|
||
| Previous | ||
| లేవీయకాండము 22 అధ్యాయము | ||
22 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. | 2 -ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించు వాటి వలన అహరోనును అతని కుమారులును నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుండునట్లు వారు ఆ పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలెనని వారితో చెప్పుము; నేను యెహోవాను. | 3 నీవు వారితో ఇట్లనుము-విూ తరతరములకు విూ సమస్త సంతానములలో ఒకడు అపవిత్రతగలవాడై, ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు వాటిని సవిూపించిన యెడల అట్టివాడు నా సన్నిధిని ఉండకుండ కొట్టివేయబడును; నేను యెహోవాను. | 4 అహరోను సంతానములో ఒకనికి కుష్ఠయినను స్రావమైనను కలిగిన యెడల అట్టివాడు పవిత్రత పొందు వరకు ప్రతిష్ఠితమైన వాటిలో దేనిని తినకూడదు. శవము వలని అపవిత్రతగల దేనినైనను ముట్టువాడును స్ఖలితవీర్యుడును, | 5 అపవిత్రమైన పురుగునేమి యేదో ఒక అపవిత్రత వలన అపవిత్రుడైన మనుష్యునినేమి ముట్టువాడును, అట్టి అపవిత్రత తగిలినవాడును సాయంకాలము వరకు అపవిత్రుడగును. | 6 అతడు నీళ్లతో తన దేహమును కడుగుకొను వరకు ప్రతిష్ఠితమైన వాటిని తినకూడదు. | 7 సూర్యుడు అస్త మించినప్పుడు అతడు పవిత్రుడగును; తరువాత అతడు ప్రతిష్ఠితమైన వాటిని తినవచ్చును, అవి వానికి ఆహారమే గదా. | 8 అతడు కళేబరమునైనను చీల్చబడిన దానినైనను తిని దానివలన అపవిత్రపరచుకొనకూడదు; నేను యెహోవాను. | 9 కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరచి, దాని పాపభారమును మోసికొని దాని వలన చావకుండునట్లు ఈ విధిని ఆచరించవలెను; నేను వారిని పరిశుద్ధపరచు యెహోవాను. | 10 అన్యుడు ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు, యాజకుని యింట నివసించు అన్యుడేగాని జీతగాడేగాని ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు, | 11 అయితే యాజకుడు క్రయధనమిచ్చి కొనినవాడును అతని యింట పుట్టిన వాడును అతడు తిను ఆహారమును తినవచ్చును. | 12 యాజకుని కుమార్తె అన్యుని కియ్యబడిన యెడల ఆమె ప్రతిష్ఠితమైన వాటిలో ప్రతిష్ఠార్పణమును తినకూడదు. | 13 యాజకుని కుమార్తెలలో విధవరాలేగాని విడనాడబడినదే కాని సంతానము లేని యెడల ఆమె తన బాల్యమందువలె తన తండ్రి యింటికి తిరిగి చేరి తన తండ్రి ఆహారమును తినవచ్చును గాని అన్యుడెవడును దాని తినకూడదు. | 14 ఒకడు పొరబాటున ప్రతిష్ఠితమైన దానిని తినిన యెడల వాడు ఆ ప్రతిష్ఠితమైన దానిలో అయిదవ వంతు కలిపి దానితో యాజకునికియ్యవలెను. | 15 ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠితమైన వాటిని తినుట వలన అపరాధమును భరింపకుండునట్లు తాము యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములను అపవిత్రపరచకూడదు. | 16 నేను వాటిని పరిశుద్ధపరచు యెహోవానని చెప్పుము. | 17 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను | 18 -నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను ఇట్లు చెప్పుము - ఇశ్రాయేలీయుల యింటివారిలోనేగాని ఇశ్రాయేలీయులలో నివసించు పరదేశులలోనేగాని యెవడు యెహోవాకు దహనబలిగా స్వేచ్ఛార్పణములనైనను మ్రొక్కుబళ్లనైనను అర్పిం చునో | 19 వాడు అంగీకరింపబడినట్లు, గోవులలో నుండియైనను గొఱ్ఱెమేకలలోనుండియైనను దోషములేని మగ దానిని అర్పింపవలెను. | 20 దేనికి కళంకముండునో దానిని అర్పింపకూడదు; అది విూ పక్షముగా అంగీకరింపబడదు. | 21 ఒకడు మ్రొక్కుబడిని చెల్లించుటకేగాని స్వేచ్ఛార్పణము అర్పించుటకేగాని సమాధానబలి రూపముగా గోవునైనను గొఱ్ఱెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడునట్లు దోషము లేనిదై యుండవలెను; దానిలో కళంకమేదియు నుండకూడదు. | 22 గ్రుడ్డిదేమి కుంటిదేమి కొరతగలదేమి గడ్డగలదేమి గజ్జిరోగముగలదేమి చిరుగుడుగలదేమి అట్టివాటిని యెహోవాకు అర్పింపకూడదు; వాటిలో దేనిని బలిపీఠము విూద యెహోవాకు హోమము చేయకూడదు. | 23 కురూపియైన కోడెనైనను గొఱ్ఱె మేకలమందలోని దానినైనను స్వేచ్ఛార్పణముగా అర్పింపవచ్చును గాని అది మ్రొక్కుబడిగా అంగీకరింపబడదు. | 24 విత్తులు నులిపిన దానినేగాని విరిగిన దానినేగాని చితికిన దానినేగాని కోయబడిన దానినేగాని యెహోవాకు అర్పింపకూడదు; విూ దేశములో అట్టి కార్యము చేయకూడదు; | 25 పరదేశి చేతినుండి అట్టి వాటిలో దేనిని తీసికొని విూ దేవునికి ఆహారముగా అర్పింపకూడదు; అవి లోపము గలవి, వాటికి కళంకములుండును, అవి విూ పక్షముగా అంగీకరింపబడవని చెప్పుము. | 26 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను | 27 -దూడయేగాని, గొఱ్ఱెపిల్లయేగాని, మేకపిల్లయేగాని పుట్టినప్పుడు అది యేడు దినములు దాని తల్లితో నుండవలెను. ఎనిమిదవనాడు మొదలుకొని అది యెహోవాకు హోమముగా అంగీకరింపతగును. | 28 అయితే అది ఆవైనను గొఱ్ఱె మేకలలోనిదైనను విూరు దానిని దానిపిల్లను ఒక్క నాడే వధింపకూడదు. | 29 విూరు కృతజ్ఞతాబలియగు పశువును వధించినప్పుడు అది విూ కొరకు అంగీకరింపబడునట్లుగా దానిని అర్పింపవలెను. | 30 ఆనాడే దాని తినివేయవలెను; మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగిలింపకూడదు; నేను యెహోవాను. | 31 విూరు నా ఆజ్ఞల ననుసరించి వాటి ప్రకారము నడుచుకొనవలెను; నేను యెహోవాను | 32 నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు, నేను ఇశ్రాయేలీయులలో నన్ను పరిశుద్ధునిగా చేసికొందును; | 33 నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. నేను విూకు దేవుడనై యుండునట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవానని చెప్పుము. |
||
| Previous | ||