|
||
| Previous | ||
| లేవీయకాండము 11 అధ్యాయము | ||
11 మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను | 2 -విూరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి -భూమి విూదనున్న జీవులన్నిటిలోను విూరు ఈ జీవులను మాత్రము తినవచ్చును; | 3 జంతువులలో ఏది డెక్కలుగలదై నెమరువేయునో దాని తినవచ్చును గాని | 4 నెమరు వేయు వాటిలోను రెండు డెక్కలుగల వాటిలోను వీటిని తినకూడదు, ఒంటె నెమరు వేయును గాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది విూకు అపవిత్రము. | 5 పొట్టి కుందేలు నెమరు వేయును గాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది విూకు అపవిత్రము. | 6 కుందేలు నెమరు వేయును గాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది విూకు అపవిత్రము. | 7 పంది విడిగానుండు రెండు డెక్కలు గలదిగాని అది నెమరు వేయదు గనుక అది విూకు అపవిత్రము. | 8 వాటి మాంసమును విూరు తినకూడదు; వాటి కళేబరములను ముట్టకూడదు; అవి విూకు అపవిత్రములు. | 9 జలచరములన్నిటిలో వీటిని తినవచ్చును; సముద్రములోనేమి, నదులలోనేమి, యే నీళ్లలోనేమి, వేటికి రెక్కలు పొలుసులు ఉండునో వాటిని తినవచ్చును. | 10 సముద్రములోనేమి, నదులలోనేమి, సమస్త జలచరముల లోను సమస్త జలజంతువులలోను వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నియు విూకు హేయములు; | 11 అవి విూకు హేయములుగానే ఉండవలెను. వాటి మాంసమును తినకూడదు, వాటి కళేబరములను హేయములుగా ఎంచుకొనవలెను. | 12 నీళ్లలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది విూకు హేయము. | 13 పకక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను. వీటిని తినవద్దు ఇవి హేయములు; పక్షిరాజు, పెద్ద బోరువ, | 14 క్రౌంచపక్షి, గద్ద, తెల్లగద్ద, ప్రతివిధమైన గద్ద, | 15 ప్రతివిధమైన కాకి | 16 నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతివిధమైన డేగ, | 17 పైగిడికంటె, చెరువు కాకి, గుడ్లగూబ, హంస, గూడబాతు, నల్లబోరువ, | 18 సంకుబుడి కొంగ, ప్రతివిధమైన కొంగ, | 19 కుకుడుగువ్వ, గబ్బిలము. | 20 రెక్కలు కలిగి నాలుగు కాళ్లతో చరించు చరము లన్నియు విూకు హేయములు. | 21 అయితే నాలుగు కాళ్లతో చరించుచు నేల గంతులు వేయుటకు కాళ్ల విూద తొడలుగల పురుగులన్ని తినవచ్చును. | 22 నేత మిడతగాని చిన్న మిడతగాని ఆకుమిడతగాని మిడతలలో ప్రతివిధమైనది తినవచ్చును. | 23 నాలుగు కాళ్లుగల పురుగులన్నియు విూకు హేయములు. | 24 వాటి వలన విూరు అపవిత్రులగుదురు వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును. | 25 వాటి కళేబరములలో కొంచెమైనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలము వరకు అపవిత్రుడగును. | 26 రెండు డెక్కలుగల జంతువులన్నిటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు, నెమరువేయకయు నుండునవి విూకు అపవిత్రములు, వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు అపవిత్రుడగును. | 27 నాలుగు కాళ్లతో నడుచు సమస్త జీవరాసులలో ఏవి అరకాలితో నడుచునో అవన్నియు అపవిత్రములు; వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును; | 28 వాటి కళేబరమును మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలము