|
||
| Previous | ||
| సంఖ్యాకాండము 12 అధ్యాయము | ||
12 మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసికొని యుండెను గనుక అతడు పెండ్లిచేసికొనిన ఆ స్త్రీనిబట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. | 2 వారు-మోషేచేత మాత్రమే యెహోవా పలికించెనా? ఆయన మా చేతను పలికింపలేదా? అని చెప్పుకొనగా | 3 యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి విూదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. | 4 యెహోవా -విూరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞనిచ్చెను. ఆ ముగ్గురు రాగా | 5 యెహోవా మేఘ స్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను. | 6 వారిద్దరు రాగా ఆయన -నా మాటలు వినుడి; విూలో ప్రవక్తయుండిన యెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసికొనునట్లు కలలో అతనితో మాటలాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. | 7 అతడు నా యిల్లంతటిలో నమ్మకమైనవాడు. | 8 నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును; అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు విూరేల భయపడలేదనెను. | 9 యెహోవా కోపము వారి విూద రగులుకొనగా ఆయన వెళ్లిపోయెను. | 10 మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము విూదనుండి ఎత్తబడెను; అప్పుడు మిర్యాము హిమమువంటి తెల్లని కుష్ఠు గలదాయెను; అహరోను మిర్యామువైపు చూచినప్పుడు ఆమె కుష్ఠుగలదిగా కనబడెను. | 11 అహరోను-అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము; పాపులమైన మేము చేసిన యీ పాపమును మా విూద మోపవద్దు. | 12 తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శవమువలె ఆమెను ఉండనియ్యకుమని మోషేతో చెప్పగా | 13 మోషే యెలుగెత్తి-దేవా, దయచేసి యీమెను బాగుచేయమని యెహోవాకు మొఱపెట్టెను. | 14 అప్పుడు యెహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖము విూద ఉమ్మివేసిన యెడల ఆమె యేడు దినములు సిగ్గుపడునుగదా; ఆమె పాళెము వెలుపట ఏడు దినములు ప్రత్యేకముగా ఉండవలెను. తరువాత ఆమెను చేర్చు కొనవలెను. | 15 కాబట్టి మిర్యాము ఏడు దినములు పాళెము వెలుపలనే గడిపెను. మిర్యాము మరల చేర్చబడు వరకు జనులు ముందుకు సాగరైరి. | 16 తరువాత జనులు హజేరోతు నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి. |
||
| Previous | ||