BLM
 

 
Previous
  లేవీయకాండము 18 అధ్యాయము  

18 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను | 2 -నేను విూ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పుము. | 3 విూరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున విూరు చేయకూడదు; నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున విూరు చేయకూడదు; వాటి కట్టడలనుబట్టి నడవకూడదు. | 4 విూరు నా విధులను గైకొనవలెను; నా కట్టడలనుబట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను; విూ దేవుడనగు నేను యెహోవాను. | 5 విూరు నా కట్టడలను నా విధు లను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రదుకును; నేను యెహోవాను. | 6 విూలో ఎవరును తమ రక్తసంబంధుల మానాచ్ఛాదనమును తీయుటకు వారిని సవిూపింపకూడదు; నేను యెహోవాను. | 7 నీ తండ్రికి మానాచ్ఛాదనముగా నున్న నీ తల్లి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ తల్లి; ఆమె మానాచ్ఛాదనమును1 తీయకూడదు. | 8 నీ తండ్రి భార్య మానాచ్ఛాదనమును తీయకూడదు; అది నీ తండ్రిదే. | 9 నీ సహోదరి మానాచ్ఛాదనమును, అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపల పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్కయైనను నీ తల్లి కుమార్తె యొక్కయైనను మానాచ్ఛాదనమును తీయకూడదు. | 10 నీ కుమారుని కుమార్తె మానాచ్ఛాదనమునైనను కుమార్తె కుమార్తె మానాచ్ఛాదనమునైనను తీయకూడదు; అది నీది. | 11 నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి; ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు. | 12 నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదనమును తీయకూడదు. ఆమె నీ తండ్రి రక్తసంబంధి. | 13 నీ తల్లి సహోదరి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ తల్లి రక్తసంబంధి. | 14 నీ తండ్రి సహోదరుని మానాచ్ఛాదనమును తీయకూడదు, అనగా అతని భార్యను సవిూపింపకూడదు; ఆమె నీ పినతల్లి. | 15 నీ కోడలి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ కుమారుని భార్య, ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు. | 16 నీ సహోదరుని భార్య మానాచ్ఛాదనమును తీయకూడదు; అది నీ సహోదరుని మానము. | 17 ఒక స్త్రీ మానాచ్ఛాదనమును ఆమె కుమార్తె మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె కుమారుని కుమార్తె మానాచ్ఛాదనమునైనను ఆమె కుమార్తె కుమార్తె మానాచ్ఛాదనమునైనను తీయుటకు వారిని చేర్చుకొనకూడదు; వారు ఆమె రక్త సంబంధులు; అది దుష్కామ ప్రవర్తన. | 18 నీ భార్య బ్రదికి యుండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానాచ్ఛాదనమును తీయుటకు ఈమెను ఆమెతో పెండ్లి చేసి కొనకూడదు. | 19 అపవిత్రత వలన స్త్రీ కడగా ఉండునప్పుడు ఆమె మానాచ్ఛాదనమును తీయుటకు ఆమెను సవిూపింపకూడదు. | 20 నీ పొరుగువాని భార్యయందు నీ వీర్యస్ఖలము చేసి ఆమె వలన అపవిత్రత కలుగజేసికొన కూడదు. | 21 నీవు ఏ మాత్రమును నీ సంతానమును మోలెకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు; నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. | 22 స్త్రీ శయనమువలె పురుష శయనము కూడదు; అది హేయము. | 23 ఏ జంతువునందును నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలుగజేసికొనకూడదు. జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని యెదుట నిలువరాదు, అది విపరీతము. | 24 వీటిలో దేని వలనను అపవిత్రత కలుగజేసికొనకూడదు. నేను విూ యెదుట నుండి వెళ్లగొట్టుచున్న జనములు వా టన్నిటి వలన అపవిత్రులైరి. | 25 ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దానివిూద దాని దోషశిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్లగ్రక్కివేయుచున్నది. | 26-28 కాబట్టి ఆ దేశము విూకంటె ముందుగానున్న ప్రజలను వెళ్లగ్రక్కివేసిన ప్రకారము విూ అపవిత్రతనుబట్టి మిమ్మును వెళ్లగ్రక్కివేయకుండునట్లు విూరు, అనగా స్వదేశియేగాని విూలో నివసించు పరదేశియేగాని యీ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక, యీ నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. | 29 ఎవరు అట్టి హేయ క్రియలలో దేనినైనను చేయుదురో వారు ప్రజలలో నుండి కొట్టివేయబడుదురు. | 30 కాబట్టి విూకంటె ముందుగా నున్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుట వలన అపవిత్రత కలుగజేసికొన కుండునట్లు నేను విూకు విధించిన విధి ననుసరించి నడుచుకొనవలెను. నేను విూ దేవుడనైన యెహోవాను.

1. మానమును కప్పేది.
Previous