|
||
| Previous | ||
| లేవీయకాండము 23 అధ్యాయము | ||
23 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను | 2 -నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము-విూరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే; ఈ కాలములయందు విూరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను; నా నియామక కాలములు ఇవి. | 3 ఆరు దినములు పని చేయవలెను; వారము వారము ఏడవ దినము విశ్రాంతి దినము; అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో విూరు ఏ పనియైనను చేయకూడదు. విూ సమస్త నివాసములయందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. | 4 ఇవి యెహోవా నియామక కాలములు, నియమించిన కాలములనుబట్టి విూరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. | 5 మొదటి నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. | 6 ఆ నెల పదునయిదవ దినమున యెహోవా పొంగని రొట్టెల పండుగ జరుగును; ఏడు దినములు విూరు పొంగని వాటినే తినవలెను. | 7 మొదటి దినమున విూరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో విూరు జీవనోపాధియైన ఏ పనియు చేయకూడదు. | 8 ఏడు దినములు విూరు యెహోవాకు హోమార్పణము చేయవలెను. ఏడవ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో విూరు జీవనోపాధియైన ఏ పనియు చేయకూడదని వారితో చెప్పుము. | 9 మరియు యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చెను | 10 -నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము-నేను విూకిచ్చుచున్న దేశమునకు విూరు వచ్చి దాని పంటను కోయునప్పుడు విూ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. | 11 యెహోవా మిమ్మునంగికరించునట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతిదినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. | 12 విూరు ఆ పనను అర్పించు దినమున నిర్దోషమైన యేడాది పొట్టేలును యెహోవాకు దహనబలిగా అర్పింపవలెను. | 13 దాని నైవేద్యము నూనెతో కలిసిన రెండు పదియవ వంతుల గోధుమపిండి. అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము. దాని పానార్పణము ముప్పావు ద్రాక్షారసము. | 14 విూరు విూ దేవునికి అర్పణము తెచ్చు వరకు ఆ దినమెల్ల విూరు రొట్టె యేమి పేలాలేమి పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది విూ తరతరములకు విూ నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ. | 15 విూరు విశ్రాంతిదినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను విూరు తెచ్చిన దినము మొదలుకొని ఏడు వారములు లెక్కింపవలెను; లెక్కకు తక్కువ కాకుండ ఏడు వారములు ఉండవలెను. | 16 ఏడవ విశ్రాంతి దినపు మరుదినము వరకు విూరు ఏబది దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. | 17 విూరు విూ నివాసములలో నుండి తూములో రెండేసి పదియవ వంతుల పిండిగల రెండు రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలెను. వాటిని గోధుమపిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రధమ ఫలముల అర్పణము. | 18 మరియు విూరు ఆ రొట్టెలతో నిర్దోషమైన ఏడు ఏడాది మగ గొఱ్ఱెపిల్లలను ఒక కోడెదూడను రెండు పెద్ద పొట్టేళ్లను అర్పింపవలెను. అవి వారి నైవేద్యములతోను వారి పానార్పణములతోను దహనబలియైన యెహోవాకు ఇంపైన సువాసనగల హోమమగును. | 19 అప్పుడు విూరు మేకలలో ఒక పోతును పాపపరిహారార్థబలిగా అర్పించి రెండు ఏడాది గొఱ్ఱెపిల్లలను సమాధానబలిగా అర్పింపవలెను. | 20 యాజకుడు ప్రధమ ఫలముల రొట్టెలతో వాటిని ఆ రెండు పొట్టేళ్లను యెహోవా సన్నిధిని అల్లాడింపవలెను. అవి యెహోవాకు ప్రతిష్ఠింపబడినదై యాజకునివగును. | 21 ఆనాడే విూరు పరిశుద్ధ సంఘముగా కూడవలెనని చాటింపవలెను. అందులో విూరు జీవనోపాధియైన ఏ పనియు చేయకూడదు. ఇది విూ సమస్త నివాసములలో విూ తరతరములకు నిత్యమైన కట్టడ. | 22 విూరు విూ పంటచేను కోయునప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను; నేను విూ దేవుడనైన యెహోవాను. | 23 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. | 24 -నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము-ఏడవ నెలలో మొదటి దినము విూకు విశ్రాంతిదినము. అందులో జ్ఞాపకార్ధ శృంగధ్వని వినినప్పుడు విూరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. | 25 అందులో విూరు జీవనోపాధియైన ఏ పనియు చేయుట మాని యెహోవాకు హోమము చేయవలెను. | 26 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. | 27 -ఈ ఏడవ నెల పదియవ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థదినము; అందులో విూరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును విూరు దుఃఖపరచుకొని యెహోవాకు హోమము చేయవలెను. | 28 ఆ దినమున విూరు ఏ పనియు చేయకూడదు; విూ దేవుడైన యెహోవా సన్నిధిని విూరు విూ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసికొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. | 29 ఆ దినమున తన్ను తాను దుఃఖపరచుకొనని ప్రతివాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. | 30 ఆ దినమున ఏ పనినైనను చేయు ప్రతివానిని వాని ప్రజలలో నుండకుండ నాశనము చేసెదను. | 31 అందులో విూరు ఏ పనియు చేయకూడదు. అది విూ సమస్త నివాసములలో విూ తరతరములకు నిత్యమైన కట్టడ. | 32 అది విూకు మహా విశ్రాంతిదినము, మిమ్మును విూరు దుఃఖపరచుకొనవలెను. ఆ నెల తొమ్మిదవనాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలము వరకు విూరు విశ్రాంతిదినముగా ఆచరింపవలెను. | 33 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. | 34 -నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము-ఈ ఏడవ నెల పదునయిదవ దినము మొదలుకొని ఏడు దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలెను. | 35 వాటిలో మొదటి దినమున విూరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో విూరు జీవనోపాధియైన యే పనియు చేయ కూడదు. | 36 ఏడు దినములు విూరు యెహోవాకు హోమము చేయవలెను. ఎనిమిదవ దినమున విూరు పరిశుద్ధ సంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది విూకు వ్రతదినముగా ఉండును. అందులో విూరు జీవనోపాధియైన యే పనియు చేయకూడదు. | 37 యెహోవా నియమించిన విశ్రాంతిదినములు గాకయు, విూరు దానములనిచ్చు దినములుగాకయు, విూ మ్రొక్కుబడి దినములుగాకయు, విూరు యెహోవాకు స్వేచ్ఛార్పణములనిచ్చు దినములుగాకయు, యెహోవాకు హోమద్రవ్యమునేమి దహనబలి ద్రవ్యమునేమి నైవేద్యమునేమి బలినేమి పానీయార్పణములనేమి అర్పించుటకై పరిశుద్ధ సంఘపు దినములుగా విూరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవి. | 38 ఏ అర్పణదినమున ఆ అర్పణమును తీసికొని రావలెను. | 39 అయితే ఏడవ నెల పదునయిదవ దినమున విూరు భూమి పంటను కూర్చుకొనగా ఏడు దినములు యెహో వాకు పండుగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతి దినము, ఎనిమిదవ దినము విశ్రాంతిదినము. | 40 మొదటి దినమున విూరు దబ్బపండ్లను ఈతమట్టలను గొంజిచెట్ల కొమ్మలను కాలువల యొద్దనుండు నిరవంజి చెట్లను పట్టుకొని ఏడు దినములు విూ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. | 41 అట్లు విూరు ఏటేట ఏడు దినములు యెహోవాకు పండుగగా ఆచరింపవలెను. ఇది విూ తరతరములలో నిత్యమైన కట్టడ. ఏడవ నెలలో దానిని ఆచరింపవలెను. | 42 నేను ఐగుప్తుదేశములో నుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింప చేసితినని విూ జనులు ఎరుగునట్లు ఏడు దినములు విూరు పర్ణశాలలలో నివసింపవలెను. ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరు పర్ణశాలలలో నివసింపవలెను. | 43 నేను విూ దేవుడనైన యెహోవాను. | 44 అట్లు మోషే ఇశ్రాయేలీయులకు యెహోవా నియామక కాలములను తెలియ చెప్పెను. |
||
| Previous | ||