BLM
 

 
Previous
  లేవీయకాండము 24 అధ్యాయము  

24 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను | 2 -దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. | 3 ప్రత్యక్షపు గుడారములో శాసనముల అడ్డ తెరకు వెలుపల అహరోను సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాని చక్కపరచవలెను. ఇది విూ తరతరములకు నిత్యమైన కట్టడ. | 4 అతడు నిర్మలమైన దీపవృక్షము విూద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను. | 5 నీవు గోధుమలపిండిని తీసికొని దానితో పన్నెండు భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమున సేరు సేరు పిండి యుండవలెను. | 6 యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్లవిూద ఆరేసి భక్ష్యములుగల రెండు దొంత లుగా వాటిని ఉంచవలెను. | 7 ఒక్కొక్క దొంతివిూద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. అది యెహోవా యెదుట విూ ఆహారమునకు జ్ఞాపకార్ధమైన హోమముగా ఉండును. | 8 యాజకుడు ప్రతి విశ్రాంతిదినమున నిత్య నిబంధననుబట్టి ఇశ్రాయేలీయుల యొద్ద దాని తీసికొని నిత్యము యెహోవా సన్నిధిని చక్కపరచవలెను. | 9 అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలెను. వారు పరిశుద్ధస్థలములో దాని తినవలెను. నిత్యమైన కట్టడ చొప్పున యెహోవాకు చేయు హోమములలో అది అతి పరిశుద్ధము. | 10 ఇశ్రాయేలీయురాలగు ఒక స్త్రీకిని ఐగుప్తీయుడగు ఒక పురుషునికిని పుట్టిన వాడొకడు ఇశ్రాయేలీయుల మధ్యకు వచ్చెను. | 11 ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికిని ఒక ఇశ్రాయేలీయునికిని పాళెములో పోరుపడగా ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే యొద్దకు వాని తీసికొనివచ్చిరి. వాని తల్లి పేరు షెలోవిూతు; ఆమె దాను గోత్రికుడైన దిబ్రీ కుమార్తె. | 12 యెహోవా యేమి సెలవిచ్చునో తెలిసికొను వరకు వానిని కావలిలో ఉంచిరి. | 13 అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను | 14 -శపించిన వానిని పాళెము వెలుపలికి తీసికొని రమ్ము; వాని శాపవచనమును వినిన వారందరు వాని తలవిూద తమ చేతులుంచిన తరువాత సర్వసమాజము రాళ్లతో వాని చావగొట్టవలెను. | 15 మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము -తన దేవుని శపించువాడు తన పాపశిక్షను భరింపవలెను | 16 యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను; సర్వసమాజము రాళ్లతో అట్టి వానిని చావగొట్టవలెను. పరదేశియేగాని స్వదేశియేగాని యెహోవా నామమును దూషించిన యెడల వానికి మరణశిక్ష విధింపవలెను. | 17 ఎవడైనను ఒకనిని ప్రాణహత్య చేసిన యెడల వానికి మరణశిక్ష విధింపవలెను. | 18 జంతు ప్రాణహత్య చేసినవాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాని నష్టము పెట్టుకొనవలెను. | 19 ఒకడు తన పొరుగు వానికి కళంకము కలుగజేసిన యెడల వాడు చేసినట్లు వానికి చేయవలెను. | 20 విరుగగొట్టబడిన దాని విషయములో విరుగగొట్టబడుటయే శిక్ష కంటికి కన్ను పంటికి పల్లు, చెల్లవలెను. వాడు ఒకనికి కళంకము కలుగజేసినందున వానికి కళంకము కలుగజేయవలెను. | 21 జంతువును చావగొట్టినవాడు దాని నష్టము నిచ్చుకొనవలెను. నరహత్య చేసిన వానికి మరణశిక్ష విధింపవలెను. | 22 విూరు పక్షపాతము లేక తీర్పు తీర్చవలెను. విూలోనున్న పరదేశికి విూరు చేసినట్టు విూ స్వదేశికిని చేయవలెను. నేను విూ దేవుడనైన యెహోవానని వారితో చెప్పుము అనెను. | 23 కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పెను-శపించిన వానిని పాళెము వెలుపలికి తీసికొనిపోయి రాళ్లతో వాని చావగొట్టవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలీయులు చేసిరి.

Previous