BLM
 

 
Previous
  లేవీయకాండము 15 అధ్యాయము  

15 మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను | 2 -విూరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి- ఒకని దేహమందు స్రావమున్న యెడల ఆ స్రావము వలన వాడు అపవిత్రుడగును. | 3 వాని స్రావము కారినను కారక పోయినను ఆ దేహస్థితినిబట్టి వాడు అపవిత్రుడగును. ఆ స్రావముగలవాడు పండుకొను ప్రతి పరుపు అపవిత్రము; | 4 వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రము. | 5 వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. | 6 అట్టివాడు దేనివిూద కూర్చుండునో దాని విూద కూర్చుండువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. | 7 స్రావముగలవాని దేహమును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. | 8 స్రావముగల వాడు పవిత్రుని విూద ఉమ్మివేసిన యెడల వాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. | 9 స్రావముగలవాడు కూర్చుండు ప్రతి పల్లము అపవిత్రము. | 10 వాని క్రిందనుండిన యే వస్తువునైనను ముట్టు ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. వాటిని మోయువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. | 11 స్రావము గలవాడు నీళ్లతో చేతులు కడుగుకొనకయే ఎవని ముట్టునో వాడు తన బట్టలు ఉదుకుకొని స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. | 12 స్రావము గలవాడు ముట్టుకొనిన మంటి పాత్రను పగలగొట్టవలెను, ప్రతి చెక్క పాత్రను నీళ్లతో కడుగవలెను. | 13 స్రావము గలవాడు తన స్రావము నుండి పవిత్రత పొందునప్పుడు, తన పవిత్రత విషయమై యేడు దినములు లెక్కించుకొని తన బట్టలు ఉదుకుకొని పారు నీటితో ఒడలను కడుగుకొని పవిత్రు డగును. | 14 ఎనిమిదవనాడు రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను తీసికొని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు వచ్చి యెహోవా సన్నిధిని వాటిని యాజకుని కప్పగింపవలెను. | 15 యాజకుడు వాటిలో ఒక దానిని పాపపరిహారార్థబలిగాను ఒక దానిని దహనబలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని స్రావము విషయములో యెహోవా సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. | 16 ఒకనికి వీర్యస్ఖలనమైన యెడల వాడు సర్వాంగ స్నానము చేసికొని సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. | 17 ఏ బట్ట విూదను ఏ తోలు విూదను వీర్యస్ఖలనమగునో ఆ బట్టయు ఆ తోలును నీళ్లతో ఉదుకబడి సాయంకాలము వరకు అపవిత్రమై యుండును. | 18 వీర్యస్ఖలనమగునట్లు స్త్రీ పురుషులు శయనించిన యెడల వారిద్దరు నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రులై యుందురు. | 19 స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైన యెడల ఆమె యేడు దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టు వారందరు సాయంకాలము వరకు అపవిత్రులగుదురు. | 20 ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేనివిూద పండుకొనునో అది అపవిత్రమగును; ఆమె దేనివిూద కూర్చుండునో అది అపవిత్రమగును. | 21 ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. | 22 ఆమె దేనివిూద కూర్చుండునో దాని ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. | 23 అది ఆమె పరుపు విూదనైనను ఆమె కూర్చుండిన దానివిూదనైనను ఉండిన యెడల దానిని ముట్టు వాడు సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. | 24 ఒకడు ఆమెతో శయనించుచుండగా ఆమె రజస్సు వానికి తగిలిన యెడల, వాడు ఏడు దినములు అపవిత్రు డగును; వాడు పండుకొను ప్రతి మంచము అపవిత్రము. | 25 ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంక అనేక దినములు స్రవించినను ఆమె కడగానుండు కాలమైన తరువాత స్రవించినను, ఆమె అపవిత్రత ఆమె కడగానుండు దినములలోవలెనే ఆ స్రావదినములన్నియు ఉండును, ఆమె అపవిత్రురాలు. | 26 ఆమె స్రావదినములన్నియు ఆమె పండుకొను ప్రతి మంచము ఆమె కడగానున్నప్పటి మంచమువలె ఉండవలెను. ఆమె దేనివిూద కూర్చుండునో అది ఆమె కడగా ఉన్నప్పటి అపవిత్రతవలె అపవిత్రమగును. | 27 వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు. వాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. | 28 ఆమె ఆ స్రావము కుదిరి పవిత్రురాలైన యెడల ఆమె యేడు దినములు లెక్కించుకొని అవి తీరిన తరువాత పవిత్రురాలగును. | 29 ఎనిమిదవనాడు ఆమె రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తేవలెను. | 30 యాజకుడు ఒక దానిని పాపపరిహారార్థబలిగాను ఒక దానిని దహనబలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు ఆమె స్రావవిషయమై యెహోవా సన్నిధిని ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. | 31 ఇశ్రాయేలీయులు తమ మధ్యనుండు నా నివాసస్థల మును అపవిత్రపరచునప్పుడు వారు తమ అపవిత్రత వలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలుగుకుండ విూరు వారిని కాపాడవలెను. | 32 స్రావముగలవాని గూర్చియు, వీర్యస్ఖలనము వలని అప విత్రతగలవాని గూర్చియు, కడగానున్న బలహీనురాలిని గూర్చియు, స్రావముగల స్త్రీ పురుషులను గూర్చియు, అపవిత్రురాలితో శయనించువాని గూర్చియు విధింపబడినది ఇదే.

Previous