎలుగెత్తి కేకలు వేసెను; ప్రజలు ఆ రాత్రి యెలుగెత్తి యేడ్చిరి. | 2 మరియు ఇశ్రాయేలీయులందరు మోషే అహరోనులపైని సణుగుకొనిరి. | 3 ఆ సర్వసమాజము-అయ్యో ఐగుప్తులో మేమేల చావలేదు? ఈ అరణ్యముమందు మేమేల చావలేదు? మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఏల తీసికొని వచ్చెను? మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు; తిరిగి ఐగుప్తుకు వెళ్లుట మాకు మేలు కాదా? అని వారితో అనిరి. | 4 వారు-మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్లుదుమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా | 5 మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వసమాజముసంఘము ఎదుట సాగిలపడిరి. | 6 అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలోనుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని | 7 ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో-మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. | 8 యెహోవా మనయందు ఆనందించిన యెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మన కిచ్చును; అది పాలు తేనెలు ప్రవహించు దేశము. | 9 మెట్టుకు విూరు యెహోవా విూద తిరుగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి విూద నుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడైయున్నాడు, వారికి భయపడకుడనిరి. ఆ సర్వసమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా | 10 ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రా యేలీయులకందరికి కనబడెను. | 11 యెహోవా-ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నిటిని చూచి నన్ను నమ్మక యుందురు? | 12 నేను వారికి స్వాస్థ్యమియ్యక తెగులుచేత వారిని హతముచేసి, యీ జనముకంటె మహా బలముగల గొప్ప జనమును నీ వలన పుట్టించెదనని మోషేతో చెప్పగా | 13 మోషే యెహోవాతో ఇట్లనెను-ఆలాగైతే ఐగుప్తీయులు దానిగూర్చి విందురు; నీవు నీ బలముచేత ఈ జనమును ఐగుప్తీయులలో నుండి రప్పించితివి గదా; వీరు ఈ దేశనివాసులతో ఈ సంగతి చెప్పియుందురు. | 14 యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్యనున్నావనియు, యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడినవాడవనియు, నీ మేఘము వారివిూద నిలుచుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు వినియున్నారు గదా. | 15 కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన యెడల నీ కీర్తినిగూర్చి వినిన జనములు | 16 -ప్రమాణ పూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తిలేక యెహోవా వారిని అరణ్యములో సంహరించెనని చెప్పుకొందురు. | 17 యెహోవా దీర్ఘశాంతుడును, కృపాతిశయుడును | 18 దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారులవిూదకి తెచ్చువాడునై యున్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభువు యొక్క బలము ఘనపరచబడును గాక | 19 ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని యిదివరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించియున్నట్లు నీ కృపాతిశయమునుబట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా | 20 యెహోవా-నీ మాట చొప్పున నేను క్షమించియున్నాను. | 21 అయితే నా జీవముతోడు, భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొనియుండును. | 22 నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన యీ మనుష్యులందరు ఈ పదిమారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. | 23 కాగా వారి పితరులకు ప్రమాణ పూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు; నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరును దానిని చూడరు. | 24 నా సేవకుడైన కాలేబు మంచిమనస్సు కలిగి పూర్ణమనస్సుతో నన్ను అనుసరించిన హేతువుచేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను. | 25 అతని సంతతి దాని స్వాధీనపరచుకొనును. అమాలేకీయులును కనానీయులును ఆ లోయలో నివసించుచున్నారు. రేపు విూరు తిరిగి ఎఱ్ఱసముద్రపు మార్గముగా అరణ్యమునకు ప్రయాణమై పొండనెను. | 26 మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను. | 27 -నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంత వరకు సహింపవలెను? ఇశ్రా యేలీయులు నాకు విరోధముగా సణుగుచున్న సణుగులను వినియున్నాను. | 28 నీవు వారితో-యెహోవా వాక్కు ఏదనగా-నా జీవముతోడు; విూరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా విూ యెడల చేసెదను. | 29 విూ శవములు ఈ అరణ్యములోనే రాలును; విూ లెక్క మొత్తము చొప్పున విూలో లెక్కింపబడిన వారందరు, అనగా ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము గలిగి నాకు విరోధముగా సణగిన వారందరు రాలిపోవుదురు. | 30 యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు విూలో ఎవరును ప్రవేశింపరు; ఇది నిశ్చయము. | 31 అయితే-వారు కొల్లపోవుదురని విూరు చెప్పిన విూ పిల్లలను నేను ఆ దేశములోపలికి రప్పించెదను; విూరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనెదరు; | 32 అయితే విూ శవములు ఈ అరణ్యములో రాలును. | 33 విూ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు విూ పిల్లలు ఈ అరణ్యములో నలుబది ఏండ్లు తిరుగులాడుచు విూ వ్యభిచార శిక్షను భరించెదరు. | 34 విూరు ఆ దేశమును సంచరించి చూచిన నలుబది దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరము చొప్పున నలుబది సంవత్సరములు విూ దోషశిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలిసికొందురు. | 35 ఇది యెహోవా అను నేను చెప్పిన మాట; నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వసమాజమునకు నిశ్చయముగా దీని చేసెదను. ఈ అరణ్యములో వారు క్షీణించిపోవుదురు; ఇక్కడనే చనిపోవుదురు అనెను. | 36 ఆ దేశమును సంచరించి చూచుటకై మోషేచేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వసమాజము అతని విూద సణుగునట్లు చేసిన మనుష్యులు, | 37 అనగా ఆ దేశమునుగూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులుచేత చని పోయిరి. | 38 అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుష్యులలో నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బ్రదికిరి. | 39 మోషే ఇశ్రాయేలీయులందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాల దుఃఖించిరి. | 40 వారు ఉదయమున లేచి ఆ కొండ కొనవిూదకెక్కి-చిత్తమండి, మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్లుదుము అనిరి. | 41 అప్పుడు మోషే-ఇది ఏల? విూరు యెహోవా మాట విూరుచున్నారేమి? | 42 అది కొనసాగదు. యెహోవా విూ మధ్యను లేడు గనుక విూ శత్రువుల యెదుట హతము చేయబడుదురు; విూరు సాగిపోకుడి. | 43 ఏలయనగా అమాలేకీయులు కనానీయులు విూకంటె ముందుగా అక్కడికి చేరియున్నారు; విూరు ఖడ్గముచేత కూలుదురు; విూరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా విూకు తోడైయుండడని చెప్పెను. | 44 అయితే వారు మూర్ఖించి ఆ కొండకొనకెక్కి పోయిరి; అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషేయైనను పాళెములో నుండి బయలు వెళ్లలేదు. | 45 అప్పుడు ఆ కొండవిూద నివాసముగానున్న అమాలేకీయులును కనానీయులును దిగి వచ్చి వారిని కొట్టి హోర్మా వరకు తరిమి హతము చేసిరి.

Previous