BLM
 

 
Previous
  సంఖ్యాకాండము 13 అధ్యాయము  

13 యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను | 2 - నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దానినుండి ఒక్కొక్క మనుష్యుని విూరు పంపవలెను; వారిలో ప్రతివాడు ప్రధానుడై యుండవలెను. | 3 మోషే యెహోవా మాట విని, పారాను అరణ్యము నుండి వారిని పంపెను. వారందరు ఇశ్రాయేలీయులలో ముఖ్యులు. | 4 వారి పేళ్లు ఏవనగా-రూబేను గోత్రమునకు జక్కూరు కుమారుడైన షమ్మూయ; | 5 షిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు; | 6 యూదా గోత్రమునకు యెఫున్నె కుమారు డైన కాలేబు; | 7 ఇశ్శాఖారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఇగాలు; | 8 ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ; | 9 బెన్యావిూను గోత్రమునకు రాఫు కుమారుడైన పల్తీ; | 10 జెబూలూను గోత్రమునకు సోరీ కుమారుడైన గదీయేలు; | 11 యోసేపు గోత్రమునకు, అనగా మనష్షే గోత్రమునకు సూసీ కుమారుడైన గదీ; | 12 దాను గోత్రమునకు గెమలి కుమారుడైన అవ్మిూయేలు; | 13 ఆషేరు గోత్రమునకు మిఖాయేలు కుమారుడైన సెతూరు; | 14 నఫ్తాలి గోత్రమునకు వాపెసీ కుమారుడైన నహబీ; | 15 గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన గెయువేలు అను నవి. | 16 దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుష్యుల పేళ్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను. | 17 మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను-విూరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ యెక్కి ఆ దేశము ఎట్టిదో | 18 దానిలో నివసించు జనము బలముగలదో బలములేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో | 19 వారు నివసించు భూమి యెట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించుదురో, కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, | 20 దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు విూరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసికొని రండని చెప్పెను. అది ద్రాక్షల ప్రధమ పక్వకాలము. | 21 కాబట్టి వారు వెళ్లి సీను అరణ్యము మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహోబు వరకు దేశ సంచారము చేసి చూచిరి. | 22 వారు దక్షిణ దిక్కున ప్రయాణము చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులు అహీమాను షేషయి తల్మయి అను వారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయను కంటె ఏడేండ్లు ముందుగా కట్టబడెను. | 23 వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్షచెట్టు యొక్క కొమ్మనుకోసి దండెతో ఇద్దరు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. | 24 ఇశ్రాయేలీయులు అక్కడ కోసిన ద్రాక్ష గెలనుబట్టి ఆ స్థలమునకు ఎష్కోలు1 లోయ అను పేరు పెట్టబడెను. | 25 వారు నలుబది దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. | 26 అట్లు వారు వెళ్లి పారాను అరణ్యమందలి కాదేషులోనున్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలీయుల సర్వసమాజమునొద్దకునువచ్చి, వారికిని ఆ సర్వసమాజమునకును సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. | 27 వారు అతనికి తెలియపరచినదేమనగా-నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్లితిమి; అది పాలు తేనెలు ప్రవహించు దేశమే; దాని పండ్లు ఇవి. | 28 అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు; వారి పట్టణములు ప్రాకారముగలవి అవి మిక్కిలి గొప్పవి; మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. | 29 అమాలేకీయులు దక్షిణదేశములో నివసించుచున్నారు; హిత్తీయులు యెబూసీయులు అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు; కనానీయులు సముద్రమునొద్దను యొర్దాను నదీ ప్రాంతములలోను నివసించుచున్నారని చెప్పిరి. | 30 కాలేబు మోషే యెదుట జనులను నిమ్మళ పరచి-మనము నిశ్చయముగా వెళ్లుదుము; దాని స్వాధీనపరచుకొందుము; దాని జయించుటకు మన శక్తి చాలుననెను. | 31 అయితే అతనితో కూడ పోయిన ఆ మనుష్యులు-ఆ జనులు మనకంటె బలవంతులు; మనము వారి విూదికి పోజాలమనిరి. | 32 మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి-మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము; దానిలో మాకు కనబడిన జనులందరు ఉన్నత దేహులు. | 33 అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీ యులను చూచితిమి; మా దృష్టికి మేము మిడతలవలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమనిరి.

Previous