BLM
 

 
Previous
  లేవీయకాండము 19 అధ్యాయము  

19 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను - ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో ఇట్లు చెప్పుము. | 2 విూరు పరిశుద్ధులై యుండవలెను. విూ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై యున్నాను. | 3 విూలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను; నేను విూ దేవుడనైన యెహోవాను. | 4 విూరు వ్యర్ధమైన దేవతలతట్టు తిరుగకూడదు. విూరు పోత విగ్రహములను చేసికొనకూడదు. నేను విూ దేవుడనైన యెహోవాను. | 5 విూరు యెహోవాకు సమాధానబలి అర్పించునప్పుడు అది అంగీకరింపబడునట్లుగా అర్పింపవలెను. | 6 విూరు బలినర్పించునాడైనను మరునాడైనను దాని తినవలెను. మూడవ నాటి వరకు మిగిలియున్న దానిని అగ్నితో కాల్చివేయవలెను. | 7 మూడవనాడు దానిలో కొంచెమైనను తినిన యెడల అది హేయమగును; అది అంగీకరింపబడదు. | 8 దానిని తినువాడు తన దోషశిక్షను భరించును. వాడు యెహోవాకు పరిశుద్ధమైన దానిని అపవిత్రపరచెను. వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును. | 9 విూరు విూ భూమి పంటను కోయునప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు; నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు; నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు; | 10 నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను; | 11 నేను విూ దేవుడనైన యెహోవాను. విూరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు; | 12 నా నామమునుబట్టి అబద్ధ ప్రమా ణము చేయకూడదు; నీ దేవుని నామమును అపవిత్రపరచ కూడదు; నేను యెహోవాను. | 13 నీ పొరుగువాని హింసింపకూడదు; వాని దోచుకొనకూడదు, కూలి వాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు; | 14 చెవిటివాని తిట్టకూడదు, గ్రుడ్డివాని యెదుట అడ్డము వేయకూడదు; నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను. | 15 అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు; న్యాయమునుబట్టి నీ పొరుగు వానికి తీర్పు తీర్చవలెను. | 16 నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరుగకూడదు, నీ సహోదరునికి ప్రాణ హానిచేయ చూడకూడదు, నేను యెహోవాను. | 17 నీ హృదయములో నీ సహోదరుని విూద పగపట్టకూడదు, నీ పొరుగువాని పాపము నీ విూదికి రాకుండునట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను. | 18 కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజల విూద కోపముంచు కొనక నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను; నేను యెహోవాను. | 19 విూరు నా కట్టడలను ఆచరింపవలెను; నీ జంతువులను ఇతర జాతి జంతువులను కలియ నీయకూడదు; నీ పొలములో వేరు వేరు జాతుల విత్తన ములు చల్లకూడదు; బొచ్చును నారయు కలిసిన బట్ట వేసికొనకూడదు. | 20 ఒకనికి ప్రధానము చేయబడిన దాసి, వెలయిచ్చి విమోచింపబడకుండగానేమి ఊరక విడిపింప బడకుండగానేమి ఒకడు దానితో శయనించి వీర్యస్ఖలనము చేసిన యెడల వారిని శిక్షింపవలెను. అది విడిపింపబడలేదు గనుక వారికి మరణశిక్ష విధింపకూడదు. | 21 అతడు అపరాధ పరిహారార్థబలిని, అనగా అపరాధపరిహారార్థబలియగు పొట్టేలును ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధికి తీసికొని రావలెను. | 22 అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపమునుబట్టి పాపపరిహారార్థబలియగు పొట్టేలు వలన యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. దీనివలన అతడు చేసిన పాపము విషయమై అతనికి క్షమాపణ కలుగును. | 23 విూరు ఆ దేశమునకు వచ్చి ఆహారమునకై నానావిధములైన చెట్లను నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రముగా ఎంచవలెను. వాటి కాపు విూకు ఎక్కువగా ఉండునట్లు అవి మూడు సంవత్సరముల వరకు విూకు అపవిత్రములుగా ఉండవలెను, వాటిని తినకూడదు. | 24 నాలుగవ సంవత్సరమున వాటి ఫలములన్నియు యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తుతియాగ ద్రవ్యములగును; అయిదవ సంవత్సరమున వాటి ఫలము లను తినవచ్చును; | 25 నేను విూ దేవుడనైన యెహోవాను. | 26 రక్తము కూడినదేదియు తినకూడదు, శకునములు చూడకూడదు, మంత్రయోగములు చేయకూడదు, | 27 విూ నుదుటి వెండ్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు, నీ గడ్డపు ప్రక్కలను గొరగకూడదు, | 28 చచ్చిన వారి కొరకు విూ దేహమును చీరుకొనకూడదు, పచ్చబొట్లు విూ దేహమునకు పొడుచుకొనకూడదు; నేను విూ దేవుడనైన యెహోవాను. | 29 విూ దేశము వ్యభిచరింపకయు దుష్కామ ప్రవర్తనతో నిండకయు ఉండునట్లు నీ కుమార్తె వ్యభిచారిణియగుటకై ఆమెను వేశ్యగా చేయకూడదు. | 30 నేను నియమించిన విశ్రాంతి దినములను విూరు ఆచరింపవలెను నా పరిశుద్ధస్థలమును మన్నింపవలెను; నేను యెహోవాను. | 31 కర్ణపిశాచిగలవారి దగ్గరకు పోకూడదు, సోదెగాండ్రను వెదకి వారి వలన అపవిత్రత కలుగజేసికొనకూడదు; నేను విూ దేవుడనైన యెహోవాను. | 32 తల నెరసిన వాని యెదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరచి నీ దేవునికి భయపడవలెను; నేను యెహోవాను. | 33 విూ దేశమందు పరదేశి నీ మధ్య నివసించునప్పుడు వానిని బాధింపకూడదు, | 34 విూ మధ్య నివసించు పరదేశిని విూలో పుట్టిన వానివలె ఎంచవలెను, నిన్నువలె వానిని ప్రేమింపవలెను, ఐగుప్తు దేశములో విూరు పరదేశులైయుంటిరి; నేను విూ దేవుడనైన యెహోవాను. | 35 తీర్పు తీర్చునప్పుడు కొలతలోగాని తూనికెలోగాని పరిమాణములోగాని విూరు అన్యాయము చేయకూడదు. | 36 న్యాయమైన త్రాసులు న్యాయమైన గుండ్లు న్యాయమైన తూము న్యాయమైన పడి విూకుండవలెను; నేను ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన విూ దేవుడైన యెహోవాను. | 37 కాగా విూరు నా కట్టడలన్నిటిని నా విధులన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను; నేను యెహోవాను.

Previous