|
||
| Previous | ||
| లేవీయకాండము 09 అధ్యాయము | ||
9 ఎనిమిదవ దినమున మోషే అహరోనును అతని కుమారులను ఇశ్రాయేలీయుల పెద్దలను పిలిపించి | 2 అహరోనుతో ఇట్లనెను-నీవు పాపపరిహారార్థబలిగా నిర్దోషమైన యొక కోడెదూడను, దహనబలిగా నిర్దోషమైన యొక పొట్టేలును యెహోవా సన్నిధికి తీసికొని రమ్ము. | 3 మరియు నీవు ఇశ్రాయేలీయులతో -విూరు యెహోవా సన్నిధిని బలి నర్పించునట్లు పాపపరిహారార్థబలిగా నిర్దోషమైన మేకపిల్లను, దహనబలిగా నిర్దోషమైన యేడాది దూడను గొఱ్ఱెపిల్లను | 4 సమాధానబలిగా కోడెను పొట్టేలును నూనె కలిపిన నైవేద్యమును తీసికొని రండి; నేడు యెహోవా విూకు కనబడును అని చెప్పుము. | 5 మోషే ఆజ్ఞాపించిన వాటిని వారు ప్రత్యక్షపు గుడారము నెదుటికి తీసికొని వచ్చిరి. సమాజమంతయు దగ్గరకు వచ్చి యెహోవా సన్నిధిని నిలువగా | 6 మోషే-విూరు చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించినది ఇదే; అట్లు చేయుడి. అప్పుడు యెహోవా మహిమ విూకు కనబడుననెను. | 7 మరియు మోషే అహరోనుతో ఇట్లనెను-నీవు బలిపీఠమునొద్దకు వెళ్లి పాపపరిహారార్థబలిని దహనబలిని అర్పించి నీ నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ప్రజల కొరకు అర్పణము చేసి, యెహోవా ఆజ్ఞాపించినట్లు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. | 8 కాబట్టి అహరోను బలిపీఠము దగ్గరకు వెళ్లి తన కొరకు పాపపరిహారార్థబలిగా ఒక దూడను వధించెను. | 9 అహరోను కుమారులు దాని రక్తమును అతని యొద్దకు తేగా అతడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి బలిపీఠపు కొమ్ముల విూద దాని చమిరి బలిపీఠము అడుగున ఆ రక్తమును పోసెను. | 10 దాని క్రొవ్వును మూత్ర గ్రంథులను కాలేజము విూది వపను బలిపీఠము విూద దహించెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. | 11 దాని మాంసమును చర్మమును పాళెము వెలుపల అగ్నితో కాల్చివేసెను. | 12 అప్పుడతడు దహనబలి పశువును వధించెను. అహరోను కుమారులు అతనికి దాని రక్తమునప్పగింపగా అతడు బలిపీఠము చుట్టు దానిని ప్రోక్షించెను. | 13 మరియు వారు దహన బలిపశువు యొక్క తలను అవయవములను అతనికి అప్పగింపగా అతడు బలిపీఠము విూద వాటిని దహించెను. | 14 అతడు దాని ఆంత్రములను కాళ్లను కడిగి బలిపీఠము విూదనున్న దహనబలి ద్రవ్యముపైని దహించెను | 15 అతడు ప్రజల అర్పణమును తీసికొని వచ్చి ప్రజలు అర్పించు పాపపరిహారార్థబలియగు మేకను తీసికొని వధించి మొదటి దానివలె దీనిని పాపపరిహారార్థబలిగా అర్పించెను. | 16 అప్పుడతడు దహనబలి పశువును తీసికొని విధి చొప్పున దానినర్పించెను. | 17 అప్పు డతడు నైవేద్యమును తెచ్చి దానిలో నుండి చేరెడు తీసి ప్రాతఃకాలమందు చేసిన దహనబలిగాక బలిపీఠము విూద తీసిన దానిని దహించెను. | 18 మరియు మోషే ప్రజలు అర్పించు సమాధానబలి రూపమైన కోడెదూడను పొట్టే లును వధించెను. అహరోను కుమారులు దానిని రక్తమును అతనికి అప్పగింపగా అతడు బలిపీఠము చుట్టు దానిని ప్రోక్షించెను. | 19 మరియు వారు ఆ దూడ క్రొవ్వును మేకక్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రములను కప్పు క్రొవ్వును మూత్ర గ్రంథులను కాలేజము విూది వపను అప్పగించిరి. | 20 బోరల విూద క్రొవ్వును ఉంచిరి. అతడు బలిపీఠము విూద ఆ క్రొవ్వును దహించెను. | 21 బోరలను కుడి జబ్బను యెహోవా సన్నిధిలో అల్లాడించు అర్పణముగా అహరోను అల్లాడించెను అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. | 22 అప్పుడు అహరోను పాపపరిహారార్థబలిని దహనబలిని సమాధానబలిని అర్పించి, ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగివచ్చెను. | 23 మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలకందరికి కనబడెను. | 24 యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలువెళ్లి బలిపీఠము విూదనున్న దహనబలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చి వేసెను; ప్రజలందరు దానిని చూచి ఉత్సాహధ్వనిచేసి సాగిలపడిరి. |
||
| Previous | ||