|
||
| Previous | ||
| లేవీయకాండము 17 అధ్యాయము | ||
17 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. | 2 -నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను ఈలాగు చెప్పుము - ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట | 3-4 ఇశ్రాయేలీయుల కుటుంబములలో యెహోవా మందిరము ఎదుట యెహోవాకు అర్పణము అర్పించుటకు పూనుకొనువాడు అది ఎద్దేగాని గొఱ్ఱెయేగాని మేకయేగాని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు దానిని ముందు తేక పాళె ములో వధించినను పాళెమునకు వెలుపల వధించినను ఆ మనుష్యుడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును; వాడు రక్తమును ఒలికించిన వాడు; | 5 ఇశ్రాయేలీయులు బయట వధించుచున్న బలిపశువులను ఇక బయట వధింపక యెహోవా పేరట యాజకుని యొద్దకు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకే తీసికొని వచ్చి సమాధాన బలిగా అర్పించునట్లు ఆ మనుష్యుడు జనులలో నుండి | కొట్టివేయబడవలెను. | 6 యెహోవాకు ఇంపైన సువాసన గలుగునట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దనున్న యెహోవా బలిపీఠము విూద వాటి రక్తమును ప్రోక్షించి వాటి క్రొవ్వును దహింపవలెను. | 7 వారు వ్యభిచారులై అనుసరించుచు వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇకవిూదట తమ బలిపశువులను వధింపరాదు. ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడ. | 8-9 మరియు నీవు వారితో ఇట్లనుము-ఇశ్రాయేలీయుల కుటుంబములలోగాని విూలో నివసించు పరదేశులలో గాని ఒకడు దహనబలినైనను వేరొక యే బలినైనను యెహోవాకు అర్పింప నుద్దేశముగలవాడై ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు తీసికొని రాని యెడల ఆ మనుష్యుడు జనులలో నుండి కొట్టివేయబడును. | 10 మరియు ఇశ్రాయేలీయుల కుటుంబములలోనేమి, విూలో నివసించు పరదేశులలోనేమి, ఒకడు దేని రక్త మును తినినను రక్తము తినువానికి నేను విముఖుడనై జనులలో నుండి వాని కొట్టివేయుదును. | 11 రక్తము దేహమునకు ప్రాణము. విూ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము విూద పోయుటకై దానిని విూకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమునుబట్టి ప్రాయశ్చిత్తము చేయును. | 12 కాబట్టి విూలో ఎవడును రక్తము తినకూడదనియు, విూలో నివసించు ఏ పరదేశియు రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని. | 13 మరియు ఇశ్రాయేలీయులలోనేగాని విూలో నివసించు పరదేశులలోనేగాని ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టిన యెడల వాడు దాని రక్తమును ఒలికించి మంటితో కప్పవలెను; ఏలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము; | 14 దాని రక్తము దాని ప్రాణమునకాధారము. కాబట్టి విూరు ఏ దేహ రక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వ దేహములకు ప్రాణాధారము; దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నొందునని నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని. | 15 మరియు కళేబరమునైనను చీల్చబడిన దానినైనను తిను ప్రతివాడు దేశమందు పుట్టినవాడేమి పరదేశియేమి వాడు తన బట్టలను ఉదుకుకొని నీళ్లతో దేహమును కడుగుకొని సాయంకాలము వరకు అపవిత్రుడగును. తరువాత పవిత్రుడగును. | 16 అయితే వాడు వాటిని ఉదుకుకొనకయు తన దేహమును కడుగుకొనకయు ఉండిన యెడల వాడు తన దోషశిక్షను భరించును. |
||
| Previous | ||