|
||
| Previous | ||
| లేవీయకాండము 12 అధ్యాయము | ||
12 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను | 2 -నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము-ఒక స్త్రీ గర్భవతియై మగపిల్లను కనిన యెడల ఆమె యేడు దినములు పురిటాలై యుండవలెను. ఆమె తాను ముట్టుదై కడగానుండు దినముల లెక్కనుబట్టి పురిటాలై యుండ వలెను. | 3 ఎనిమిదవ దినమున బిడ్డకు సున్నతి చేయింప వలెను. | 4 ఆమె తన రక్తశుద్ధి కొరకు ముప్పది మూడు దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. | 5 ఆమె ఆడుపిల్లను కనిన యెడల ఆమె తాను కడగా ఉండునప్పటివలె రెండు వారములు పురిటాలై ఉండవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు ఆరువదియారు దినములు కడగా ఉండవలెను. | 6 కుమారుని కొరకేగాని కుమార్తె కొరకేగాని ఆమె శుద్ధిదిన ములు సంపూర్తియైన తరువాత ఆమె దహనబలిగా ఒక యేడాది గొఱ్ఱెపిల్లను, పాపపరిహారార్థబలిగా ఒక పావు రపు పిల్లనైనను తెల్లగువ్వనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తీసికొని రావలెను. | 7 అతడు యెహోవా సన్నిధిని దాని నర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడును. ఇది మగపిల్లనుగాని ఆడు పిల్లనుగాని కనిన స్త్రీని గూర్చిన విధి. | 8 ఆమె గొఱ్ఱె పిల్లను తేజాలని యెడల ఆమె రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను దహనబలిగా ఒక దానిని, పాపపరిహారార్థబలిగా ఒక దానిని తీసికొని రావలెను. యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును. |
||
| Previous | ||