వరకు అపవిత్రు డగును; అవి విూకు అపవిత్రమైనవి. | 29 నేలవిూద ప్రాకు జీవరాసులలో విూకు అపవిత్రమైనవి ఏవేవనగా, చిన్నముంగిస, చిన్నపందికొక్కు, ప్రతి విధమైన బల్లి, | 30 ఊసరవెల్లి, నేలమొసలి, తొండ, సరటము, అడవి యెలుక. | 31 ప్రాకు వాటిలో ఇవి విూకు అపవిత్రములు; ఇవి చచ్చిన తరువాత వీటిని ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును. | 32 వాటిలో చచ్చిన దాని కళేబరము దేనివిూద పడునో అది అపవిత్రమగును. అది చెక్క పాత్రయేగాని బట్టయేగాని చర్మమేగాని సంచియేగాని పనిచేయు ఉపకరణము ఏదియుగాని అయిన యెడల దానిని నీళ్లలో వేయవలెను. అది సాయంకాలము వరకు అపవిత్రమైయుండును; తరువాత అది పవిత్రమగును. | 33 వీటిలో ఏదైనను మంటి పాత్రలో పడిన యెడల దానిలోనిదంతయు అపవిత్రమగును; విూరు దానిని పగుల గొట్టవలెను. | 34 తినదగిన ఆహారమంతటిలో దేనివిూద ఆ నీళ్లు పడునో అది అపవిత్రమగును. అట్టి పాత్రలో త్రాగిన యే పానీయమును అపవిత్రము. | 35 వాటి కళే బరములలో కొంచెము దేనివిూద పడునో అది అపవిత్రమగును. అది పొయ్యియైనను కుంపటియైనను దానిని పగులగొట్టవలెను. అవి అపవిత్రములు, అవి విూకు అపవిత్రములుగా ఉండవలెను. | 36 అయితే విస్తారమైన నీళ్లుగల ఊటలోగాని గుంటలోగాని కళేబరము పడినను ఆ నీళ్లు అపవిత్రములు కావు గాని కళేబరమునకు తగిలినది అపవిత్రమగును. | 37 వాటి కళేబరములలో కొంచెము విత్తుకట్టు విత్తనముల విూద పడినను అవి అపవిత్రములు కావు గాని | 38 ఆ విత్తన ములవిూద నీళ్లు పోసిన తరువాత కళేబరములో కొంచెము వాటివిూద పడిన యెడల అవి విూకు అపవిత్రములగును. | 39 విూరు తినదగిన జంతువులలో ఏదైనను చచ్చిన యెడల దాని కళేబరమును ముట్టువాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును. | 40 దాని కళేబరములో ఏదైనను తినువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలము వరకు అపవిత్రుడగును. దాని కళేబరమును మోయువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలము వరకు అపవిత్రుడగను. | 41 నేల విూద ప్రాకు జీవరాసులన్నియు హేయములు, వాటిని తినకూడదు. | 42 నేల విూద ప్రాకు జీవరాసులన్నిటిలో కడుపుతో చరించు దానినైనను నాలుగు కాళ్లతో చరించు దానినైనను చాలా కాళ్లుగల దానినైనను విూరు తినకూడదు; అవి హేయములు. | 43 ప్రాకు జీవరాసులలో దేనినైనను తిని మిమ్మును విూరు హేయపరచుకొనకూడదు; వాటివలన అపవిత్రులగునట్లు వాటి వలన అపవిత్రత కలుగ జేసికొనకూడదు. | 44 నేను విూ దేవుడనైన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక విూరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును విూరు పరిశుద్ధపరచుకొనవలెను. నేలవిూద ప్రాకు జీవరాసులలో దేని వలనను మిమ్మును విూరు అపవిత్రపరచుకొనకూడదు. | 45 నేను విూకు దేవుడనై యుండుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక విూరును పరిశుద్ధులు కావలెను. | 46 అపవిత్రమైన దానికి పవిత్రమైన దానికిని తినదగిన జంతువులకును తినదగని జంతువులకును భేదము చేయునట్లు | 47 జంతువులను గూర్చియు, పకక్షులను గూర్చియు, జలచరములైన సమస్త జీవులను గూర్చియు, నేలవిూద ప్రాకు సమస్త జీవులను గూర్చియు చేసిన విధి యిదే అని చెప్పుమనెను. |
||
| Previous | ||