|
||
| Previous | ||
| లేవీయకాండము 16 అధ్యాయము | ||
16 అహరోను ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధికి సవిూపించి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాటలాడి ఇట్లనెను | 2 -నేను కరుణాపీఠము విూద మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావకయుండునట్లు అతడు మందసము విూది కరుణాపీఠము ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడును రాకూడదని అతనితో చెప్పుము. | 3 అతడు పాపపరిహారార్థబలిగా ఒక కోడెదూడను దహనబలిగా ఒక పొట్టేలును తీసికొని, వీటితో పరిశుద్ధస్థలములోనికి రావలెను. | 4 అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుగుకొని, తన మానమునకు సన్ననార లాగులు తొడుగుకొని, సన్ననార దట్టి కట్టుకొని సన్ననార పాగా పెట్టుకొనవలెను. అవి ప్రతిష్ఠ వస్త్రములు గనుక అతడు నీళ్లతో దేహము కడుగుకొని వాటిని వేసికొనవలెను. | 5 మరియు అతడు ఇశ్రాయేలీయుల సమాజమునొద్ద నుండి పాపపరిహారార్థబలిగా రెండు మేక పిల్లలను దహనబలిగా ఒక పొట్టేలును తీసికొని రావలెను. | 6 అహరోను తన కొరకు పాపపరిహారార్థబలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన యింటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి | 7 ఆ రెండు మేకపిల్లలను తీసికొని వచ్చి, ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. | 8 అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని, విడిచిపెట్టే మేక1 పేరట ఒక చీటిని ఆ రెండు మేకల విూద రెండు చీట్లను వేయవలెను. | 9 ఏ మేక విూద యెహోవా పేరట చీటి పడునో, ఆ మేకను అహరోను తీసికొని వచ్చి పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను. | 10 ఏ మేక విూద విడిచిపెట్టుట1 అనే చీటి పడునో దానివలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు, దానిని1 అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను. | 11 అప్పుడు అహరోను పాపపరిహారార్థబలియగు ఆ కోడెను తీసికొని వచ్చి తన నిమిత్తమును తన యింటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. తరువాత అతడు తన కొరకు తానర్పించు పాపపరిహారార్థబలియగు కోడెను వధించి | 12 యెహోవా సన్నిధినున్న ధూపపీఠము విూద నుండి ధూపార్తెడు నిప్పులను, తన పిడికెళ్లతో పరి మళ ధూపచూర్ణమును తీసికొని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు | 13 ఆ ధూపము మేఘమువలె శాసనముల విూదనున్న కరుణాపీఠమును కమ్ముటకు, యెహోవా సన్నిధిని ఆ అగ్నివిూద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను. | 14 అప్పుడతడు ఆ కోడె రక్తములో కొంచెము తీసికొని తూర్పు ప్రక్కను కరుణాపీఠము విూద తన వ్రేలితో ప్రోక్షించి, కరుణాపీఠము ఎదుట తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము ఏడుమారులు ప్రోక్షింపవలెను. | 15 అప్పుడతడు ప్రజలర్పించు పాపపరిహారార్థబలియగు మేకను వధించి అడ్డతెరలోనికి దాని రక్తము తెచ్చి ఆ కోడెరక్త ముతో చేసినట్లు దీని రక్తముతోను చేసి, కరుణాపీఠము విూదను కరుణాపీఠము ఎదుటను దాని ప్రోక్షింపవలెను. | 16 అట్లు అతడు ఇశ్రాయేలీయుల సమస్త పాపములనుబట్టియు, అనగా వారి అపవిత్రతనుబట్టియు, వారి అతి క్రమములనుబట్టియు పరిశుద్ధస్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతనుబట్టి అది అపవిత్రమగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. | 17 పరిశుద్ధస్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తమును తన యింటి వారి నిమిత్తమును ఇశ్రాయేలీయుల సమస్త సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి బయటికి వచ్చు వరకు ఏ మనుష్యుడును ప్రత్యక్షపు గుడారములో ఉండరాదు. | 18 మరియు అతడు యెహోవా సన్నిధినున్న బలిపీఠము నొద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. అతడు ఆ కోడెరక్తములో కొంచెమును ఆ మేక రక్తములో కొంచెమును తీసికొని బలిపీఠపు కొమ్ముల విూద చమిరి | 19 యేడుమారులు తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము దానివిూద ప్రోక్షించి దాని పవిత్రపరచి ఇశ్రాయేలీయుల అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచవలెను. | 20 అతడు పరిశుద్ధస్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసికొని రావలెను. | 21 అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తలవిూద తన రెండు చేతులు ఉంచి, ఇశ్రాయేలీయుల పాపములన్నియు, అనగా వారి దోషములన్నియు వారి అతిక్రమములన్నియు దానివిూద ఒప్పుకొని, ఆ మేక తలవిూద వాటిని మోపి, తగిన మనుష్యునిచేత అరణ్యములోనికి దాని పంపవలెను. | 22 ఆ మేక వారి దోషములన్నిటిని ఎడారి దేశమునకు భరించి పోవును. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్ట వలెను. | 23 అప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారము లోనికి వచ్చి, తాను పరిశుద్ధస్థలములోనికి వెళ్లినప్పుడు తాను వేసికొనిన నారబట్టలను తీసి అక్కడ వాటిని ఉంచి | 24 పరిశుద్ధస్థలములో దేహమును నీళ్లతో కడుగుకొని బట్టలు తిరిగి ధరించుకొని బయటికి వచ్చి తన కొరకు దహన బలిని ప్రజల కొరకు దహనబలిని అర్పించి, తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను. | 25 పాప పరిహారార్థబలి పశువు యొక్క క్రొవ్వును బలిపీఠము విూద దహింపవలెను. | 26 విడిచిపెట్టే మేకను వదలిన వాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో దేహము కడుకుకొని తరువాత పాళెములోనికి రావలెను. | 27 పరిశుద్ధస్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేబడెనో పాపపరిహారార్థబలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాళెము వెలుపలికి తీసికొని పోవలెను. వాటి చర్మములను వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చివేయవలెను. | 28 వాటిని కాల్చివేసిన వాడు తన బట్టలు ఉదుకు కొని నీళ్లతో దేహము కడుగుకొని తరువాత పాళెము లోనికి రావలెను. | 29 ఇది విూకు నిత్యమైన కట్టడ. స్వదేశులుగాని విూ మధ్యనుండు పరదేశులుగాని విూరందరు ఏడవనెల పదియవ నాడు ఏ పనియైనను చేయక మిమ్మును విూరు దుఃఖపరచుకొనవలెను. | 30 ఏలయనగా విూరు యెహోవా సన్నిధిని విూ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు విూ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. | 31 అది విూకు మహా విశ్రాంతి దినము. మిమ్మును విూరు దుఃఖపరచుకొనవలెను; ఇది నిత్యమైన కట్టడ. | 32 ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడగుటకై అభి షేకము పొంది తన్ను ప్రతిష్ఠించుకొనునో ఆ యాజకుడు ప్రాయశ్చిత్తము చేసికొని నార వస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకొనవలెను. | 33 మరియు అతడు అతి పరిశుద్ధముగానున్న మందిరమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేయవలెను. మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్త మును ప్రాయశ్చిత్తము చేయవలెను. | 34 సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలీయుల సమస్త పాపములనుబట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది విూకు నిత్యమైన కట్టడ. యెహోవా మోషేకు ఆజ్ఞాపించునట్లు అతడు చేసెను. 1. అజాజేలు. |
||
| Previous | ||